Superbike
-
లగ్జరీ బైక్‌తో ‘పఠాన్’ స్టార్ హల్చల్: వీడియో వైరల్
సాక్షి, ముంబై: సాధారణ ప్రజలకంటే కూడా సెలబ్రిటీలకు లగ్జరీ కార్లు, బైకులపైన ఎక్కువ క్రేజు ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల బాలీవుడ్ స్టార్ 'జాన్ అబ్రహం' ఒక ఖరీదైన సుజుకి హయబుసా బైక్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 'పఠాన్' సినిమా అతి తక్కువ కాలంలోనే గొప్ప విజయం సాధించిన తరువాత 'జాన్ అబ్రహం' ఈ సరికొత్త 2023 మోడల్ హయబుసా కొనుగోలు చేశారు. ఈ మోడల్ ఇంకా భారతీయ మార్కెట్లో విడుదల కాలేదు. ధూమ్ సినిమాలో హయబుసా రైడ్ చేసి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచిన జాన్ ఇప్పుడు లేటెస్ట్ హుయాబుసా సొంతం చేసుకున్నాడు. ఈ 2023 హయబుసా బైకుని CBU (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మన దేశానికి దిగుమతి చేసుకోవాలి. ఈ బైక్ 1,340cc ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 187.4 బిహెచ్పి పవర్ మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ బైక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జాన్ అబ్రహం ఇప్పటికే తన గ్యారేజిలో యమహా వి-మ్యాక్స్, డుకాటి పానిగేల్, MV అగస్టా, కెటిఎమ్ 390, బిఎండబ్ల్యు ఎస్1000ఆర్ఆర్, అప్రిలియా RSV4 RF వంటి బైకుయ్లను కూడా కలిగి ఉన్నారు. అయితే ఇప్పుడు హయబుసా కొత్త అతిధిగా తన గ్యారేజిలో అడుగుపెట్టింది. నిజానికి జాన్ అబ్రహం కాలిఫోర్నియా సూపర్ బైక్ స్కూల్ నుంచి ప్రత్యేక రైడింగ్ శిక్షణ పొందాడు. -
యూత్ కోసం యమహా కొత్త సూపర్ బైక్
సాక్షి, న్యూఢిల్లీ: యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. కొత్తగా అభివృద్ధి చెందిన 847 సిసి, 3-సిలిండర్ ఇంజన్‌తో యూత్ ను ఆకట్టుకునేలా ఎంటీ-09లో కొత్త వెర్షన్ ను రూపొందించింది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) టెక్నాలజీ తమ బైక్ ప్రత్యేకత అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీని ధరను రూ. 10.88 లక్షల (ఢిల్లీలో ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. ఉన్నతమైన నైపుణ్యంతో భారతదేశంలో అందించే యమహా ఈ కొత్త వెర్షన్‌తో తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని యమహా మోటార్స్ ఇండియా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రాయ్ కురియన్ తెలిపారు. చురుకైన హ్యాండ్లింగ్ పనితీరు, పవర్ డెలివరీలో అద్భుతమైన దృఢత్వంతో దీన్ని విడుదల చేశామన్నారు. 600 సి.సి. స్పోర్ట్స్ మోడల్ నుంచి అప్‌గ్రేడ్ అవుతున్న యువతను లక్ష్యంగా పెట్టుకుని ఇండియాలో పూర్తిగా నిర్మించిన యూనిట్‌గా దిగుమతి చేసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. -
ఎంవీ అగస్టా ‘బ్రూటల్ 800’
రూ.15.59 లక్షలు న్యూఢిల్లీ: ‘ఎంవీ అగస్టా’ తాజాగా ‘2017 బ్రూటల్ 800’ సూపర్‌బైక్‌ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.15.59 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్)గా ఉంది. ఈ బైక్‌లో 796 సీసీ 3– సిలిండర్ ఇంజిన్, 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, క్విక్ స్విఫ్టర్, డీఆర్ఎల్ఎస్తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రేసింగ్ టైప్ రాడికల్ ఫ్రంట్ క్యాలిపెర్స్, 8 లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, 3 స్టెప్ ఏబీఎస్ సిస్టమ్, స్లిప్పర్ క్లచ్, ఇంజిన్ బ్రేకింగ్ కంట్రోల్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ పేర్కొంది. 2020కి సూపర్ ప్రీమియం బైక్స్ విభాగంలో 20% మార్కెట్‌ను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ఎంవీ ఆగస్టా ఇండియా ఎండీ అజింక్య ఫిరొడియా తెలిపారు.