Oppo India
-
బాబోయ్ స్మార్ట్‌ఫోన్ లోబ్యాటరీ! ఇదెక్కడి లొల్లి! మీకు ‘నోమోఫోబియా’ ఉందా?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కాసేపు ఫోన్ కనపడకపోతే.. ప్రపంచానికి మనం దూరమైపోయినట్టు తల్లడిల్లిపోతుంటాం. అదే.. ఫోన్లో లో–బ్యాటరీ అనే సింబల్ కనిపిస్తే.. చాలామందిలో ఆందోళన పెరిగిపోతుంటుంది. దీనినే నోమోఫోబియో (నో మొబైల్ భయం) అని పిలుస్తారంట. నాలుగేళ్ల క్రితం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఈ పదాన్ని చేర్చినా.. ఇప్పుడు ప్రతి నలుగురు భారతీయుల్లో ముగ్గురు ఈ నోమోఫోబియోతో బాధపడుతున్నారని ఓ సర్వేలో తేలింది. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో ఇండియా, మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్‌తో కలిసి దేశంలోని నగరాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఫోన్ బ్యాటరీ లెవల్స్ పడిపోయినప్పుడు వినియోగదారులు ఎలా స్పందిస్తున్నారనే దానిపై టైర్–1, టైర్–2 నగరాల్లోని 1,500 మంది ఫోన్ యూజర్ల నుంచి వివరాలు సేకరించారు. -LA PELIGROSA NOMOFOBIA @El_Universal_Mx @Univ_Opinion #nomofobia #artificalintelligence #InteligenciaArtificial #conexion #internet #smartphone #socialmedia pic.twitter.com/Bs0UUOtEUh — Angel Boligan (@AngelBoligan) March 5, 2023 బ్యాటరీ అయిపోతే.. ఫోన్ వాడలేం! ఈ అధ్యయనం ప్రకారం.. సెల్‌ఫోన్ బ్యాటరీ చార్జింగ్ అయిపోతే ఫోన్ వాడలేం కదా.. ఇప్పుడెలా అనే ఆందోళనతో ఎక్కువ మంది బాధపడుతున్నారట. ఈ క్రమంలో లో–బ్యాటరీ అనే సిగ్నల్ కనిపిస్తే చాలు టెన్షన్‌తో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడైంది. 100 శాతం బ్యాటరీ ఉన్నప్పుడు ఆనందంగా ఉండే వినియోగదారులు.. ఫోన్ చార్జింగ్ 20 శాతానికి తక్కువగా కనిపిస్తే ఫోబియోతో బాధపడుతున్నారని తేలింది. 100 మందిలో 75 మంది ఫోన్ చార్జింగ్ తగ్గిపోతున్న కొద్దీ స్విచ్ఆఫ్ అయిపోతుందన్న ఆందోళనతో కనిపిస్తున్నారని ఈ అధ్యయనంలో తేలింది. సర్వే ఇంకేం చెప్పిందంటే.. ► ‘లో బ్యాటరీ’ నోమోఫోబియో భయం 31 నుంచి 40 ఏళ్లలోపు వయసు వారిలో 77 శాతం వరకూ ఉండగా.. 25 నుంచి 30 ఏళ్లలోపు వారిలోనూ ఈ భయం గుర్తించినట్టు సర్వేలో వెల్లడించింది. ► 87 శాతం మంది ఫోన్‌ని చార్జింగ్ పెట్టి మరీ ప్రమాదకరంగా వినియోగిస్తున్నారు. ► ఫోన్ బ్యాటరీ పనిచేయకుంటే భయంభయంగా ఉంటుందని 82% మంది పురుషులు చెప్పగా.. 74 శాతం మంది మహిళా యూజర్లు అదే ఆందోళన వెలిబుచ్చారు. ► 60 శాతం మంది వినియోగదారులైతే ఫోన్ బ్యాటరీలో చార్జింగ్ తక్కువ సమయం వస్తుంటే.. వెంటనే 100లో 60 మంది కొత్త ఫోన్ కొనుగోలు చేసేస్తున్నారు. ► 100లో 46 మంది వినియోగదారులు తమ ఫోన్లో చార్జింగ్ ఉన్నప్పటికీ రోజుకు రెండుసార్లు చార్జింగ్ పెడుతున్నారు. 0 92 శాతం మంది తమ ఫోన్లో పవర్ సేవింగ్ మోడ్ వినియోగిస్తున్నారు. ► ఇంటికి చేరేలోపు లో–బ్యాటరీ సిగ్నల్ వస్తుందేమోనన్న భయంతో 82 శాతం మంది యూజర్లు సోషల్ మీడియా వినియోగ సమయాన్ని తగ్గించేసుకుంటున్నారు. ► సోషల్ మీడియా కోసమే స్మార్ట్ ఫోన్ అని 78 శాతం మంది చెప్పారు. ► ఎంటర్టైన్మెంట్, మూవీస్, సీరియల్స్, టీవీషోస్ చూసేందుకు ఎక్కువగా వినియోగిస్తున్నామని 42% మంది వినియోగదారులు చెప్పారు. ఆందోళన తగ్గించుకోవాలి స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న మార్పులపై అధ్యయనం చేసేందుకు సర్వే నిర్వహించాం. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్లు జీవితాలపై ప్రతికూల ప్రభావాలను కూడా కలిగిస్తాయని గుర్తించాలి. గంటలకొద్దీ ఫోన్‌ని వినియోగించకుండా అవసరం మేరకే ఫోన్లని వాడాలి. స్మార్ట్ ఫోన్ల విషయంలో కలిగే ఆందోళనలను తగ్గించుకునేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఫోన్ వాడకానికి అప్పుడప్పుడూ గ్యాప్ ఇస్తూ కుటుంబసభ్యులు, స్నేహితులు, కొలీగ్స్‌తో మమేకమవుతూ మానవ సంబంధాలకు విలువనివ్వాలి. ఫోన్ల వాడకంపై అవగాహనతో పాటు జాగ్రత్తగా ఉండటం ద్వారా నోమోఫోబియోని అధిగమించడం సులువు. – దమయంత్ సింగ్ ఖనోరియా, సీఎంవో, ఒప్పో ఇండియా -
రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత
న్యూఢిల్లీ: దాదాపు రూ. 4,389 కోట్ల దిగుమతి సుంకాల ఎగవేత ఆరోపణలపై చైనాకు చెందిన హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పో ఇండియాకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) షోకాజ్ నోటీసులు (ఎస్సీఎన్) జారీ చేసింది. జూలై 8న ఈ నోటీసులు జారీ చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఒప్పో ఇండియా కార్యాలయాలు, సంస్థలోని కీలక ఉద్యోగుల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో.. మొబైల్ ఫోన్ల తయారీ కోసం దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తుల వివరాలను తప్పుగా చూపినట్లు కచ్చితమైన ఆధారాలు లభించాయి. దీంతో రూ. 4,389 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేతపై ఒప్పో ఇండియాకు షోకాజ్ నోటీ జారీ అయ్యింది’ అని పేర్కొంది. ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం.. ఒప్పో ఇండియా కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో, కంపెనీ కొన్ని దిగుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా చూపించినట్లు, నిబంధనలకు విరుద్ధంగా పలు బహుళ జాతి సంస్థలకు రాయల్టీలు, లైసెన్సు ఫీజుల కింద నిధులు చెల్లించినట్లు పక్కా ఆధారాలు లభించాయి. దిగుమతి సుంకాలపరంగా కంపెనీ సుమారు రూ. 2,981 కోట్ల మేర మినహాయింపు ప్రయోజనాలు పొందింది. అంతే గాకుండా టెక్నాలజీ, బ్రాండ్, మేథోహక్కుల లైసెన్సులు వినియోగించుకున్నట్లు చూపడం ద్వారా పలు సంస్థలకు రాయల్టీ, లైసెన్సు ఫీజులు చెల్లించినట్లు/చెల్లించాల్సి ఉన్నట్లు ప్రొవిజనింగ్ చేసింది. వీటిని దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువకు జోడించకపోవడం ద్వారా రూ. 1,408 కోట్ల మేర సుంకాలు ఎగవేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. కా గా, ఎస్‌సీఎన్‌లో పేర్కొన్న ఆరోపణలపై తమ అభి ప్రాయం వేరుగా ఉందని ఒప్పో ఇండియా తెలిపింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రదించడంతో పాటు తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. -
వచ్చేసింది..! ఒప్పో రెనో 7 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో భారత మార్కెట్లలోకి రెనో 7 సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7మోడల్స్‌ను ఒప్పో రిలీజ్ చేసింది. గతేడాది రిలీజ్ అయిన ఒప్పో రెనో 6 సిరీస్ స్మార్ట్ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తూ ఒప్పో రెనో 7 ప్రో, ఒప్పో రెనో 7 మోడల్స్‌ను పరిచయం చేసింది. ఒప్పో రెనో 7 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. ఫిబ్రవరి 17న సేల్ ప్రారంభం కానుంది. ఇక ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్‌ఫోన్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999. ఫిబ్రవరి 8న సేల్ మొదలుకానుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఒప్పో ఆన్లైన్ స్టోర్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లను కొనొచ్చు. ఈ స్మార్ట్ఫోన్లను స్టార్‌ట్రయల్స్ బ్లూ, స్టార్‌లైట్ బ్లాక్ కలర్స్ వేరియంట్స్‌లో లభించనుంది. వీటికి గట్టి పోటీ..! ఒప్పో రెనో 7 స్మార్ట్‌ఫోన్ షావోమీ 11ఐ, షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్, వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్ఫోన్లకు, ఒప్పో రెనో 7 ప్రో షావోమీ 11టీ ప్రో, వివో వీ23 ప్రో, వన్‌ప్లస్ 9ఆర్టీ మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. . ఒప్పో రెనో 7 ప్రో స్పెసిఫికేషన్స్ 6.55 అంగుళాల పుల్ హెచ్డీ+ సూపర్ అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 12 + కలర్ ఓఎస్ 50 మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ కెమెరా 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 4,500ఎంఏహెచ్ బ్యాటరీ 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చదవండి: మరోసారి షాకిచ్చిన అమెజాన్..! భారీగా పెరిగిన ప్రైమ్ మెంబర్షిప్ ధరలు..! ఈ సారి వారి వంతు..! -
ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్
అక్టోబర్‌లో లాంచ్ చేసిన ఒప్పో ఎ15కి కొనసాగింపుగా ఒప్పో ఎ15ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. ఒప్పో ఎ15ఎస్, ఒప్పో ఎ15 సమానమైన డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. డిసెంబర్ 21 నుంచి ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా, రిటైల్ ఔట్లెట్ల ద్వారా ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. ఒప్పోఎ15ఎస్ 4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.11,490. ఇది డైనమిక్ బ్లాక్, ఫ్యాన్సీ వైట్ మరియు రెయిన్ బో సిల్వర్ అనే మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: క్యూఎల్ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ) ఒప్పో ఎ15ఎస్ ఫీచర్స్: ఒప్పో ఎ15ఎస్ కలర్ఓఎస్ 7.2పై నడుస్తుంది. ఇది 6.52-అంగుళాల హెచ్డి ప్లస్ డిస్ప్లేను 89 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పీ 35 ప్రాసెసర్ తో పనిచేస్తుంది. ఒప్పో ఎ15ఎస్ 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుంది. ఒప్పో ఎ15ఎస్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీనిలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో వై-ఫై, బ్లూటూత్, జిపిఎస్, ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఇది 4,230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో సపోర్ట్ తో వస్తుంది. హెచ్‌డిఎఫ్‌సి డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఆఫర్ కూడా ఉంది. ఐసీఐసీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ అభించనుంది. ఈ ఆఫర్లు డిసెంబర్ 21 నుండి డిసెంబర్ 25 వరకు మాత్రమే చెల్లుతాయి. -
జెండాకు అవమానం.. వివాదంలో చైనా ఫోన్‌కంపెనీ!
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో చిక్కుల్లో పడింది. నోయిడాలోని ఆ కంపెనీ ఉద్యోగి ఒకరు భారత జెండాను చింపి.. చెత్తకుప్పలో వేసినట్టు అభియోగాలు రావడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రికత్త తలెత్తింది. జాతీయ జెండాలను పట్టుకొని పలువురు వ్యక్తులు ఒప్పో ఇండియా కార్యాలయం ముందు చేరుకొని నిరసనప్రదర్శనకు దిగారు. ఒప్పో కంపెనీ భారత జెండాను అవమానించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒప్పో కంపెనీ భారత జెండాను అవమానించిందన్న కథనాలు, ట్వీట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ అంశంపై చాలామంది ట్వీట్ చేస్తున్నారు. యూపీ కొత్త సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించి.. ఒప్పో కంపెనీపై చర్య తీసుకోవాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. Chinese employee of @oppo at Noida torn off the Indian National Flag and dumped in dustbin. People have reached the site with Flags. pic.twitter.com/vLT1DjciAv — Rishi Muni (@RishiUvaach) 28 March 2017