Moto G14 : మెటరోలా ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో జీ 14 కొనుగోలుకు లభిస్తోంది. భారీ బ్యాటరీ, బిగ్ స్క్రీన్, మల్టీ కెమెరా,డాల్బీ అట్మోస్-ఆధారిత స్టీరియో స్పీకర్స్ లాంటి అదిరే ఫీచర్స్‌తో ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది.
మోటో జీ 14 ధర, ఆఫర్
మోటో జీ 14 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ (సింగిల్) వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.9,999 ధరతో లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు మాత్రమే ఆఫర్‌లకు అర్హులు. ఫోన్‌పై తక్షణం రూ.750 తగ్గింపును పొందవచ్చు. ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసిన వారు రూ. 3,200 విలువైన స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్‌కు అర్హులు. స్టీల్ గ్రే , స్కై బ్లూ రంగులలో లభ్యం. (‘ఎక్స్’ లో లక్షల్లో ఆదాయం: పండగ చేసుకుంటున్న కంటెంట్ క్రియేటర్లు)
మోటో జీ 14 స్పెసిఫికేషన్స్
6.5-అంగుళాల ఫుల్‌హెచ్‌డి+ డిస్‌ప్లే
2GHz క్లాక్ స్పీడ్ ఆక్టా-కోర్ Unisoc T616 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
డ్యుయల్‌రియర్‌కెమెరా : 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 2ఎంపీ మాక్రో లెన్స్,
8ఎంపీ సెల్ఫీకెమెరా
5,000 mAh బ్యాటరీ, 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్
Comments
Please login to add a commentAdd a comment