ఒప్పో రెనో 5ప్రోలో అదిరిపోయే ఫీచర్స్ | OPPO Reno 5 Pro launched in India with Dimensity 1000 plus | Sakshi
Sakshi News home page

ఒప్పో రెనో 5ప్రోలో అదిరిపోయే ఫీచర్స్

Published Mon, Jan 18 2021 3:33 PM | Last Updated on Mon, Jan 18 2021 3:36 PM

OPPO Reno 5 Pro launched in India with Dimensity 1000 plus - Sakshi

న్యూఢిల్లీ: ఒప్పో రెనో 5ప్రో భారతదేశంలో మిడ్-రేంజ్ స్పెసిఫికేషన్లతో ప్రారంభించబడింది. మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్ 5జీ సపోర్ట్ ప్రాసెసర్ ని ఈ మొబైల్ లో తీసుకొచ్చింది. ఒప్పో రెనో 5 ప్రో భారతదేశంలో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ.35,990. ఈ స్మార్ట్‌ఫోన్ ఆస్ట్రల్ బ్లూ మరియు స్టార్రి బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఒప్పో రెనో 5ప్రో జనవరి 22న ఫ్లిప్‌కార్ట్ ద్వారా మొదటి సేల్ కి రానుంది.(చదవండి: ఒప్పో ఎ12 మోడల్ ధర తగ్గింపు)

ఒప్పో రెనో 5ప్రో స్పెసిఫికేషన్స్: 
డిస్‌ప్లే: 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఓఎల్ఈడి డిస్‌ప్లే(90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్)
ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
ప్రాసెసర్: మీడియా టెక్ డైమెన్సిటీ 1000 ప్లస్
రియర్ కెమెరా: 64ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ
సెల్ఫీ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,350 ఎంఏహెచ్(65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కనెక్టివిటీ: 5జీ, 4జీ వోఎల్‌టిఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.1
కలర్స్: ఆస్ట్రల్ బ్లూ, స్టార్రి బ్లాక్
ధర: రూ.35,990

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement