సాక్షి, యాదాద్రి : మంచి పనులు చేసే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ గెలిపించుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక, చేనేత శాఖా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. శనివారం భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లిలో జరిగిన చేనేత వారోత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం తపించిపోయే ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి ఎన్ని నిధులు కావాలన్నా కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటించినట్‌లైంది. ఇప్పటికే తుంగతుర్తి ఎమ్మెల్యేగా గాదరి కిషోర్‌కుమార్‌కు హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలని కేటీఆర్ అక్కడి ప్రజలను కోరిని విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ నుంచి తొలి టికెట్‌ను కిషోర్‌కు ప్రకటించగా.. రెండో టికెట్‌ను శేఖర్‌రెడ్డికి ప్రకటించినట్‌లైంది.
కాగా, భువనగిరిలో కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడంతో శేఖర్‌రెడ్డి విజయం ఏకపక్షమైందని కేటీఆర్ ప్రకటించడంతో అనిల్‌కుమార్‌రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరడం ద్వారా.. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వచ్చే ఎన్నికలో ఎంపీ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment