ఫెస్టివల్‌ ఆఫర్‌, ఈ బైక్‌ కొంటే లక్ష వరకు.. | Yamaha Has Announced Special Offers And Finance Schemes On All Scooter Models | Sakshi
Sakshi News home page

Yamaha: ఫెస్టివల్‌ ఆఫర్‌, ఈ బైక్‌ కొంటే లక్ష వరకు..

Published Sun, Sep 12 2021 10:45 AM | Last Updated on Sun, Sep 12 2021 10:50 AM

Yamaha Has Announced Special Offers And Finance Schemes On All Scooter Models  - Sakshi

బైక్‌ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఫెస్టివల్‌ సీజన్‌ సందర్భంగా  పలు వాహనాలపై గిఫ్ట్‌ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్‌ ఫ్రైజ్‌లను అందిస్తున్నట్లు  యమహా ప్రకటించింది. 

యమహా  ఫాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్‌, రేజెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, యమహా ఫాసినో 125ఎఫ్‌ఐ వాహనాలపై ఆఫర్స్‌ ప్రకటించింది. ఈ ఆఫర్లు దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల యమహా ఇండియా లాంఛ్‌ చేసిన ఐబ్రిడ్‌ వెర్షన్‌ టూవీలర్స్‌ ఫాసినో 125ఎఫ్‌ఐ, రెడ్‌జేఆర్‌ 125ఎఫ్‌ఐ వాహనాలపై తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో వివిధ ఆఫర్లను పొందవచ్చు.  

   

తమిళనాడు మినహా మిగిలిన రాష్ట్రాల్లో  యమహా  ఫాసినో 125 ఎఫ్‌ఐ (నాన్‌ ఐబ్రిడ్‌),యమహా రేజడ్ఆర్ ఎఫ్‌ఐ(నాన్‌ ఐబ్రిడ్‌)వెర్షన్‌ వెహికల్స్‌ పై రూ.3,786 ఇన్సూరెన్స్‌ బెన్‌ఫిట్స్‌,రూ.999కే లో డౌన్‌ పేమెంట్స్‌ తో బైక్‌ ను సొంతం చేసుకోవచ్చు.అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్‌ కొనుగోలుపై  బంపర్‌ ఆఫర్‌ కింద  రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు...ఇన్య్సూరెన్స్‌ బెన్‌ఫిట్‌ కింద రూ.3,876, రూ.999కే డౌన్‌ పేమెంట్‌,  రూ .2,999 విలువైన బహుమతుల్ని అందిస్తున్నట్లు యమహా ఇండియా ప్రకటించింది. కాగా ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 30వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement