
ముంబై: ప్రముఖ చైనీస్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ 'ఒప్పో' ఆకర్శనీయమైన ఫీచర్లతో వినియోగదారులను అకర్శిస్తున్న విషయం తెలిసిందే. ఒప్పో తాజాగా రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను బుధవారం తీసుకొచ్చింది. ఒప్పో సిరీస్‌లో భాగంగా ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రొ మోడళ్లను దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ సెరామిక్ నలుపు వర్ణంలో ఉంటుందని తెలిపింది.
దేశంలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.64,900గా ఒప్పో సంస్థ నిర్ణయించింది. అయితే ఒప్పో ఫైండ్ ఎక్స్2 ప్రొ ధరను ఇంకా ప్రకటించలేదు. ఇటీవల అద్భుత ఫీచర్లతో వన్‌ప్లస్ 8సిరీస్, సామ్‌సాంగ్ గ్యాలెక్సీ ఎస్ 20 మార్కెట్‌లోకి వచ్చాయి. వాటికి దీటుగా అత్యుత్తమ ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తాయని ఒప్పో సంస్థ వర్గాలు తెలిపాయి. కాగా రెండు సిరీస్ ఫోన్లకు స్టీరియో స్పీకర్లు ప్రధాన ఆకర్షణని, ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్‌వేర్‌ను అమర్చామని సంస్థ పేర్కొంది.
ఫైండ్ ఎక్స్2 ప్రొ ఫీచర్లు
డిస్‌ప్లే:6.70 అంగుళాలు
ప్రాసెసర్:క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865 డిస్‌ప్లే
ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 48+48+13 మెగా పిక్సల్
ర్యామ్:12జీబీ
స్టోరేజ్:512జీబీ
బ్యాటరీ కెపాసిటీ:4260ఎమ్‌ఎహెచ్
ఓఎస్:ఆండ్రాయిడ్ 10
ఫైండ్ ఎక్స్2 ఫీచర్లు
డిస్‌ప్లే: 6.70 అంగుళాలు
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 865
ఫ్రంట్ కెమెరా: 32 మెగా పిక్సల్
రియర్ కెమెరా: 48+12+13 మెగా పిక్సల్
ర్యామ్: 12జీబీ
స్టోరేజ్:256జీబీ
బ్యాటరీ కెపాసిటీ: 4200mAh
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
Comments
Please login to add a commentAdd a comment