శాంసంగ్ కు భారీముప్పు: 2200 కోట్ల ప్లాన్ | Oppo, Vivo chart Rs 2,200 crore strategy to beat Samsung in India | Sakshi
Sakshi News home page

శాంసంగ్ కు భారీముప్పు: 2200 కోట్ల ప్లాన్

Published Wed, May 3 2017 7:28 PM | Last Updated on Tue, Sep 5 2017 10:19 AM

శాంసంగ్ కు భారీముప్పు: 2200 కోట్ల ప్లాన్

శాంసంగ్ కు భారీముప్పు: 2200 కోట్ల ప్లాన్

న్యూఢిల్లీ : దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ను పడగొట్టడానికి చైనీస్ దిగ్గజాలను భారీ మొత్తంతో ప్లాన్ చేస్తున్నాయి. శాంసంగ్ తర్వాతి స్థానంలో ఉన్న వివో, ఒప్పోలు ఎలాగైనా ఈ కంపెనీని అధిగమించాలని భారత్ లో మార్కెటింగ్ కోసం రికార్డు మొత్తంలో 2200 కోట్లకు పైగా వెచ్చించాలని నిర్ణయించాయి.  ఈ మొత్తం  ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు  శాంసంగ్, ఎల్జీ, వీడియోకాన్, సోనీలు వెచ్చించే మార్కెటింగ్ బడ్జెట్ కంటే అత్యధికం.ఈ రెండు చైనీస్ దిగ్గజాలు నాన్-కన్వెక్షనల్ స్టోర్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ స్టోర్ల ద్వారా తమ సేల్స్ నెట్ వర్క్ ను 25 శాతం విస్తరించడానికి కూడా మొత్తాన్ని ఖర్చుచేయనున్నాయి.  అంతేకాకుండా శాంసంగ్ ను దెబ్బతీయడానికి ఇప్పడికే చాలా సెల్ ఫోన్ స్టోర్లను వివో, ఒప్పోలు ఆశ్రయించాయని, శాంసంగ్ స్మార్ట్ ఫోన్లపై ఫోకస్ తగ్గించాలని కోరినట్టు రిపోర్టు వెలువడ్డాయి.
 
వాల్యుమ్ సేల్స్, పేయింగ్ రిటైలర్స్ పై వివో-ఒప్పోలు ఎక్కువగా దృష్టిసారించాయని, వచ్చే రెండేళ్లలో తమ బ్రాండింగ్ ను భారత మార్కెట్లో నెలకొల్పుతాయని లీడింగ్ సెల్ ఫోన్ రిటైల్ చైన్ ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. రిటైలర్లకు, షాప్ ఫ్లోర్ సేల్స్ ప్రమోటర్లకు 5-10 శాతం కంటే ఎక్కువ మార్జిన్లను కూడా ఆఫర్ చేస్తాయని చెప్పారు. పెద్ద పెద్ద నగరాల్లో అవుట్ డోర్ మీడియా కోసం ఈ రెండు కంపెనీలు చెరో 20 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాయని రిపోర్టులు వెలువడుతున్నాయి. చిన్న పట్టణాలకు, గ్రామీణ మార్కెట్లకు కూడా తమ కార్యకలాపాలను ఈ కంపెనీలు విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ పోటీపడాల్సింది ఆపిల్ తో కాదని, వివో, ఒప్పోలతోనని ఇంతకమునుపే రిపోర్టులు వచ్చాయి. ఈ రెండు కంపెనీల నుంచి శాంసంగ్ కు భారీ ముప్పే ఉంటుందని తెలిసింది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement