
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ ఒప్పో మరో బ్రాండ్‌న్యూ సెల్ఫీ ఎక్స్‌ఫర్ట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. సెల్పీ డివైస్‌లతో గ్లోబల్‌గా యూత్‌ను ఆకట్టుకుంటున్న ఒప్పో తాజాగా మిడ్ రేంజ్‌లో ఈ డివైస్‌ను ప్రవేశపెట్టింది. ఎఫ్ 7 పేరుతో భారీ స్క్రీన్, అద్భుత ఫీచర్లతో సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. ఎఫ్ 5కి సక్సెసర్‌గా ఎఫ్7ని తీసుకొచ్చింది. లో లైట్ కండిషన్లో కూడా ఫొటోలను అద్భుతంగా తీయగల కెమెరా ఈ డివైఎస్ ప్రత్యేకతగా కంపెనీ చెప్పింది. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ బ్యూటికేషన్ ఏడు దశల్లో, రెండు స్కిన్ టోన్ మోడ్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్టు లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడంచింది. సెల్ఫీ ప్రియులకు ఇది అత్యుత్తమ బ్యూటిఫికేషన్ ఎడిట్స్ ని అందించేలా ఒప్పో ఎఫ్7 ప్రత్యేకమైన ఏరీనా ఏఐ 2.0పవర్ బ్యూటిఫికేషన్ సామర్థ్యాలను కలిగివుందని తెలిపింది. స్కిన్‌తోపాటు కళ్లు, వెంట్రుకలను సైతం మరింత అంతంగా కనిపించేలా చేస్తుందట. అంతేకాదు ఈస్మార్ట్‌ఫోన్ జెండర్‌ను కూడా గుర్తిస్తుందట. సూపర్ ఫుల్ స్క్రీన్ 2.0 ప్యానెల్.. స్పోర్ట్స్ 89.1శాతంతో వస్తున్న ఈ ఎఫ్7 సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ సోలార్ రెడ్, స్టార్రీ బ్లూ, మూన్ లైట్ సిల్వర్ రంగులలో అందుబాటులో ఉండనుంది. 6జీబీ, 128 స్టోరేజ్‌తో మరో వేరియంట్‌ను కూడా లాంచ్ చేసింది.
ధర: 4జీబీ వేరియంట్ ధర రూ. 21,990గా ఉండగా, 6జీబీ వేరియంట్ రూ. 26,990గా ఉంది.
ఒప్పో ఎఫ్7 ఫీచర్లు
6.23 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీడిస్‌ప్లే
1080x2280 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
4జీబీర్యామ్
64 జీబీ స్టోరేజ్
256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
16ఎంపీ రియర్ కెమెరా
25 ఎంపీ సెల్ఫీ కెమెరా
3400 ఎంఏహెచ్ బ్యాటరీ