టీఆర్‌ఎస్‌లో చేరిన ఇండిపెండెంట్ కౌన్సిలర్లు
భువనగిరి : భువనగిరి మున్సిపాలిటీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు రోజురోజుకూ మారుతున్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ అధికార పార్టీ నుంచి సొంతగూటికి చేరడంతో పాటు 7వ వార్డుకు చెందిన కౌన్సిలర్ కూడా ఆమె వెంట బీజేపీలో చేరారు. మరుసటి రోజే కౌన్సిలర్ తిరిగి టీ ఆర్‌ఎస్‌లో చేరారు. ఈ పరిణామాలు జరిగిన 24 గంటల్లోనే మరో ఇద్దరు ఇండిపెండెంట్ కౌన్సిల ర్లు లతశ్రీ, నువ్వుల ప్రసన్న శనివారం టీఆర్‌ఎస్ భువనగిరి పట్టణ కమిటీ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో మున్సి పాలిటీలో టీఆర్‌ఎస్ బలం 16కు చేరింది.
కౌన్సిలర్ల సంఖ్య పెంచుకోవడంలో సఫలీకృతం
టీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్ల సంఖ్యను పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుంది. ఈనెల 4న ము న్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసంపెట్టే విషయంపై ఇప్పటికే నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అవిశ్వాస తీర్మానం నమూనాపత్రంలో సంతకాలు చేసినట్లు సమాచారం. ఇందులో అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు ప్రతి పక్షపార్టీకి చెందిన కౌన్సిలర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవిశ్వాసం పెట్టాలంటే 22 మంది కౌన్సిలర్లు అవసరం. కాగా టీఆర్‌ఎస్‌కు ఇప్పటికే 16 మంది కౌ న్సిలర్లు ఉన్నారు.
వీరితో పాటు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలి మినేటి కృష్ణారెడ్డి ఓటు నమోదు చేసుకున్నారు. ఇప్పటికే 22 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి అ¯ ] ుకూలంగా ఉన్నారని చెప్పడంతో వీరికి తోడుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పాల్గొనడంతో ఈ సంఖ్య 24కు చేరుకునే అవకాశం ఉంది.అవిశ్వాసం పె ట్టేందుకు టీఆర్‌ఎస్ తన సంఖ్యా బలాన్ని పెంచుకోవడంలో సఫలీకృతం అవుతుందని చెప్పవచ్చు.
రాజీనామా.. అవిశ్వాసమా?
అవిశ్వాసం పెట్టే వారివైపు కౌన్సిలర్ల సంఖ్య పెరగడం, సొంత పార్టీ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉండడంతో చైర్‌పర్సన్ రాజీనామ చేయాలా అవిశ్వా సం ఎదర్కోవాలా? అనే ఆలోచనలో ఉన్నట్లు తె లిసింది. శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడితో పార్టీ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. చైర్‌పర్సన్ పార్టీ లో చేరిక ప్రస్తుత పరిస్థితులు, మున్ముందు జరిగే పరిణామాలపై చర్చిం చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment