గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, చైనా దిగ్గజం షియోమీ పోటీపడుతున్నాయి. ప్రముఖ రీసెర్చ్ సంస్థ అంతర్జాతీయ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) విడుదల చేసిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ గ్రోత్ ఇన్ 2021 క్యూ2 నివేదిక ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ షిప్ మెంట్స్ పరంగా శాంసంగ్ అగ్రభాగాన ఉంది. శాంసంగ్ తర్వాత రెండవ స్థానంలో చైనా దిగ్గజం షియోమీ ఉంది. షియోమీ మొదటిసారి రెండవ స్థానానికి చేరుకుంది. క్యూ2 2021లో యాపిల్ ను మూడవ స్థానానికి నెట్టింది. మొత్తం షిప్ మెంట్ వాల్యూమ్ పరంగా సంవత్సరానికి 13.2 శాతం పెరిగాయి. స్మార్ట్‌ఫోన్ విక్రేతలు త్రైమాసికంలో మొత్తంగా 313.2 మిలియన్ పరికరాలను రవాణా చేశారు.
2021 క్యూ2లో శామ్ సంగ్ 59 మిలియన్ యూనిట్లను రవాణా చేసినట్లు ఐడీసీ నివేదించింది. దీంతో మొత్తం మార్కెట్లో దీని వాటా 18.8 శాతం. దక్షిణ కొరియా దిగ్గజం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 54 మిలియన్ యూనిట్లను రవాణా చేసింది. మరోవైపు, షియోమీ క్యూ2 2021లో 53.1 మిలియన్ యూనిట్లతో షిప్ మెంట్ లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇక మార్కెట్లో దీని వాటా 16.9 శాతం. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రవాణా చేసిన 28.5 మిలియన్ యూనిట్ల నుంచి ఇది భారీ పెరుగుదల. ఐడీసీ నివేదికల ప్రకారం.. 44.2 మిలియన్ షిప్ మెంట్లు, 14.1 శాతం మార్కెట్ వాటాతో యాపిల్ మూడవ స్థానానికి చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో యాపిల్ 37.6 మిలియన్ యూనిట్లను రవాణా చేసి 13.6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇక తర్వాత వరుసలో ఒప్పో(32.8 మిలియన్లు), వివో 31.6 మిలియన్ల షిప్ మెంట్లతో ఐడీసీ జాబితాలో మూడవ, నాల్గవ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment