Oppo A71
-
ఒప్పో స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గింపు
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు ఒప్పో తన తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. 3వేల రూపాయల తగ్గిపుతో ఈ ఫోన్‌ను ఇపుడు భారతీయ వినియోగదారులకు ఆఫర్ చేస్తోంది. దీని లాంచింగ్ ధర రూ.12,990. అయితే తాజా తగ్గింపుతో ఇపుడు రూ.9,990లకే ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం. దేశవ్యాప్తంగా అన్ని ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ సౌలభ్యాన్ని అందిస్తోంది. బుధవారం నుంచి ఈ తగ్గింపు రేటు అందుబాటులోకి వచ్చింది. ఒప్పో ఎ71 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒప్పో ఎ71 ఫీచర్లు 5.2 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే 720 x 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ 3 జీబీ ర్యామ్ 16 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే సదుపాయం 3 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఒప్పో ఏ71 ధర తగ్గింది
ఒప్పో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన ఏ71 స్మార్ట్‌ఫోన్‌పై ధర తగ్గించినట్టు తెలిసింది. ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్ద ఈ స్మార్ట్‌ఫోన్‌ను 9,990 రూపాయలకే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. తొలుత ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఒప్పో 12,990 రూపాయలకు లాంచ్ చేసింది. జనవరి 24 నుంచి ఈ కొత్త ధరకు ఒప్పో ఏ71 లభ్యమవుతుందని గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం దీని ధర తగ్గలేదు. ఇప్పటికీ ఈ రెండు వెబ్సైట్లో ఈ స్మార్ట్‌ఫోన్ 11,990 రూపాయలకే లిస్ట్ అయి ఉంది. ఒప్పో ఏ71 ఫీచర్లు.. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్, మెటల్ యునిబాడీ 4జీ వాయిస్ఓవర్ ఎల్టీఈ కాలింగ్ టెక్నాలజీ 5.2 అంగుళాల డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1 నోగట్ ఆధారిత కలర్ఓఎస్ 3.1 కస్టమ్ స్కిన్ 1.5గిగాహెడ్జ్ మీడియా టెక్ ఎంటీ6750 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ రియర్, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఒప్పో కొత్త ఫోన్
చైనా మొబైల్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎ 71 పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్స్ లో అందుబాటులో ఉన్న ఈ డివైస్ ధర రూ.12,990గా ఉంవచ్చని అంచనా. గ్లోబల్‌గా కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లను పలకరించనుంది. ఒప్పో ఎ 71 ఫీచర్లు 5.2 డిస్ ప్లే ఆండ్రాయిడ్ నోవాట్ 7.1 720x1280 రిజల్యూషన్ 13 ఎంపీ రియర్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా 3జీబీ ర్యామ్ 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256దాకా విస్తరించుకునే అవకాశం 3000 బ్యాటరీ సామర్ధ్యం