
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మొబైల్ రిటైల్ స్టోర్ల దిగ్గజం ‘లాట్ మొబైల్స్’లో ఒప్పో ఎఫ్11 ప్రో మొబైల్ విడుదల కార్యక్రమం జరిగింది. శుక్రవారం కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని లాట్ మొబైల్స్ షోరూమ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లాట్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ నటి పూజ హెగ్డే ‘ఒప్పో ఎఫ్11 ప్రో’ను ఆవిష్కరించి, మార్కెట్లోకి విడుదల చేశారు. లాట్ స్టోర్స్‌లో ముందుగా ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్న వారిలో కొందరు కస్టమర్లకు ఈ సందర్భంగా మొబైల్స్‌ను అందించారు. ఒప్పో ఎఫ్11 ప్రోను విడుదల చేయడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా లాట్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని తమ లాట్ షోరూమ్‌లలో సంచలన మోడల్ ఒప్పో ఎఫ్11ప్రో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు.
ప్రత్యేకతలు...
ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నందున అత్యంత స్పష్టతతో హెచ్‌డీ ఫోటోలను తీసుకోవచ్చని, ఈ ఫోన్ ధర రూ.24,990గా తెలిపారు. లాట్ మొబైల్స్‌లో ఒప్పో ఎఫ్11 ప్రోను బుక్ చేసుకుంటే కస్టమర్లకు పూర్తి స్థాయి యాసిడెంటల్ డ్యామేజీ ప్రొటెక్షన్ కవరేజీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 5 శాతం క్యాష్ బ్యాక్, ప్రత్యేకమైన బహుమతి ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment