హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ రంగంలో భారత్‌లో 5జీ మోడళ్లకు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. సైబర్‌మీడియా రీసెర్చ్ పరిశోధన ప్రకారం.. దేశంలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు పరిగణించే అంశాలలో 5జీ ఒకటని 83 శాతం మంది తెలిపారు. ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వాడుతున్న అయిదుగురిలో ముగ్గురు తదుపరి తరం సాంకేతికతకు అప్‌గ్రేడ్ అవ్వాలని చూస్తున్నారు. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఒప్పో బ్రాండ్‌ను 81 శాతం మంది ఇష్టపడితే, శామ్‌సంగ్ వైపు 79 శాతం మంది మొగ్గుచూపారు. భారత్‌తోపాటు చైనా, పశ్చిమ యూరప్‌లో ఈ సర్వే చేపట్టారు. 18–35 ఏళ్ల వయసున్న వారు పాలుపంచుకున్నారు. భారత్ నుంచి 3,000 మంది, చైనా 1,000, పశ్చిమ యూరప్‌కు చెందిన 1,000 మంది ఇందులో పాల్గొన్నారు. (చదవండి: బడ్జెట్‌లో మోటో 5జీ ఫోన్)
5జీ సేవలు అందుబాటులో ఉన్నచోట నాణ్యమైన వీడియో కాల్స్, వేగంగా డౌన్‌లోడ్స్, అల్ట్రా హై డెఫినిషన్ వీడియోలను వీక్షిస్తున్నారు. కస్టమర్ల సంతృప్తి 80 శాతముంది. వీడియో కంటెంట్ పెరుగుదలకు, వినియోగానికి ఈ టెక్నాలజీ దోహదం చేస్తోంది. చైనాలో హువావే బ్రాండ్‌కు 91% మంది, యాపిల్‌కు 58% మొగ్గుచూపారు. పశ్చిమ యూరప్‌లో శామ్‌సంగ్‌కు 88%, హువావే బ్రాండ్‌కు 65% సై అన్నారు. చిప్‌సెట్ సంస్థలు 5జీ పైనే పెట్టుబడులు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment