
ఒప్పో ఫైండ్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్
చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో, తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్‌ను భారత మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. దీని ధర రూ.59,990గా కంపెనీ నిర్ణయించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా ఆగస్టు 3 నుంచి విక్రయానికి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫైండ్ ఎక్స్ ప్రీ-ఆర్డర్లు జూలై 30 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్ చేసుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ 3 వేల రూపాయల గిఫ్ట్ ఓచర్‌ను అందించనుంది. శాంసంగ్, వన్‌ప్లస్, షావోమి, వివో, ఇతర కంపెనీ స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఒప్పో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
ఓ-ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ, స్మాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ, 8 జీబీ ర్యామ్, ప్రీమియం ఆల్-గ్లాస్ డిజైన్‌లు ప్రధాన ఆకర్షణగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వచ్చింది. అదేవిధంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ లంబోర్ఘిని స్పెషల్ ఎడిషన్‌ను కూడా భారత మార్కెట్‌లోకి తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. సూపర్‌వీఓఓసీ ఫ్లాష్ ఛార్జర్ టెక్నాలజీని ఇది కలిగివుంది. ఈ టెక్నాలజీతో 35 నిమిషాల్లో డివైజ్ ఛార్జ్ అవుతుంది. అంతేకాక సెల్ఫీ కెమెరా, రియర్ కెమెరా సెటప్‌లను ఫైండ్ ఎక్స్ హైడ్ చేసి ఉంచుతుంది.
ఒప్పో ఫైండ్ ఎక్స్ స్పెషిఫికేషన్లు..
6.42 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
వెనుక వైపు, ముందు వైపు అల్యూమినియం ఫ్రేమ్ విత్ గొర్రిల్లా గ్లాస్
8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
16 మెగాపిక్సెల్, 20 మెగాపిక్సెల్ సెన్సార్లతో పాప్-అప్ డ్యూయల్ రియర్ కెమెరా
పాప్-అప్ 25 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత కలర్‌ఓస్ 5.1
3,730 ఎంఏహెచ్ బ్యాటరీ