
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ తయారీ దారు ఒప్పో బ్రాండ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. రియల్ మీ బ్రాండ్‌లో తొలి డివైస్‌ను భారత మార్కెట్లో మంగళవారం విడుదల చేసింది. ముఖ‍్యంగా ఇండియన్ యూత్‌ను, ఇ-కామర్స్ చానెల్స్ టార్గెట్‌గా దీన్ని లాంచ్ చేసింది. రియల్ మి 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో ప్రత్యేకంగా మార్కెట్లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. 'మేడ్ ఇన్ ఇండియా' లో భాగంగా ప్రీమియమ్ మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది. మూడు వేరియంట్లలో విడుదలైన వీటి ధరలు 3జీబీర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,990, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10990, 6జీబీ, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13990గా ఉండనున్నాయి.
మే25న అమెజాన్ ఇండియాలో రియల్ మీ1 ( 6జీబీ/128 జీబీ) మొదటి అమ్మకాలు మధ్నాహ్నం 12 గంటలకు మొదలు కానుంది. 3 జీబి ర్యామ్ / 32 జీబీ స్టోరేజ్, 4 జీబి ర్యామ్ / 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ స్మార్ట్‌ఫోన్లు ఒక నెల తరువాత అంటే జూన్ నాటికి అందుబాటులోకి వస్తాయి. ఇక లాంచింగ్ ఆఫర్ల విషయానికి వస్తే ఎస్‌బీఐకార్డు ద్వారా కొనుగోళ్లపై 5 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా ఉచితం. జియో ద్వారా 4850 రూపాలయ అదనపు ప్రయోజనం.
రియల్‌మి 1 ఫీచర్లు
6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ ఓరియో 8.1
1080x2160 పిక్సల్స్ రిజల్యూషన్
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
3410 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment