ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థపై నిన్న(డిసెంబర్ 12న) ఆదాయపు పన్ను శాఖ (ఐటీ), జీఎస్టీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం నుంచి జరగగా రాత్రి 12 గంటలకు ఈ తనిఖీలు ముగిసినట్లు తెలుస్తోంది. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ డైరెక్టర్స్ అయిన యలమంచిలి రవిశంకర, ఎర్నేనీ నవీన్‌కు సంబంధించిన ఇల్లు, కార్యాలయలపైన కూడా అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లతో పాటు పలు హార్డ్‌డిస్క్‌లను స్వాధినం చేసుకున్నట్లు సమాచారం.మైత్రీ మూవీ మేకర్స్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హై బడ్జెట్ చిత్రాలకు నిర్మాణ వ్యయం, పెట్టుబడులను ఎలా సమకుర్చుతున్నారనే దానిపై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
అంతేకాదు హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్, లాభాల గురించి కూడా సంస్థ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాదు పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఇది రెగ్యులర్ చెకింగ్‌లో భాగంగానే సోదాలు నిర్వహించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ మీడియాతో పేర్కొన్నారు. కాగా పుష్ప, శ్రీమంతుడు, డియర్ కామ్రేడ్,సర్కారు వారి పాట, ఉప్పెన, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలను ఈ సంస్థలోనే నిర్మించబడ్డాయి.
చదవండి:
నన్ను నమ్మిన మొదటి వ్యక్తి నువ్వే డార్లింగ్: ప్రభాస్‌పై జక్కన్న కామెంట్స్
అవకాశం వస్తే పాకిస్తాన్ సినిమాల్లోనూ నటిస్తా: రణ్‌బీర్ కపూర్
Comments
Please login to add a commentAdd a comment