ఒప్పో ఏ71 ధర తగ్గింది | Oppo A71 Price Cut in India  | Sakshi
Sakshi News home page

ఒప్పో ఏ71 ధర తగ్గింది

Published Wed, Jan 24 2018 6:44 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

Oppo A71 Price Cut in India  - Sakshi

ఒప్పో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసిన ఏ71 స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గించినట్టు తెలిసింది. ఆఫ్‌లైన్‌ రిటైలర్ల వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ను 9,990 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గాడ్జెట్స్‌ 360 రిపోర్టు చేసింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో 12,990 రూపాయలకు లాంచ్‌ చేసింది.  జనవరి 24 నుంచి ఈ కొత్త ధరకు ఒప్పో ఏ71 లభ్యమవుతుందని గాడ్జెట్స్‌ 360 రిపోర్టు చేసింది. అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీని ధర తగ్గలేదు. ఇప్పటికీ ఈ రెండు వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 11,990 రూపాయలకే లిస్ట్‌ అయి ఉంది. 
 

ఒప్పో ఏ71 ఫీచర్లు..
డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌, మెటల్‌ యునిబాడీ
4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ కాలింగ్‌ టెక్నాలజీ
5.2 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌ ఆధారిత కలర్‌ఓఎస్‌ 3.1 కస్టమ్‌ స్కిన్‌
1.5గిగాహెడ్జ్‌ మీడియా టెక్‌ ఎంటీ6750 ఎస్‌ఓసీ
3జీబీ ర్యామ్‌, 16జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ రియర్‌, 5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement