న్యూఢిల్లీ: ఒప్పో తన కొత్త సిరీస్ రెనో 5ప్రో 5జీ మొబైల్ ని నేడు(జనవరి 18) భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రెనో 5ప్రో 5జీ మొబైల్ మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల కానుంది. ఈ ఫోన్ గురించి కంపెనీ ఒక మైక్రో పేజీని సృష్టించింది. ఇక్కడ ఫోన్ యొక్క కొన్ని ఫీచర్లు హైలైట్ చేసారు. ఒప్పో రెనో 5ప్రో 5జీ 6.5-అంగుళాల 1080p అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిఫ్రెష్ రేటు 90 హెర్ట్జ్‌గా ఉంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1000+ ప్రాసెసర్‌ను అందించనున్నారు.
రెనో 5ప్రో 5జీలో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 2 ఎంపీ పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరా ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 32 ఎంపీ కెమెరాను అందించారు. దీనిలో 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 4,350 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ ఓఎస్ 11.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, గ్లోనాస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 4300 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. చైనాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర 3,399(సుమారు రూ.39,000) చైనా యువాన్లుగా ఉంది.
ఒప్పో రెనో 5ప్రో విడుదల నేడే
Published Mon, Jan 18 2021 10:34 AM | Last Updated on Mon, Jan 18 2021 1:31 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment