సాక్షి,ముంబై: ఒప్పో తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ఎ ట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ చేసింది. పలు ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది.
మరీ ముఖ్యంగా రూ. 10వేల తగ్గింపుతో ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ను అందుబాటులోకి తీసుకురావడం విశేషం. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్4 కంటే బిగ్ డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చింది. అంతేకాదు 3.26 అంగుళాల అతిపెద్ద వెర్టికల్ కవర్ స్క్రీన్ డిస్‌ప్లే ఎపుడూ ఆన్‌లోనే ఉంటుందట.
ఇండియాలో దీని ప్రారంభ ధర రూ. 89,999గా ఉంనుంది. అయితే క్యాష్‌బ్యాక్‌లు ,ఇతర ప్రోత్సాహకాల ద్వారా కస్టమర్‌లు దీన్ని రూ. 79,999 కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చు. (ఇంటింటికి వెళ్లి కత్తులమ్మి..ఇపుడు కోట్లు సంపాదిస్తున్న అందాల భామ)
ఒప్పో స్టోర్‌లు, ఫ్లిప్‌కార్ట్ ,మెయిన్‌లైన్ రిటైల్ అవుట్‌లెట్స్‌లో మార్చి 17, మధ్యాహ్నం 12 గంటల నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉంటుంది.
హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ కార్డ్‌లు, కోటక్ బ్యాంక్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డీబి ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ కార్డ్ , అమెక్స్‌పై కస్టమర్లు రూ. 5000 వరకు క్యాష్‌బ్యాక్, 9 నెలల వరకు నో-కాస్ట్ EMIని ఆస్వాదించవచ్చు. అలాగే ఒప్పో కస్టమర్‌లు రూ. 5000 వరకు ఎక్స్ఛేంజ్ + లాయల్టీ బోనస్‌ను పొందవచ్చు. ఇంకా ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ మరో రూ. 2000 వరకు తగ్గింపు లభ్యం.
ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫీచర్లు
6.8-అంగుళాల e6 ఫోల్డింగ్ డిస్‌ప్లే
4nm MediaTek డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్
ColorOS 13 ఆండ్రాయిడ్ 13
16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్
50+ 8(ఫిక్స్‌డ్-ఫోకస్ అల్ట్రావైడ్ షూటర్) ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా
32ఎంపీ ఆటో ఫోకస్ సెల్ఫీ కెమెరా
44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,300mAh బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment