
పలు రూమర్ల అనంతరం ఎట్టకేలకు ఒప్పో బెజెల్-లెస్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్5 భారత్‌కు వచ్చేస్తోంది. ఈ డివైజ్‌ను భారత్‌కు తీసుకొస్తున్నట్టు కంపెనీ ధృవీకరించింది. నవంబర్ 2 ఈవెంట్‌కు సంబంధించి కంపెనీ మీడియా ఈవెంట్లను కూడా పంపుతోంది. ఇప్పటికే ఈ ఫోన్‌పై పలు లీక్స్, రూమర్లు మార్కెట్‌లో చక్కర్లు కొట్టాయి. మీడియా ఆహ్వానాల మేరకు ఒప్పో ఎఫ్5 సెల్ఫీ ఫోకస్డ్‌గా రాబోతుందని తెలుస్తోంది. ''క్యాప్చర్ ది రియల్ యూ'' అనే క్యాప్షన్‌తో ఈ ఫోన్ వస్తోంది. అంటే డివైజ్ యూఎస్‌బీనే తన కెమెరా సెటప్ అని అర్థమవుతోంది. ఒప్పో ఎఫ్5లో అతిపెద్ద ఆకర్షణ దాని ఫ్రంట్ కెమెరా.
ఏఐ బ్యూటీ రికగ్నైజేషన్ టెక్నాలజీతో ఒప్పో ఎఫ్5 రూపొందిందని తెలుస్తోంది. ప్రస్తుతం చాలా ఫోన్లు ఇదే ఫీచర్‌తో మార్కెట్‌లోకి వస్తున్నాయి. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్ భారత్‌కు వచ్చి, అనంతరం ఆసియన్ మార్కెట్లు ఇండోనేషియా, మలేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్ మార్కెట్లలో అందుబాటులోకి వస్తుంది. స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే ఒప్పో ఎఫ్5 స్మార్ట్‌ఫోన్‌కు 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 4జీబీ ర్యామ్ లేదా 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లేదా 128జీబీ స్టోరేజ్, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 630 లేదా 660, 4000ఎంఏహెచ్ బ్యాటరీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది.