స్మార్ట్ దిగ్గజం శాంసంగ్ కు భారీ ముప్పు
ఒప్పో, వివోలు 16.8 శాతం, 14.8 శాతం మార్కెట్ షేరుతో తొలి రెండు స్థానాలకు రాక, అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండుగా ఉన్న ఆపిల్ మార్కెట్ షేరు 9.6 శాతానికి పడిపోయింది. చైనాలో ఆపిల్ తమల్ని బీట్ చేయలేదని ఓప్పో, వివో కంపెనీల వ్యవస్థాపకుడు చైనీస్ బిలినియర్ డుయాన్ యాంగ్ పింగ్ ఆ దిగ్గజానికే సవాలు విసిరారు. ప్రస్తుతం ఇదే స్టోరీ భారత్ లోనూ కొనసాగుతోంది. భారత్ లో మార్కెట్ లీడర్ గా ఉన్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కు చెక్ పెట్టేందుకు వివో, ఒప్పోలు పన్నాగం పన్నుతున్నాయి.
ఉత్పత్తుల భారీ పోర్టుఫోలియో, బలమైన పంపిణీ వ్యవస్థ, త్వరగా రిటైల్ ను చేరుకోవడం ఉన్నప్పటికీ, శాంసంగ్ కంపెనీ చైనాకు చెందిన ఈ కంపెనీలకు తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం శాంసంగ్ కంపెనీకి ఆపిల్ నుంచి కాకుండా, చైనీస్ బ్రాండుల నుంచే భారీ ముప్పు ఉన్నట్టు మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వైండర్ యాంగిల్ కెమెరా, ఫర్ ఫెక్ట్ సెల్ఫీ గ్రూప్ కు ఉపయోగపడుతుందని భావించిన ఒప్పో, ఇటీవల తన ఫోన్లన్నీ సెల్ఫీ ఫోకస్డ్ గా తీసుకొస్తోంది.