ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లలోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో కూడా ప్రవేశించింది. ‘ఒప్పో ఫైండ్ ఎన్’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను డిసెంబర్ 15న కంపెనీ లాంచ్ చేసింది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లలో ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు తక్కువ ధరలోనే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో తీసుకువచ్చింది. కంపెనీ నిర్వహించిన ఇన్నో 2021 ఈవెంట్ రెండో రోజున ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ తొలుత చైనా మార్కెట్లలో అందుబాటులో ఉండనుంది.
ప్రపంచవ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేసేందుకు ఒప్పో సన్నాహాలను చేస్తోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 92,000 నుంచి ప్రారంభమవుతుంది. ఒప్పో ఫైండ్ ఎన్ స్మార్ట్‌ఫోన్ 33 వాట్ సూపర్‌ఫ్లాష్ టెక్నాలజీతో పనిచేయనుంది. అయితే 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జ్ 30 నిమిషాల్లో 55 శాతానికి , 70 నిమిషాల్లో 100 శాతానికి బ్యాటరీ ఛార్జ్ అవ్వనుంది.
ఒప్పో ఫైండ్ ఎన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్..!
- 7.1-అంగుళాల లోపలి డిస్‌ప్లే, 5.49-అంగుళాల ఔటర్ డిస్‌ప్లే
- 50ఎంపీ+16ఎంపీ+13ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా
- క్వాలకం స్నాప్‌డ్రాగన్ 888
- 12జీబీ ర్యామ్+512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- 33W SUPERVOOC ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్
- సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్
- డ్యూయల్ స్పీకర్ సిస్టమ్
- డాల్బీ అట్మోస్ సపోర్ట్
- 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్
- 4,500 mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment