స్మార్ట్‌ఫోన్‌కు డిమాండ్ పుంజుకున్న నేపథ్యంలో కంపెనీలు కూడా భారీ ఎత్తునే లాభాలను ఆర్జిస్తున్నాయి. ఒక్కో యూనిట్ విక్రయంతో, కంపెనీలు పొందే లాభాలు భారీ ఎత్తునే ఉన్నాయని రీసెర్చ్ కంపెనీ కౌంటర్ పాయింట్ తాజా సర్వే ర్యాంకింగ్స్‌ను పేర్కొన్నాయి. ఇప్పటి వరకు రెండు దిగ్గజ కంపెనీలు ఆపిల్, శాంసంగ్ మాత్రమే లాభాలను షేర్ చేసుకోగా.. ప్రస్తుతం చైనీస్ కంపెనీలు కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తమ సత్తాను చాటుతున్నాయి. తొలిసారి సింగిల్ క్వార్టర్‌లోనే(క్యూ3 2017) చైనీస్ బ్రాండులు 1.5 బిలియన్ డాలర్ల లాభాలను అధిగమించాయి.
ఆపిల్...
మొబైల్ హ్యాండ్‌సెట్ ఇండస్ట్రీ లాభాల్లో ఆపిల్ మరోసారి తన సత్తా చాటింది. 60 శాతం షేరుతో ఇది మళ్లీ అగ్రస్థానంలో నిలిచింది. కానీ గతేడాది ఇదే క్వార్టర్‌లో ఆపిల్‌కు ఉన్న లాభాలు 86 శాతం నుంచి 60 శాతానికి తగ్గిపోయాయి. ఒక్కో ఐఫోన్ విక్రయంతో ఆపిల్ 150 డాలర్ల లాభాన్ని ఆర్జించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. హాలిడే సీజన్ క్వార్టర్‌లో మరింత పెరుగుతాయని అంచనావేస్తోంది.
శాంసంగ్....
నోట్ 8 సిరీస్‌తో ఈ ఏడాది మూడో క్వార్టర్‌లో శాంసంగ్ చాలా బలంగా మార్కెట్‌లోకి వచ్చింది. గెలాక్సీ ఎస్8 సిరీస్ కూడా మంచి ప్రదర్శన కనబరుస్తున్నాయి. గెలాక్సీ నోట్7తో 2016 మూడో క్వార్టర్‌లో నష్టాలను పొందినప్పటికీ, ఈ కంపెనీ మంచి లాభాలనే పొందినట్టు తెలిసింది. నోట్8, జే సిరిస్ స్మార్ట్‌ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్నట్టు ఈ కంపెనీ పేర్కొంది.
హువావే....
2017 క్యూ3లో ఏడాది ఏడాదికి హువావే కంపెనీ లాభాల వృద్ధి అత్యధికంగా 67 శాతం ఉన్నట్టు తెలిసింది. తన పోర్ట్‌ఫోలియో విస్తరించడంతో కంపెనీ మంచి లాభాలు పొందుతున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ పేర్కొంది. హువావే ఏఎస్‌పీ వృద్ధి ఏడాది ఏడాదికి 6 శాతం ఉండగా.. ఒక్కో యూనిట్ లాభం 15 డాలర్లుగా ఉంది.
ఒప్పో...
గ్లోబల్ హ్యాండ్‌సెట్ లాభాల షేరులో ఒప్పో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఒక్కో యూనిట్‌కు 14 డాలర్ల లాభాన్ని ఒప్పో సంపాదిస్తోంది.
వివో...
చైనా మంచి ప్రదర్శన కనబరుస్తున్న వివో, ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయక స్మార్ట్‌ఫోన్ కంపెనీల్లో ఐదవ స్థానంలో నిలిచింది. వివో ఒక్కో యూనిట్ లాభం 13 డాలర్లుగా ఉందని వెల్లడైంది.
షావోమి...
ఏడాది ఏడాదికి ఈ హ్యాండ్‌సెట్ బ్రాండు 41 శాతం వృద్ధిని నమోదుచేస్తుంది. అయినప్పటికీ మార్కెట్ లీడర్ల కంటే ఇది తక్కువ స్థానంలోనే ఉంది. షావోమి చేపడుతున్న ఆఫ్‌లైన్ డిస్ట్రిబ్యూషన్ ఇక ఒప్పో, హువావే దగ్గరకు చేర్చనుంది. కానీ షావోమి ఎక్కువగా లోయర్-ఎండ్ మోడల్స్‌నే విక్రయిస్తోంది. అదే ఎంఐ మిక్స్ 2, ఎంఐ 6 సిరీస్ లాంటి ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లపై ఎక్కువగా దృష్టిసారిస్తే మరింత లాభాలను ఆర్జించనుంది. ప్రస్తుతం ఒక్కో యూనిట్‌పై తక్కువగా 2 డాలర్ల ప్రాఫిట్ మాత్రమే వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment