ప్రపంచ వ్యాప్తంగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్ భారీ ఆదరణను నోచుకుంటున్నాయి. మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్ భారీ లాభాలనే ఆర్జిస్తోంది. కాగా ఆపిల్, గూగుల్ లాంటి పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కూడా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లపై దృష్టిసారించాయి. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను తయారుచేసే కంపెనీ జాబితాలోకి తాజాగా ప్రముఖ చైనీస్ కంపెనీ ఒప్పో కంపెనీ కూడా చేరింది.
చదవండి: టెస్లా కార్లలో ‘కలకలం..!’ పాత దానినే వాడండి..!
వచ్చే నెలలో లాంచ్..!
మడతపెట్టే స్మార్ట్‌ఫోన్లను ఓప్పో త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెల నవంబర్‌లో ఒప్పో లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్‌ను ఒప్పో ఇంకా ప్రకటించలేదు. 8 అంగుళాల ఫోల్డబుల్ ఇంటర్నల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే ఒప్పో రిలీజ్ చేయనుందని ప్రముఖ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ టిప్‌స్టర్ వీబోతో పంచుకున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కోసం ఎల్‌టీపీవో అమ్లోడ్ ప్యానెల్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.
ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌ని ఉపయోగిస్తుందని టిప్‌స్టర్ ధృవీకరించింది. టిప్‌స్టర్ ప్రకారం....ఒప్పో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ చైనాలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇతర దేశాల్లో ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆలస్యంగా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. శాంసంగ్ తన ఫోల్డబుల్ ఫోన్లలో భాగంగా గెలాక్సీ జెడ్ ఫోల్డ్ , గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసింది. ఒప్పో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ. 1.5 లక్షలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Alibaba: చైనాపై విమర్శ..! జాక్ మా కొంపముంచింది..!
Comments
Please login to add a commentAdd a comment