![OnePlus Merges Oxygen OS With Oppo Color OS For Better Experience - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/5/OnePlus-Oppo-Merge-OxygenOS-ColorOS.jpg.webp?itok=UOf8DPHW)
వన్ ప్లస్ యూజర్లకు షాకింగ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఒప్పోలో వన్ ప్లస్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్‌ను ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఆక్సిజన్ ఓఎస్ ఎప్పటిలాగే గ్లోబల్ వన్ ప్లస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి ఈ సరికొత్త ఓఎస్ మరింత స్థిరమైన, బలమైన వేదికగా మీకు అందుబాటులో ఉంటుంది’’ అని వన్‌ప్లస్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్వాంగ్ డాంగ్ బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్న వన్ ప్లస్, ఒప్పో కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయి.
అయితే, కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) వనరులను సమీకృతం చేసిన తర్వాత ఒప్పందాన్ని బహిర్గతం చేశాయి. ఒక ఫోరం పోస్ట్ లో వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనంతో యూజర్స్‌కి అద్భుతమైన సరికొత్త ఓఎస్ సాఫ్ట్‌వేర్ అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఓఎస్ భవిష్యత్తులో తన కొత్త పరికరాలకు వర్తిస్తుందని, మెయింటెనెన్స్ షెడ్యూల్ లో ఉన్న ప్రస్తుత పరికరాల కొరకు, ఆక్సిజన్ ఓఎస్ కలర్ ఓఎస్ మధ్య కోడ్ బేస్ స్థాయి ఇంటిగ్రేషన్ ఆండ్రాయిడ్ 12తోపాటు ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్ డేట్ ద్వారా వస్తుందని వన్ ప్లస్ తెలిపింది.
ఒరిజినల్ వన్ ప్లస్ నార్డ్, కొత్త నార్డ్ మోడల్స్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ విషయంలో కంపెనీ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్ లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో వన్ ప్లస్ తన ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో ఒప్పో కలర్ ఓఎస్ ను ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో అన్ని చైనీస్ మొబైల్స్ లో తీసుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment