సాక్షి,న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన కంపెనీ మిడ్ సెగ్మెంట్‌లోఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. తన పాపులర్ ఏ సిరీస్‌లో 'ఫేస్ అన్లాక్' ఫీచర్‌తో ఒప్పో ఏ 83 పేరుతో భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధరను రూ. 13,990గా నిర్ణయించింది. ‘ఎ1 బ్యూటీ రికగ్నిషన్ టెక్నాలజీ' ఇందులో జోడించినట్టు కంపెనీ చెప్పింది. దీంతో తమ తాజా స్మార్ట్‌ఫోన్‌యంగ్ కస్టమర్లకు నేచురల్ సెల్ఫీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో జనవరి 20నుంచి విక్రయానికి లభిస్తుందని తెలిపింది.
సెల్పీ ఎక్స్‌పర్ట్ ఎ,ఎఫ్ సిరీస్‌కు తమకు మంచి స్పందన లభించిందని ఒప్పో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ విల్ యాంగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో సరసమైన ధరలో, ఎడ్వాన్స్ ఫీచర్లతో ఏ 83ని అందిస్తున్నట్టు వివరించారు.
ఒప్పో ఏ 83 ఫీచర్లు
5.7అంగుళాల డిస్‌ప్లే విత్ 18.9 రేషియో
1440 X 720 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1
4జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
8మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
13మెగాపిక్సెల్ రియర్ కెమెరా
3,180ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment