సాక్షి, సిరిసిల్ల : అధికార టీఆర్‌ఎస్ పార్టీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేతల మధ్య అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిరిసిల్ల రాజన్న జిల్లా మున్సిపల్ చైర్‌పర్సన్ నామల ఉమపై నేడు (మంగళవారం) అవిశ్వాస బలనిరుపణ పరీక్ష ప్రవేశపెట్టనున్నారు. గతకొంత కాలంగా సిరిసిల్ల జిల్లా నేతల్లో విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా తొమ్మిది సభ్యులకు బీజేపీ విప్ జారీ చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో దీనిపై కొంత ఉత్కఠం నెలకొంది. బల నిరుపణ నేపథ్యంలో మున్సిపల్ పరిధిలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.
కాగా ఉమ్మడి కరీంనగర్‌లోనే మరికొందరి టీఆర్‌ఎస్ నేతలకు అవిశ్వాస సెగ తగులుతోంది. హుజూరాబాద్ ఎంపీపీ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతా రావు సతీమణి వొడితెల సరోజినిదేవిపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా హుజూరా బాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్ నాయకుడు, హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ (బ్రహ్మచారి)పై ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment