వచ్చేసింది..! ఒప్పో రెనో 7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌..! ధర ఎంతంటే..? | Oppo Reno 7 5G Reno 7 Pro 5G With Launched In India | Sakshi
Sakshi News home page

Oppo: వచ్చేసింది..! ఒప్పో రెనో 7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌..! ధర ఎంతంటే..?

Published Fri, Feb 4 2022 2:29 PM | Last Updated on Fri, Feb 4 2022 2:30 PM

Oppo Reno 7 5G Reno 7 Pro 5G With Launched In India - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి రెనో 7 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది.  ఒప్పో రెనో 7 ప్రో,  ఒప్పో రెనో 7మోడల్స్‌ను ఒప్పో రిలీజ్ చేసింది.  గతేడాది రిలీజ్ అయిన ఒప్పో రెనో 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7 మోడల్స్‌ను పరిచయం చేసింది.  ఒప్పో రెనో 7 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఫిబ్రవరి 17న సేల్ ప్రారంభం కానుంది. ఇక ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999. ఫిబ్రవరి 8న సేల్ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్లను కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్లను స్టార్‌ట్రయల్స్ బ్లూ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో లభించనుంది. 

వీటికి గట్టి పోటీ..!
ఒప్పో రెనో 7 స్మార్ట్‌ఫోన్‌ షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్, వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్లకు, ఒప్పో రెనో 7 ప్రో షావోమీ 11టీ ప్రో, వివో వీ23 ప్రో, వన్‌ప్లస్ 9ఆర్‌టీ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. .

ఒప్పో రెనో 7 ప్రో స్పెసిఫికేషన్స్

  • 6.55 అంగుళాల పుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది.
  • మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్‌
  • ఆండ్రాయిడ్ 12 + కలర్ ఓఎస్
  • 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ కెమెరా
  • 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 4,500ఎంఏహెచ్ బ్యాటరీ
  • 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్

చదవండి: మరోసారి షాకిచ్చిన అమెజాన్‌..! భారీగా పెరిగిన ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ధరలు..! ఈ సారి వారి వంతు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement