
బీజింగ్: సెల్ఫీ కెమెరాలతో ఆకట్టుకుంటున్న ఒప్పో తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ను తీసుకొచ్చింది. ‘ఎ83’ పేరుతో ని చైనాలో తాజాగా విడుదల చేసింది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ తమ తాజా డివైస్ ప్రత్యేకత అని కంపెనీ వెల్లడించింది. కేవలం 0.18 సెకన్స్ వ్యవధిలోనే అన్‌లాక్ చేసుకోవచ్చట. మరోవైపు ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర మార్కెట్లలో ఎప్పటికీ అందుబాటులోకి రానుందీ ఇంకా వెల్లడించలేదు. దీని ధర సుమారు రూ.13,630.
ఒప్పో ఎ83 ఫీచర్లు
5.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
2.5డి కర్వ్‌డ్ గ్లాస్
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.1 నూగట్,
4 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
128 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం
13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3180 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment