సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా టీఆర్‌ఎస్ ఎంపీలు ఎందుకు పారిపోయారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. శని వారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్న కేంద్రా నికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని, మోదీ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.
ఇంటి ముందు లడాయి.. ఇంటి వెనుక దోస్తీ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్, బీజేపీల వైఖరి ఇంటి ముందు లడాయి.. ఇంటి వెనుక దోస్తీలాగా ఉందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎంపీలు రాజకీయ మైలేజీ కోసమే ప్రయత్నించారు తప్ప విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఇసుమంత కూడా ప్రయత్నించలేదని ఆరోపించారు.
శనివారం సీఎల్పీ కార్యాలయంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగమంతా సెల్ఫ్ డబ్బాలాగా సాగిందన్నారు. తల్లిని చంపి బిడ్డను కాపాడే విధంగా రాష్ట్ర విభజన చేశారనడం , రాష్ట్ర విభజనను పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో పోల్చడం సరైంది కాదన్నారు. లోక్‌సభలో రాహుల్‌గాంధీ పరిణతి చెందిన రాజకీయ నాయకుడి తరహాలో వ్యవహరించారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment