అమెజాన్ లో మరో కొత్త సేల్ | Amazon Fab Phones Fest Sale Begins on December 22 | Sakshi
Sakshi News home page

అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్: మొబైల్స్ పై బంపర్‌ ఆఫర్లు

Published Fri, Dec 18 2020 7:12 PM | Last Updated on Fri, Dec 18 2020 10:33 PM

Amazon Fab Phones Fest Sale Begins on December 22 - Sakshi

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలోని మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక సేల్ నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ అని పిలువబడే ఈ సేల్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు కొనసాగుతుంది. నాలుగు రోజుల సేల్ లో లభించే మొబైల్, మొబైల్ సంబంధిత ఇతర ఉపకరణాలపై డిస్కౌంట్, ఒప్పందాలను హైలైట్ చేయడానికి కంపెనీ ఇప్పటికే మైక్రోసైట్‌ను రూపొందించింది. అమెజాన్ తన మైక్రోసైట్‌లో సేల్ విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లను జాబితాను విడుదల చేసింది.(చదవండి: క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు జాగ్రత్త!)

అమెజాన్ విడుదల చేసిన జాబితాలో ఐఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, రెడ్‌మీ నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ 5జీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21 ఇంకా మరిన్ని ఉన్నాయి. అయితే, స్మార్ట్‌ఫోన్‌ల తగ్గింపు ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. రేపు (డిసెంబర్ 19) ధరలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. అమెజాన్ ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో ఇప్పుడు పవర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్లు, మొబైల్ కేసులు, కవర్లు, కేబుల్‌లతో సహా ఇతర మొబైల్ ఉపకరణాలపై డిస్కౌంట్లను కూడా అందిస్తుంది. వన్‌ప్లస్, నోకియా, షియోమి, హానర్, శామ్‌సంగ్, ఎల్‌జి, రియల్‌మే, ఆపిల్, ఒప్పో, జాబ్రాతో సహా ప్రముఖ బ్రాండ్లపై డిస్కౌంట్స్ అందిస్తున్నారు. ఫాబ్ ఫోన్స్ ఫెస్ట్ సందర్భంగా అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 1,500 రూపాయల వరకు ఇన్స్టాంట్ డిస్కౌంట్ అందిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement