
చైనీస్ కంపెనీ ఒప్పో తన ఎఫ్ 3 ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంలో ఈ ఫోన్‌ను సోమవారం భారత మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. 6జీబీ ర్యామ్ వేరియంట్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర 22,990 రూపాయలు. నవంబర్ 16(గురువారం) నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 4జీబీ ర్యామ్ వేరియంట్‌లో మార్చిలోనే రూ.30,990కు ఒప్పో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎక్స్‌క్లూజివ్ భాగస్వామ్యం నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ రూ.3000 అదనపు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐలు రూ.1,916 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ విలువపై 50 శాతం బైబ్యాక్ గ్యారెంటీని అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై కొనుగోలు చేసే కస్టమర్లకు అదనంగా మరో 5 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉచితంగా మూడు నెలల హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.
ఒప్పో ఎఫ్3 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు..
ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆధారిత కలర్‌ఓఎస్ 3.0
6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ జేడీఐ ఇన్-సెల్ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 653 చిప్‌సెట్
16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
ముందు వైపు 16 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ సెన్సార్లు
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
4000 ఎంఏహెచ్ బ్యాటరీ