సూపర్‌ ఫీచర్స్‌తో ఒప్పో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌..! | Oppo Find N 5G Could Launch As Oppo First Foldable Smartphone Next Month | Sakshi
Sakshi News home page

Oppo: సూపర్‌ ఫీచర్స్‌తో ఒప్పో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌..!

Published Sun, Nov 28 2021 10:11 PM | Last Updated on Sun, Nov 28 2021 10:14 PM

Oppo Find N 5G Could Launch As Oppo First Foldable Smartphone Next Month - Sakshi

ఒప్పో తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే నెలలో విడుదల చేయనుంది. రాబోయే ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఒప్పో వెల్లడించనప్పటికీ, టిప్‌స్టర్  ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి Weiboలో కొన్ని ఆసక్తికరమైన పోస్ట్‌లను షేర్ చేసింది. టిప్‌స్టర్ షేర్ చేసిన పోస్ట్‌లో ఒప్పో ఎన్‌3 స్మార్ట్‌ఫోన్‌ ఉంది.  ‘Oppo Find N 5G’ పేరుతో ఒప్పో స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఒప్పో నుంచి వస్తోన్న మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్/ఫ్లిప్ సిరీస్ మాదిరిగానే ఇన్‌వర్డ్ ఫోల్డింగ్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఒప్పో ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ (అంచనా)

  • 7.8 నుంచి 8 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే
  • క్వాలకం స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌
  • ఆడ్రినో 660జీపీయూ
  • 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా
  • 32-మెగాపిక్సెల్ సెల్ఫీ స్నాపర్‌ పాప్‌ అప్‌ కెమెరా
  • 4,500mAh బ్యాటరీ
  • 65W ఫాస్ట్ ఛార్జింగ్‌
  • సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌

చదవండి: 200 ఎంపీ కెమెరాతో సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌..!.. వచ్చేది ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement