pailla shekar reddy
-
భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శేఖర్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి : మంచి పనులు చేసే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ గెలిపించుకుందామని రాష్ట్ర ఐటీ, పురపాలక, చేనేత శాఖా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు. శనివారం భువనగిరి నియోజకవర్గంలోని భూదాన్ పోచంపల్లిలో జరిగిన చేనేత వారోత్సవాల సభలో ఆయన ప్రసంగించారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం తపించిపోయే ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డికి ఎన్ని నిధులు కావాలన్నా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను కోరారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటించినట్లైంది. ఇప్పటికే తుంగతుర్తి ఎమ్మెల్యేగా గాదరి కిషోర్‌కుమార్‌కు హ్యాట్రిక్ విజయం కట్టబెట్టాలని కేటీఆర్ అక్కడి ప్రజలను కోరిని విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నుంచి తొలి టికెట్‌ను కిషోర్‌కు ప్రకటించగా.. రెండో టికెట్‌ను శేఖర్‌రెడ్డికి ప్రకటించినట్లైంది. కాగా, భువనగిరిలో కాంగ్రెస్ నుంచి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరడంతో శేఖర్‌రెడ్డి విజయం ఏకపక్షమైందని కేటీఆర్ ప్రకటించడంతో అనిల్‌కుమార్‌రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించే అవకాశం ఉందన్న చర్చ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరడం ద్వారా.. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి వచ్చే ఎన్నికలో ఎంపీ స్థానానికి పోటీచేసే అవకాశం కల్పిస్తారని భావిస్తున్నారు. -
ఐటీ విచారణకు హాజరైన బిఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి గురువారం ఐటీ విచారణకు హాజరయ్యారు. ఇటీవల సోదాల అనంతరం ఈరోజు విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో పైళ్ల శేఖర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు. కాగా, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి సహా మర్రి జనార్దన్ రెడ్డిలకు ఐటీ అధికారులు నోటీసలు ఇచ్చారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి సైతం నోటీసులు అందాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల నివాసల్లో సైతం సోదాలు జరగ్గా, ఐటీ అధికారులు అడిగిన వివరాలతో హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వ్యాపార లావాదేవీలు, ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్లతో హాజరు కావాలని ఆదేశించారు. చదవండి: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది.. బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేశారు: పైళ్ల శేఖర్‌రెడ్డి -
ఐటీ సోదాల పేరిట హడావిడి చేశారంతే!: పైళ్ల శేఖర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ(ఐటీ) సోదాలు ముగిశాయి. ఈ నెల 14వ తేదీన ఉదయం ఆరుగంటల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, మర్రి జనార్థన్‌రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారుల తనిఖీలు మొదలైన సంగతి విదితమే. శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో సోదాలు ముగిసినట్లు ప్రకటించి అధికారులు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఐటీ అధికారుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ మూడు రోజుల సోదాల్లో.. కంపెనీ లావాదేవీలు, బ్యాంక్ లాకర్లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లపై ఐటీ ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది. అలాగే పలు డాక్యుమెంట్లను ఐటీ అధికారులు తీసుకెళ్లడం గమనార్హం. ఇక చివరగా సోదాల అనంతరం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ సోదాల పరిణామంపై ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పందించారు. బురదజల్లే ప్రయత్నం BRS నేతలను లక్ష్యంగా చేసుకుని.. కక్ష్య పూరితంగానే ఐటీ దాడులు జరిగాయన్న ఆయన.. సోదాల వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని చెప్పారు. ‘‘ఐటీ సోదాల గంటలోనే ముగిసినప్పటికీ.. అధికారులు 3రోజుల పాటు కాలయాపన చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం తప్ప మిగతా వ్యాపారలతో నాకు సంబంధం లేదు. విదేశాల్లో మైనింగ్ వ్యాపారాలున్నాయన్నది పచ్చి అబద్ధం. మర్రి జనార్దన్, కొత్త ప్రభాకర్లతో మాత్రం వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం జరిగింది. నేను, నా భార్య ఇద్దరం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాం. దానికి సంబంధించి పైల్స్ తీసుకున్నారంతే. సక్రమంగా ఆదాయపన్ను చెల్లిస్తున్నాం. నేను కొన్న ఆస్తులపై వివరాలు తీసుకున్నారు అధికారులు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేశారు...అందులో ఉన్న డాక్యుమెంట్ లపై వివరాలు అడిగారు. ఏదో ఊహించుకుని ఐటీ అధికారులు వచ్చారు... కానీ ఏమీ దొరకలేదు. ఐటీ అధికారులకు మా సీఏ పూర్తి వివరాలు ఇచ్చారు. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. విచారణకు హాజరవుతాను అని స్పష్టం చేశారాయన. డాక్యుమెంట్లు కీలకమైనవే! ఇదిలా ఉంటే.. ఐటీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మరోలా ఉంది. ఎమ్మెల్యేకు కంపెనీలు, వ్యాపార వ్యవహారాలు, వారు చెల్లిస్తోన్న పన్నులుకు మధ్య భారీ వ్యత్యాసాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. పైళ్ల శేఖర్ భార్య వనితా రెడ్డికి చెందిన తీర్థా గ్రూప్ సంస్థ, వైష్ణవి వ్యాపార సంస్థలకు సంబంధించిన లావాదేవీలను కూడా ఐటీ శాఖ పరిశీలించినట్లు తెలుస్తోంది. తీర్థా గ్రూప్‌కు డైరెక్టర్‌గా ఉన్న వనితా రెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరిపి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి హైదరాబాద్, బెంగళూరులో సాగించిన వెంచర్లు, విల్లాల అమ్మకాల్లో నగదు లావాదేవీలను గుర్తించినట్టు సమాచారం. ఇద్దరు ఎమ్మెల్యేలు వారి కుటుబ సభ్యుల పేర్లతో ఉన్న బ్యాంకు లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారు. కీలక డాక్యుమెంట్లు, విలువైన ఆభరణాలను ఐటీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: సుప్రీంకోర్టు ఉత్తర్వులు పాటించారా? లేదా? -
మూడవ రోజు బీఆర్ఎస్ నేతల పై ఐటీ దాడులు..!
-
బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల నివాసాల్లో ఐటీ సోదాలు.. 70 బృందాలతో
Updates ►తెలంగాణలో పలువురు బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తం 60 ప్రాంతాల్లో ఐటీ సోదాలు అవుతున్నాయి. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పై ఏకకాలంలో ఐటీ సోదాలు జరుపుతోంది. జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్స్, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది ఐటీ. ►వైష్ణవి గ్రూప్స్, తీర్ధా గ్రూప్స్‌తో పాటు కొత్తపేటలో హీలింథ్ టెక్నాలజీస్ పైన ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. పలు ఇన్ఫ్రా, మైనింగ్, ట్రావెల్స్ కంపెనీల నుంచి చెల్లించిన పన్ను వివరాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. పన్ను చెల్లింపులో వ్యత్యాసాలను ఐటీ గుర్తించింది. ►పైళ్ల శేఖర్ రెడ్డికి చెందిన తీర్థ ప్రాజెక్ట్స్‌తో పాటు లార్వేన్ సిండికేట్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితను అధికారులు బ్యాంక్‌కు తరలించారు. ►మర్రి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులను సైతం బ్యాంకుకు తరలించారు. ఖాతాలు, లాకర్స్ వివరాలు సేకరిస్తున్నారు. పలువురు బ్యాంకు అధికారుల సమక్షంలో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ మెరుపు దాడులు చేపట్టింది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో బుధవారం ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు.70 బృందాలతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పైళ్ల శేఖర్ రెడ్డి చేస్తున్న రియల్ ఎస్టేట్, వ్యాపారాలపై ఐటీ సోదాలు జరుపుతున్నారు. 15 కంపెనీల్లో ఎమ్మెల్యే పెట్టుబడులు ఉన్నాయని ఐటీ అనుమానిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్, భువనగిరిలోని ఇళ్లు, కార్యాలయాలు సహా ఎమ్మెల్యే వ్యక్తిగత నివాసాల్లోనూ తనిఖీలు చేపట్టింది. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్, హిల్‌ల్యాండ్ టెక్నాలజీస్ సహా మరికొన్ని కంపెనీల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. చదవండి: పాలమూరు ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమా? మొత్తం 12 ప్రాంతాల్లో.. 70 బృందాలతో ఏక కాలంలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తీర్థ గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్, మైనింగ్, సోలార్, ఎనర్జీ..లిథియం బ్యాటరీ వ్యాపారాలు చేస్తున్నారు పైళ్ల శేఖర్ రెడ్డి.. ఈ సంస్థ హైదరాబాద్‌తోపాటు కర్ణాటకలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. దకక్షిణాఫ్రికాలోనూ మైనింగ్ వ్యాపారం చేస్తోంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు మెదక్ బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ సోదాలు జరుపుతోంది. ప్రభాకర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ వద్ద నివాసంలో అధికారుల సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి షాపింగ్ మాల్‌పై.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. కేపీహెచ్‌బీ కాలనీలోని జనార్ధన్ రెడ్డికి చెందిన జేసీ బ్రదర్స్ షాపింగ్ మాల్లోనూ ఐటీశాఖ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. జేసీ బ్రదర్స్‌లో జరిగిన లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా మర్రి జనార్ధన్ రెడ్డి జేసీ బ్రదర్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. -
పార్టీ మారడం లేదు.. వారి నాయకత్వంలోనే ఉంటా
సాక్షి, యాదాద్రి: టీఆర్ఎస్ పార్టీని వీడేదిలేదని, అధినేత కేసీఆర్ నాయకత్వంలోనే కడ వరకూ పనిచేస్తానని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం ఆయన భువనగిరిలో విలేకరులతో మాట్లాడారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. కొందరు తన ఎదుగుదలను చూసి ఓర్వలేక పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కేసీఆర్, కేటీఆర్‌ల నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని శేఖర్‌రెడ్డి తెలిపారు. (క్లిక్: మునుగోడులో బెట్టింగ్‌ల జోరు.. ఆయనపైనే అత్యధికంగా..!) 19న బీజేపీలో చేరనున్న బూర నర్సయ్య? సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ డా. బూర నర్సయ్యగౌడ్ ఈ నెల 19న బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. ఈ చేరికకు సంబంధించిన అంశాలు, నిర్వహించాల్సిన కార్యక్రమంపై చర్చించేందుకు బూర నర్సయ్యతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సోమవారం భేటీ కానున్నారు. బూర నర్సయ్య నివాసానికి సంజయ్, ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు. మునుగోడు పరిధిలో లేదా భువనగిరిలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనికి పార్టీ జాతీయ నేతలు హాజరుకానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఢిల్లీలో నర్సయ్యగౌడ్ కలుసుకున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారని, రాజకీయంగా ఎలాంటి అవకాశాలు వచ్చినా పార్టీ మారేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత నర్సయ్య మాట్లాడారు. ఏ పార్టీలో చేరాలన్న దానిపై కార్యకర్తలు, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయ్యాకే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. -
రెండేళ్ల పదవీ కాలం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం
‘స్వరాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేదే.. టీఆర్ఎస్ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. ఆ ప్రాతిపదికనే పార్టీ ఆవిర్భవించి ప్రజల ఆశీర్వాదంతో మరోమారు అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని వాటిని కూడా అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే.. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. విపక్షాలు ఎన్ని విమర్శలు.. ఆరోపణలు చేసినా ఇది కఠోర వాస్తవం. మాటతప్పి..మడమ తిప్పే నైజం మాది కాదు. ఎన్నికల సందర్భంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మరో మూడేళ్లలో అన్నింటినీ నెరవేరుస్తాం. ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుని ఉమ్మడి నల్లగొండ జిల్లా దశదిశ మార్చి మళ్లీ దీవించాలని కోరుతాం.’ ఇదీ.. రెండేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా ‘సాక్షి’ ఎదుట ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల మనోగతం. సాక్షి, సూర్యాపేట: ఏళ్ల తరబడి బీడుగా ఉన్న భూములు సస్యశ్యామలం అయ్యాయి. ఎన్నో ఏళ్ల కింద తీసిన కాల్వల్లో ఇక నీళ్లు రావని ఆయకట్టు రైతులు భావించారు. కానీ ఈ కాల్వల్లో గోదావరి జలాలు పారించి రైతు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది మా ప్రభుత్వం. మూసీ, గోదావరి, కృష్ణా జలాలతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండాయి. ఎక్కడ చూసినా పచ్చదనమే.. జిల్లాకు గోదావరి జలాల రాకతో ఆయకట్టులో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తోంది. మా ప్రభుత్వం వచ్చాక రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనుకుంది. గోదావరి జలాలను ఈ కాలువలకు మళ్లించి రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చాం. గతేడాది నుంచి పంట పూర్తిగా చేతికి వచ్చే వరకు జిల్లాలోని ఆయకట్టుకు గోదావరి నీళ్లు అందిస్తూ వస్తున్నాం. ఇలా పూర్తి స్థాయిలో పంటకు గోదావరి నీళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మూసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో ఆయకట్టులో రెండు సీజన్లకు నీళ్లు అందుతున్నాయి. వైద్యరంగంలో బలోపేతమయ్యాం.. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీలు రావడం మా ప్రభుత్వంతోనే సాధ్యమైంది. సూర్యాపేటలో కూడా వైద్యకళాశాల ఏర్పాటు కావడంతో వైద్య రంగంలో జిల్లా మరింత ముందంజలో ఉంది. మెడికల్ కళాశాల జిల్లాకు కలికితురాయి. కళాశాల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్థాయిని మించి వసతులు ఏర్పాటవుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఇప్పటికే రోడ్ల వెడల్పు, జంక్షన్ల నిర్మాణ పనుల కార్యక్రమం మొదలైంది. సద్దల చెరువు పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేలా రూపుదిద్దుకుంటోంది. పట్టణ నడిబొడ్డున మోడల్ మార్కెట్ నిర్మాణం అయింది. మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలో అగ్రభాగాన నిలిచింది. ⇒ ఎన్నికల హామీలు నెరవేరుతున్నాయి.. నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి.. ఎన్నికల హామీలన్నీ నెరవేరుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని ఇంటింటికీ తాగునీరు అందించడంతోపాటు సాగునీటి సమస్యను కూడా పరిష్కరించాం. జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాలను మరింత అభివృద్ధి పరిచి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రెండేళ్ల కాలంలో నల్లగొండ నియోజకవర్గంలో మున్సిపాలిటీతోపాటు మూడు మండలాల్లో సీసీ రోడ్లు నిర్మించాం. మరో మూడేళ్లలో నియోజకవర్గాన్ని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో ఆదర్శంగా తీర్చిదిద్దుతా. నల్లగొండ పట్టణానికి రెండో పైప్‌లైన్ తీసుకొచ్చి తాగు నీటి సమస్య లేకుండా చేశా. మిషన్‌భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నాం. నల్లగొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నా. గత పాలకులు వదిలేసిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18కోట్లు మంజూరు చేసింది. పనులు త్వరలో పూర్తి చేయిస్తాం. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీలు పెంచడంతోపాటు డయాలసిస్ వ్యవస్థను మెరుగు పర్చాం. సిటీస్కాన్ ఉపయోగంలోకి తెచ్చాం, ఎంఆర్ఎస్ స్కాన్ , కేన్సర్ యూనిట్కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. రూ.275 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీలోని 32ఎకరాల విస్తీరణంలో మెడికల్ కళాశాల నూతన భవనం నిర్మించబోతున్నాం , దానికి సీఎం త్వరలో శంకుస్థాపన చేస్తారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ముందున్నాం. ⇒ రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు: మిర్యాలగూడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా అంతకంటే ఎక్కువ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. మిర్యాలగూడ పట్టణంలో రూ.100 కోట్లతో రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టాం. ఆగిపోయిన మినీ రవీంద్రభారతికి రూ.3కోట్లు కేటాయించాం. సంత్‌సేవాలాల్ భవనం, జ్యోతిరావుపూలే భవనం నిర్మిస్తున్నాం. మూడు ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి రూ.525 కోట్లు మంజూరయ్యాయి. రూ.17 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్‌బండ్ పనులు సాగుతున్నాయి. రూ.50 కోట్లతో పలు గ్రామాల్లో రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేశాం. కేఎన్ఎం కళాశాలను ప్రభుత్వ పరం చేయడంతోపాటు జూనియర్ కళాశాలలో రూ.3కోట్లతో తరగతి గదులను నిర్మిస్తున్నాం. పట్టణంలో 560 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రూ.50 కోట్లతో 31 చెక్ డ్యామ్‌లను నిర్మించనున్నాం. మిర్యాలగూడ పట్టణంలో 80 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాం. ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి చేయనున్నాం. ⇒ తొలి ఏడాదిలోనే సగం వాగ్దానాలు పూర్తి చేశా కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్: ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన వాగ్దానాల్లో సగం పూర్తి చేశా. , మిగిలినవి కూడా వివిధ దశల్లో ఉన్నాయి. వాటిని కూడా త్వరలో పూర్తి చేస్తా. ఇచ్చిన హామీ మేరకు తీవ్ర సాగునీటి కొరతను ఎదుర్కొంటున్న మోతె, మునగాల, నడిగూడెం మండలాలకు కాళేశ్వరం జలాలను తీసుకొచ్చా. కోదాడ పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశాం. కోదాడ ట్యాంక్‌బండ్ పనులతో పాటు మరో 8ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేసి పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా మారుస్తాం. పేదలకు 1,840 డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలో పంపిణీ చేస్తాం. ఇంటిస్థలం ఉన్న మరో 3 వేల మందికి రూ.5లక్షలు ఇప్పించడానికి కృషి చేస్తా. ⇒ హామీలు పురోగతిలో ఉన్నాయి హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి: నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీల్లో చాలా వరకు పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గంలో చివరి భూములకు నీరందించేందుకు లిఫ్ట్‌లపై దృష్టి సారించాం. ఇందులో భాగంగా పులిచింతల ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న అడ్లూరు, చింతిర్యాల, గుర్రంబోడు, రేబల్లె లిఫ్ట్‌లను తరలించేందుకు రూ.75 కోట్లు మంజూరు చేయించాం. అదేవిధంగా చెక్‌డ్యాంలు నిర్మించేందుకు రూ.32 కోట్లు మంజూరయ్యాయి. మేళ్లచెరువు, మఠంపల్లి, మండలాల్లో చాలా వరకు లింక్ రోడ్లు, బ్రిడ్జి మంజూరు చేయించా. కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. హుజూర్నగర్ రింగ్ రోడ్డు మిగిలిన పనులకుగాను రూ.5 కోట్లు మంజూరు చేయించా. మిగిలిన పనులు త్వరలో పూర్తవుతాయి. ఏరియా ఆస్పత్రిలో బ్లడ్‌బ్యాంక్ కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నా. ఈఎస్ఐ ఆస్పత్రి కోసం మేళ్లచెరువులో 5ఎకరాల భూమి కేటాయించాం. మేళ్లచెరువు, చింతలపాలెం మండలాలకు సంబంధించిన కేసులు కోదాడ కోర్టుకు వెళ్తున్నాయి. వాటిని హుజూర్నగర్ కోర్టు పరధిలోకి తెచ్చే అంశం ఫైల్ సీఎం కేసీఆర్ దగ్గర ఉంది. త్వరలోనే క్లీయర్ అవుతుంది. హుజూర్‌నగర్‌లో ప్రత్యేకంగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్ఏసీ) సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మఠంపల్లి మండలంలో 2,500 ఎకరాలు భూ సేకరణ జరిగింది. మిగతా పనులు కూడా పూర్తి చేస్తాం. ⇒ సాగునీరు, సౌకర్యాల కల్పనకు పెద్దపీట భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి: భువనగిరి నియోజకవర్గంలో సాగునీరు, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నాం. రానున్న మూడేళ్లలో నియోజకవర్గం అభివృద్ధికి పాటుపడుతా. కరోనా కష్టకాలంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టడానికి నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేశారు. అయినప్పటికీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ అండతో రూ.20 కోట్లతో హెచ్ఎండీఏ నిధులతో నియోజకవర్గంలో మురుగు కాలువలు, సీసీరోడ్లు చేపట్టాం. 90 శాతం పనులు పూర్తి కావచ్చాయి. అన్ని గ్రామాల రైతులకు సాగు నీరందిస్తాం. బస్వాపురం రిజర్వాయర్ పూర్తి కావస్తోంది. రిజర్వాయర్‌లో1.5 టీఎంసీల కాళేశ్వరం నీరు రైతులకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా మూసీ కాల్వలైన బునాదిగాని, పిలాయిపల్లి కాల్వలను పూర్తి చేస్తున్నాం. జిల్లా కేంద్రమైన భువనగిరిలో రూ.8.72 కోట్లతో మోడల్‌మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. రోడ్డు వెడల్పు కోసం రూ.15.18 కోట్లతో పనులు చేపట్టాం. రూ.1.60కోట్లతో స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి మరో రూ.50 కోట్లతో అభివృద్ధిపనుల ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. ⇒ పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య : ప్రధానంగా నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టు ప నులపై దృష్టి సారించా. ఉదయసముద్రంతోపాటు, పిలాయిపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువ పనులను పూర్తిచేయించి సాగునీరు అందించడానికి కృషిచేస్తా. పిలాయిపల్లి ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. ధర్మారెడ్డిపల్లి ఆధునికీకరణ పనులు 70శాతం పూర్తయ్యాయి. వచ్చే వేసవి వరకు పెండింగ్ పనులను పూర్తి చేయించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా. ఆసిఫ్‌నహర్, శాలిగౌరారం ప్రాజెక్టు కాలువల మరమ్మతులకు రూ.25కోట్లు, ఎర్రకాలువ పునర్నిర్మాణానికి రూ.30కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. నకిరేకల్, రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రుల స్థాయిని 100 పడకలకు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అవసరమైన పోస్టులు మంజూరయ్యాయి. నకిరేకల్‌లోని డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కట్టించేందుకు కృషి చేస్తా. చిట్యాల పట్టణంలో ప్రమాదాల నివారణకు జాతీయ రహదారి వెంట ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంటుంది. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్లో కోల్డ్స్టోరీజే ఏర్పాటు చేయిస్తా. ⇒ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నా.. దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా. ఎన్నికల సమయంలో దేవకకొండ నియోజకవర్గంలోని ప్రజలకు డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంతో పాటు దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చుతా. పొగిల్ల, నంబాపురం అంబాభవాని ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తానని హామీలు ఇచ్చా. ఈ మేరకు డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా గొట్టిముక్కుల, సింగరాజుపల్లి, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. అదేవిధంగా దేవరకొండ ఖిలాను పర్యాటక కేంద్రంగా మార్చే క్రమంలో ఇప్పటికే ఖిలాలో పార్కు ఏర్పాటుకు రూ.5కోట్ల నిధులు మంజూరయ్యాయి. వాటి పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెనుకబడ్డ చందంపేట మండల గిరిజనుల కోసం పొగిల్ల, అంబాభవాని, నంబాపురం ఎత్తిపోత పథకాలు సైతం కార్యరూపం దాల్చేందుకు పేపర్ పనులు పూర్తి చేశాం. నియోజకవర్గంలో ఇప్పటికే 526 డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం. మండలాల్లో స్థల సేకరణ జాప్యంతో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదు. త్వరలోనే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేస్తా. కోర్టు కేసుల నేపథ్యంలో వంద పడకల ఆస్పత్రి కార్యరూపం దాల్చే క్రమం కొంత ఆలస్యమైంది. కోర్టు కేసులు పూర్తయినందున త్వరలోనే వంద పడకల ఆస్పత్రికి పూర్తి స్థాయిలో వైద్యసౌకర్యాలు, సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. -
కోమటిరెడ్డి ఎదురుపడటంతో.. కలిశానంతే!
సాక్షి, భువనగిరి: భువనగిరి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బూర నరసయ్య ఓడిపోవడం చాలా బాధాకరమని ఆ పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బూర ఓటమికి తానే కారణమంటూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బూర నరసయ్య ఓడిపోతారని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. ఈ అంశంపై సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. రోడ్డురోలర్ గుర్తువల్లే భువనగిరి లోక్‌సభ స్థానంలో తాము ఓడిపోయాం తప్ప వేరే కారణం లేదన్నారు. ‘బూర ఓటమికి నేనే కారణమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని చూస్తే చాలా బాధేస్తోంది’ అని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక హోటల్లో టాయిలెట్‌కు వచ్చిన సందర్భంలో ఎదురుపడ్డారని, అక్కడే ఉండటంతో తనను కాకతాళీయంగా కలిశారని అన్నారు. ఇది రహస్యంగా జరిగింది కాదని, అక్కడ అందరూ ఉన్నారని, ఇదంతా కేవలం ఒక నిమిషం వ్యవధిలోనే జరిగిందని వివరించారు. తమ మధ్య ఎలాంటి ఇతర సంభాషణ జరగలేదని, ఇలా కలిసి అలా వెళ్లిపోయామని పేర్కొన్నారు. బొమ్మల రామరం మండలంలో ఎవరో ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్న మాటల్ని ఎంపీ పీఏ, ఎమ్మెల్యే మధ్య సంభాషణగా దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇంత ఘోరంగా దుష్ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు. ఈ సంభాషణను వైరల్ చేసిన సైకోను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తానెంటో భువనగిరి ప్రజలకు తెలుసని, ఎంపీ బూర గెలుపుకోసం అందరమూ కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలని కొందరు చూస్తున్నారని అన్నారు. గత ఐదేళ్లలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనమీద ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. భువనగిరిలో వందశాతం ఎగిరేది గులాబీ జెండాయేనని శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. విపక్షాలు రక్షసానందం పొందుతున్నాయన్నారు. ఫోన్ సంభాషణలో మాట్లాడుకున్న వ్యక్తులైన బాలనర్సింహ యాదవ్, మల్లారెడ్డి కూడా ఈ ప్రెస్మీట్లో మాట్లాడారు. జన సమీకరణ కోసమే మల్లారెడ్డితో తాను ఫోన్లో మాట్లాడానని, సన్నిహిత సంబంధాలు కారణంగా తాము సరదాగా మాట్లాడుకున్నామని బాలనర్సింహ యాదవ్ పేర్కొన్నారు. తాము మాట్లాడుకున్న దానిని సోషల్ మీడియాలో ఇలా వక్రీకరించి వైరల్ చేయడం బాధాకరమని, ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిపై ఇలాంటి దుష్ప్రచారం చేయడం బాధగా ఉందని పేర్కొన్నారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై తాము మాట్లాడుకున్నామని, భువనగిరి నియోజకవర్గానికి ఈ సంభాషణ విషయంలో ఎలాంటి సంబంధం లేదన్నారు. -
టీఆర్ఎస్లోకి మరో ఇద్దరు..
భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ అధికార పార్టీ నుంచి సొంతగూటికి చేరడంతో పాటు 7వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కూడా ఆమె వెంట బీజేపీలో చేరారు. మరుసటి రోజే కౌన్సిలర్ తిరిగి టీ ఆర్ఎస్లో చేరారు. ఈ పరిణామాలు జరిగిన 24 గంటల్లోనే మరో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిల ర్లు లతశ్రీ, నువ్వుల ప్రసన్న శనివారం టీఆర్ఎస్ భువనగిరి పట్టణ కమిటీ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సి పాలిటీలో టీఆర్ఎస్ బలం 16కు చేరింది. కౌన్సిలర్ల సంఖ్య పెంచుకోవడంలో సఫలీకృతం టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుంది. ఈనెల 4న ము న్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసంపెట్టే విషయంపై ఇప్పటికే నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నమూనాపత్రంలో సంతకాలు చేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్షపార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెట్టాలంటే 22 మంది కౌన్సిలర్లు అవసరం. కాగా టీఆర్ఎస్కు ఇప్పటికే 16 మంది కౌ న్సిలర్లు ఉన్నారు. వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలి మినేటి కృష్ణారెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అ¯ ] ుకూలంగా ఉన్నారని చెప్పడంతో వీరికి తోడుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనడంతో ఈ సంఖ్య 24కు చేరుకునే అవకాశం ఉంది.అవిశ్వాసం పె ట్టేందుకు టీఆర్ఎస్ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుందని చెప్పవచ్చు. రాజీనామా.. అవిశ్వాసమా? అవిశ్వాసం పెట్టే వారివైపు కౌన్సిలర్ల సంఖ్య పెరగడం, సొంత పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉండడంతో చైర్పర్సన్ రాజీనామ చేయాలా అవిశ్వా సం ఎదర్కోవాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు తె లిసింది. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పార్టీ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. చైర్పర్సన్ పార్టీ లో చేరిక ప్రస్తుత పరిస్థితులు, మున్ముందు జరిగే పరిణామాలపై చర్చిం చినట్లు సమాచారం. -
సారూ..ఆస్పత్రిలో అంతా అధ్వానం
డబ్బులు లేక ధర్మాసుపత్రికి వస్తే అన్నిచోట్లా డబ్బులు అడుగుతున్నారు. పరీక్షలన్నీ బయటికి రాస్తున్నారు. కనీసం మంచినీళ్లు దొరకడం లేదు. నల్లాలు పనిచేయడం లేదు. మరుగుదొడ్లు శుభ్రం చేయడం లేదు. ఆస్పత్రి అంతా అధ్వానంగా తయారైంది. - భువనగిరి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యకు రోగుల ఫిర్యాదు భువనగిరి :‘‘చిన్న చిన్న సమస్యలకు కూడా వైద్యం అందించడం లేదు. వెంటనే నీలపురి దవాఖానాకు పంపుతున్నారు. మంచినీళ్లుకూడా లేవు. డబ్బులు లేనిదే వైద్యం చేయడం లేదు.. సారూ ఆస్పత్రి అంతా అధ్వానంగా తయారైంది’’ అంటూ భువనగిరి ఏరియా ఆస్పత్రిలోని రోగులు, వారి బంధువులు డిప్యూటీ సీఎం రాజయ్యకు మొరపెట్టుకున్నారు. శుక్రవారం భువనగిరి ఏరియా ఆస్పత్రిని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి రాష్ర్ట ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖమంత్రి తాటికొండ రాజయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. మంత్రి ఆస్పత్రిలోకి అడుగుపెట్టగానే విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ, సాధారణ రోగులు, చిన్నపిల్లలు, మహిళల వార్డులను తనిఖీ చేశారు. ఆపరేషన్ థియేటర్, డయాగ్నస్టిక్ సెంటర్, రక్తనిధి కేంద్రం, రోగులకు ఇచ్చే భోజనాన్ని పరిశీలించారు. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వడాయిగూడానికి చెందిన హేమలత అనే రోగిని వైద్యం అం దుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. కేస్‌షీట్‌ను తెప్పించి రోగనిర్ధారణతో పాటు ఇస్తున్న మందుల వివరాలను పరిశీలించి మరిన్ని సూచనలను వైద్యులకు చేశారు. అనంతరం రోగుల కోసం తీసుకువస్తున్న ఆహారపదార్థాలను చూసి అసహనం వ్యక్తం చేశారు. ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్ గురించి వాకబుచేశారు. ఆయన ఆందుబాటులో లేడని వైద్యులు చెప్పా రు. ల్యాబ్‌ను పరిశీలించి ఏయే పరీక్షలు చేస్తున్నారని టెక్నీషియన్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్న పిల్లలవార్డును తనిఖీ చేశారు. రాత్రివేళ కరెంటు ఉండడం లేదని, జనరేటర్ సౌకర్యం లేకపోవడంతో రాత్రిళ్లు దోమల బెడద, దొంగల భయం అధికంగా ఉందన్నారు. ఇలా ఎక్కడికి వెళ్లినా మంత్రికి సమస్యలు స్వా గతం పలికాయి. ప్రధానంగా డబ్బులు లేనిదే వైద్యం చేయడం లేదని, కొన్ని మాత్రలు ఇచ్చి మరికొన్ని బయట తెచ్చుకోమంటున్నారని చెప్పారు. అన్నిరకాల పరీక్షలు చేయకుండా బయటకు రాస్తున్నారన్నారు. అనంతరం ఎమ్మె ల్యే శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ, ఆస్పత్రి సూపరింటెండెంట్, అర్ఎంతో కలిసి ఉపు ముఖ్యమంత్రి ప్రత్యేక సమీక్షసమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కొరతను వివరించారు. ఆస్పత్రిలో ప్రజల నుం చి వచ్చిన ఫిర్యాదులపై మంత్రి సూపరింటెంండెంట్పై ఆగ్రహం వ్యక్తం చే శారు. ఆస్పత్రి పనితీరు మెరుగు పడాలని ఆదేశించారు. కాగా ఉప ముఖ్యమంత్రి రాక సందర్భంగా భువనగిరి డీఎస్పీ ఎస్. శ్రీనివాస్, రూరల్ సీఐ జె.నరేందర్‌గౌడ్, ఎస్ఐ మోతీలాల్ ఆధ్వర్యంలో పోలీస్‌లు బందోబస్తు ఏర్పాటు చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తాం భువనగిరి : భువనగిరి ఏరియా ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం ఆయన భువనగిరి ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం భువనగిరి ఆస్పత్రిలో ఆర్ఎంఓ, రెండు సివిల్ సర్జన్, ఒక ఫిజిషియన్, ఆర్థోపెడిక్ డాక్టర్ల కొరత ఉందని, దీనిని త్వరలో తీరుస్తామన్నారు. డాక్టర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు విధుల్లో కచ్చితంగా ఉండాలన్నారు. ఎవరైనా డ్యూటీ సమయంలో ప్రైవేట్ వైద్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మన ఆస్పత్రి-మన ప్రణాళిక’తో వైద్యులు వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగాలన్నారు. ఆస్పత్రిలో కుక్కకాటు, పాముకాటుకు మందులివ్వాలన్నారు. పేషంట్లకు 5 నుంచి 7 రోజుల వరకు అన్ని మందులు ఇవ్వాలన్నారు. మందులు తక్కువ ఉంటే ఆస్పత్రికి చెందిన 10 శాతం నిధులతో వాటిని కొనుగోలు చేసి ఇవ్వాలే కానీ బయటకు చీటీలు రాయవద్దన్నారు. మంచినీరు, మురికి కాలువల సమస్య, బెడ్లు, వాటర్ లీకేజీలు, పిల్లోలు, బెడ్ షీట్ల వంటి మౌలిక సదుపాయాల కోసం 48 గంటల్లో నివేదిక తయారు చేసి తనకు పంపించాలన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో అవసరమైన నిధులు కేటాయించనున్నట్టు తెలిపారు.