ఒప్పో ఏ7 లాంచ్‌ | Oppo A7 with waterdrop notch, 4230mAh battery launched | Sakshi
Sakshi News home page

ఒప్పో ఏ7 లాంచ్‌

Published Sat, Nov 17 2018 4:53 PM | Last Updated on Sat, Nov 17 2018 4:53 PM

Oppo A7 with waterdrop notch, 4230mAh battery launched - Sakshi

చైనా మొబైల్‌ మేకర్‌ ఒప్పో మరో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఎ7  పేరుతో  ఈ డివైస్‌ను  చైనా, నేపాల్‌ మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. భారీ డిస్‌ప్లేను  డ్యుయల్‌ రియర్‌ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, వాటర్‌ డ్రాప్‌ నాచ్‌, భారీ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతలని కంపెనీ తెలిపింది. ఫ్రెష్ పింక్, లేక్ గ్రీన్, యాంబర్ గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ రూ.16,540 ధరకు  చైనా మార్కెట్‌లో వినియోగదారులకు ఈ నెల 22వ తేదీ నుంచి లభ్యం కానుంది.

ఒప్పో ఎ7 ఫీచర్లు
6.2 ఇంచ్ డిస్‌ప్లే
1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
13+2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
4230 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement