
సాక్షి, ముంబై: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ ఒప్పో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఏ53 2020 పేరుతో రీలాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు, బడ్జెట్ ధరలో తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. 4జీబీ ర్యామ్ +64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో ఆవిష్కరించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హోల్-పంచ్ డిస్‌ప్లే డిజైన్, గ్రేడియంట్ బ్యాక్ లాంటి ప్రత్యేకతలతో బడ్జెట్ ధరల స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్, షావోమిలకు గట్టి పోటి ఇవ్వనుంది.
ఎలక్ట్రిక్ బ్లాక్, ఫెయిరీ వైట్, ఫ్యాన్సీ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరను 12,990 రూపాయలుగా ఉంచింది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు 10,000ఎంఏహెచ్ ఒప్పో పవర్ బ్యాంక్ 2 కూడా లాంఛ్ చేసింది ఒప్పో. దీని ధర 1299 రూపాయలు. అయితే ఒప్పో ఏ53 స్మార్ట్‌ఫోన్‌తో కలిపి ఈ పవర్ బ్యాంక్ కొంటే 400 డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ రోజు (మంగళవారం)మధ్యాహ్నం 3 గంటల నుంచే ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఎంపిక చేసిన బ్యాంకు లావాదేవీలపై ఐదు శాతం క్యాష్‌బ్యాక్, ఆరు నెలల వరకు నో కాస్ట్ ఈఎంఔ, జీరో డౌన్-పేమెంట్ అవకాశం కూడా ఉంది. (చదవండి : షావోమి : కొత్త ఎంఐ టీవీ త్వరలో)
ఒప్పో ఏ53 2020 ఫీచర్లు
6.5 అంగుళాలు డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 10+కలర్ ఓఎస్ 7.2
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 460ప్రాసెసర్
13+2+2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధరలు
4 జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ 12,990 రూపాయలు
6 జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్15,490 రూపాయలు
The faster and smoother #OPPOA53 is here! Packed with a 90Hz Punch-hole display, 18W Fast Charge, 16MP AI Selfie Camera and much more!
— OPPO India (@oppomobileindia) August 25, 2020
Starting at just ₹12,990! Order yours now!
Available now: https://t.co/Jxrk1l7LCU pic.twitter.com/vsse36CPmw
Comments
Please login to add a commentAdd a comment