IT Raids On BRS MP, MLAs Houses And Business Offices In Hyderabad Updates In Telugu - Sakshi
Sakshi News home page

IT Raids Updates: బీఆర్‌ఎస్‌ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో

Published Wed, Jun 14 2023 7:28 AM | Last Updated on Wed, Jun 14 2023 1:32 PM

IT Raid On BRS MLA Pailla Shekar Reddy House Hyderabad - Sakshi

Updates

►తెలంగాణలో పలువురు బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ సోదాలు అవుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పై ఏకకాలంలో ఐటీ సోదాలు జరుపుతోంది. జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది ఐటీ.

►వైష్ణవి గ్రూప్స్, తీర్ధా గ్రూప్స్‌తో పాటు కొత్తపేటలో హీలింథ్ టెక్నాలజీస్ పైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు ఇన్ఫ్రా, మైనింగ్, ట్రావెల్స్ కంపెనీల నుంచి చెల్లించిన పన్ను వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపులో వ్యత్యాసాలను ఐటీ గుర్తించింది.

►పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన తీర్థ ప్రాజెక్ట్స్‌తో పాటు లార్వేన్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితను అధికారులు బ్యాంక్‌కు తరలించారు.

►మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను సైతం బ్యాంకుకు తరలించారు. ఖాతాలు, లాకర్స్ వివరాలు సేకరిస్తున్నారు. పలువురు బ్యాంకు అధికారుల సమక్షంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు చేపట్టింది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి ఇంట్లో బుధవారం ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు.70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

పైళ్ల శేఖర్‌ రెడ్డి చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌, వ్యాపారాలపై ఐటీ సోదాలు జరుపుతున్నారు. 15 కంపెనీల్లో ఎమ్మెల్యే పెట్టుబడులు ఉన్నాయని ఐటీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్‌, భువనగిరిలోని ఇళ్లు, కార్యాలయాలు సహా ఎమ్మెల్యే వ్యక్తిగత నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టింది. మెయిన్‌ ల్యాండ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌, హిల్‌ల్యాండ్‌ టెక్నాలజీస్‌ సహా మరికొన్ని కంపెనీల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.
చదవండి: పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా?

మొత్తం 12 ప్రాంతాల్లో.. 70 బృందాలతో ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.  తీర్థ గ్రూప్‌ పేరిట రియల్‌ ఎస్టేట్‌, మైనింగ్‌, సోలార్‌, ఎనర్జీ..లిథియం బ్యాటరీ వ్యాపారాలు చేస్తున్నారు పైళ్ల శేఖర్‌ రెడ్డి.. ఈ సంస్థ హైదరాబాద్‌తోపాటు కర్ణాటకలో రెసిడెన్షియల్‌, కమర్షియల్‌ ప్రాజెక్టులను పూర్తి చేసింది. దకక్షిణాఫ్రికాలోనూ మైనింగ్‌ వ్యాపారం చేస్తోంది.

ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు
మెదక్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుపుతోంది.  ప్రభాకర్‌ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌ వద్ద నివాసంలో అధికారుల సోదాలు చేపట్టారు.

ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి షాపింగ్‌ మాల్‌పై..
నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కేపీహెచ్‌బీ కాలనీలోని జనార్ధన్‌ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌లోనూ ఐటీశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా  మర్రి జనార్ధన్‌ రెడ్డి జేసీ బ్రదర్స్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement