
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్‌ను ఇచ్చింది. ఆయా కంపెనీలపై ఆదాయ పన్ను శాఖ దాడులను నిర్వహిస్తోనట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా షావోమీ, ఒప్పో మొబైల్ కంపెనీలకు సంబంధించిన పలు ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను (IT) శాఖ దాడులు నిర్వహిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఐటీ అధికారులు ఆయా కంపెనీలు అనేక ఉల్లంఘనలకు పాల్పడాయని ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. షావోమీ, ఒప్పో కంపెనీల తయారీ యూనిట్లు, గోడౌన్లు , కార్పొరేట్ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయని సమాచారం. తమిళనాడు పెరుంగుడిలోని ఒప్పో కార్యాలయంపై, కాంచీపురంలోని సెల్‌ఫోన్ విడిభాగాల తయారీ యూనిట్‌పై దాడులు నిర్వహించారు.
గతంలో కూడా..!
ఆయా చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలపై ఐటీ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈ సంస్థలపై ఐటీ దాడుల జరిగాయి. అంతకుముందు ఆగస్టులో, గురుగ్రామ్‌లోని చైనీస్ టెలికాం పరికరాల తయారీ సంస్థ జెడ్‌టీఈ కార్యాలయంపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో పలు ఉల్లంఘనలను ఐటీ అధికారులు గుర్తించారు.
చదవండి: "మెర్రీ క్రిస్మస్" మెసేజ్ ఖరీదు ఇన్ని లక్షలా.. స్పెషల్ ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment