
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గురువారం ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల సోదాల అనంతరం ఈరోజు విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పైళ్ల శేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.
కాగా, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సహా మర్రి జనార్దన్ రెడ్డిలకు ఐటీ అధికారులు నోటీసలు ఇచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి సైతం నోటీసులు అందాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నివాసల్లో సైతం సోదాలు జరగ్గా, ఐటీ అధికారులు అడిగిన వివరాలతో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో హాజరు కావాలని ఆదేశించారు.
చదవండి: బీఆర్‌ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది.. బీఆర్‌ఎస్ నేతలను టార్గెట్ చేశారు: పైళ్ల శేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment