సాక్షి, ముంబై: ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. ప్రధానంగా యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని అత్యాధునిక ఫీచర్లతో ఒప్పో ఎఫ్ 15 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం తీసుకొచ్చింది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్‌తో అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్లో ఆకర్షణీయమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత వీడియో బ్యూటిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, వూక్ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, వెనుక భాగంలో క్వాడ్ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి.
ఒప్పో ఎఫ్15 ఫీచర్లు
6.4 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 9 పై
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్
128 దాకా విస్తరించుకునే అవకాశం
48+8+2+2ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీకెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : రూ. 19,990
అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్ , ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ప్రీ-ఆర్డర్‌లలో ఈ రోజు నుండి ప్రారంభం. మొదటి అమ్మకం జనవరి 24 న జరగనుంది.
లాంచింగ్ ఆఫర్లు: వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ వినియోగదారులకు 10 శాతం క్యాష్‌బ్యాక్
Comments
Please login to add a commentAdd a comment