operating systems
-
వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం
వన్ ప్లస్ యూజర్లకు షాకింగ్ న్యూస్. కొద్ది రోజుల క్రితం ఒప్పోలో వన్ ప్లస్ విలీనం అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్‌ను ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఆక్సిజన్ ఓఎస్ ఎప్పటిలాగే గ్లోబల్ వన్ ప్లస్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఇక నుంచి ఈ సరికొత్త ఓఎస్ మరింత స్థిరమైన, బలమైన వేదికగా మీకు అందుబాటులో ఉంటుంది’’ అని వన్‌ప్లస్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్వాంగ్ డాంగ్ బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్న వన్ ప్లస్, ఒప్పో కొంతకాలంగా కలిసి పనిచేస్తున్నాయి. అయితే, కంపెనీలు తమ పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) వనరులను సమీకృతం చేసిన తర్వాత ఒప్పందాన్ని బహిర్గతం చేశాయి. ఒక ఫోరం పోస్ట్ లో వన్ ప్లస్ ఆక్సిజన్ ఓఎస్ ఒప్పో కలర్ ఓఎస్‌తో విలీనంతో యూజర్స్‌కి అద్భుతమైన సరికొత్త ఓఎస్ సాఫ్ట్వేర్ అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఓఎస్ భవిష్యత్తులో తన కొత్త పరికరాలకు వర్తిస్తుందని, మెయింటెనెన్స్ షెడ్యూల్ లో ఉన్న ప్రస్తుత పరికరాల కొరకు, ఆక్సిజన్ ఓఎస్ కలర్ ఓఎస్ మధ్య కోడ్ బేస్ స్థాయి ఇంటిగ్రేషన్ ఆండ్రాయిడ్ 12తోపాటు ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్ డేట్ ద్వారా వస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఒరిజినల్ వన్ ప్లస్ నార్డ్, కొత్త నార్డ్ మోడల్స్, వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ విషయంలో కంపెనీ రెండు ప్రధాన ఆండ్రాయిడ్ అప్డేట్ లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ లను అందించాలని నిర్ణయించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో వన్ ప్లస్ తన ఆక్సిజన్ ఓఎస్ స్థానంలో ఒప్పో కలర్ ఓఎస్ ను ఫ్లాగ్ షిప్ మోడల్స్ లో అన్ని చైనీస్ మొబైల్స్ లో తీసుకొచ్చింది. చదవండి: మైనర్ల పేరుతో పీఓఎమ్ఐఎస్ ఖాతా తెరవొచ్చు -
Apple updates : ఆపిల్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయ్ !
వెబ్‌డెస్క్: ఆపిల్ యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తన గాడ్జెట్స్‌కి సంబంధించి కొత్త అప్డేట్స్ని ఈ రోజు ఆపిల్ సంస్థ ప్రకటించనుంది. వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) ద్వారా ఫ్యూచర్ టెక్నాలజీని రివీల్ చేయనుంది ఆపిల్ సంస్థ. పది గంటల నుంచి ప్రతీ ఏడు వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది ఆపిల్ సంస్థ. ఈ కాన్ఫరెన్స్ ద్వారా భవిష్యత్తులో ఆపిల్ ఉత్పత్తుల్లో చేయబోయే సరికొత్త మార్పులు, లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌ని తెలియజేస్తుంది. అయితే కరోనా విపత్తు కారణంగా ఈ సారి కాన్ఫరెన్స్‌ను వర్చువల్‌గా నిర్వహించాలని ఆపిల్ డిసైడ్ అయ్యింది. జూన్ 7 భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. ఆపిల్ యూజర్లు, అభిమానులు ఈ వేడుకను చూడటం ద్వారా ఆపిల్ ప్రొడక్టులకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవచ్చు. ఇలా చూడొచ్చు ఉదయం పది గంటలకు ప్రారంమయ్యే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ని ఆపిల్ సంస్థ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో పాటు ఆపిల్ టీవీలోనూ వీక్షించవచ్చు. ఆపిల్ డెవలపర్ యాప్ ద్వారా కూడా ఈ వర్చువల్ సమావేశాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. ఫ్యూచర్ ఆప్డేట్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ కాన్ఫరెన్స్ వేదికగా కొత్త మ్యాక్బుక్ప్రోని ఆపిల్ లాంఛ్ చేయనుందనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. మరీ కొత్త మ్యాక్‌బుక్ ప్రో వస్తుందో రాదో మరికొద్ది సేపట్లో తేలిసిపోతుంది. ఇక మొబైల్ ఫోన్లకు సంబంధించి ఐఓఎస్ 15, ఐప్యాడ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ 15, మ్యాక్‌బుక్ ఆపరేటింగ్ సిస్టమ్ 12, ఆపిల్ టీవీ ఓఎస్ 15లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ను ఆపిల్ వెల్లడించనుంది -
లినక్స్కు షాకిచ్చిన అధ్యయనం
న్యూయార్క్: లినక్స్ ఆపరేటింగ్ సిస్టంకు షాకిచ్చే అంశం తాజా అధ్యయనం వెల్లడైంది. హైజాకర్లు సులువుగా దాడిచేసేంత బలహీనంగా ఉందని ఓ స్టడీలో తేలింది. కాలిఫోర్నియాలో రివర్సైడ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ అధ్యయనంలో లైనక్స్ సాఫ్ట్ వేర్ లోపాన్ని గుర్తించారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థి యో కావ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో లినక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలోని ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ (టీసీపీ) బలహీనతను గుర్తించారు. తత్ఫలితంగా రిమోట్ తో ఇంటర్నెట్ కమ్యూనికేషన్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ఈ మెయిల్స్ ను చేరవేసే ఈ టీసీపీ స్వీక్వెన్స్ నంబర్ల ద్వారానే ఎటాకర్లు దాడిచేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ లోపం ద్వారా ఆన్ లైన్ లో రెండవ వ్యక్తి కనెక్షన్ ని తొలగించి, తప్పు డు సమాచారాన్ని అవతలి వ్యక్తికి అందించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేవలం 90 శాతం సక్సెస్ రేటుతో ఒక్క నిమిషంలోనే ఈ దాడి జరిగిపోవచ్చని పేర్కొన్నారు. దీనిపై లినక్స్ సంస్థను అప్రమత్తం చేశారు. ఇది లినక్స్ లేటెస్ట్ వెర్షన్ కూడా వర్తింస్తుందని హెచ్చరించారు. ఈ అధ్యయనాన్ని టెక్సాస్ లోని ఆస్టిన్, యూజ్ నిక్స్ భద్రతా సింపోసియం, ఈ వారంలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. డేటాను ఒక సోర్స్ నుంచి సమాచారాన్ని బదిలీ చేయడానికి లీనక్స్ సహా ఇతర ఆపరేటింగ్ వ్యవస్థలు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ను వినియోగిస్తాయి. ఈ సమాచారం సరైన గమ్యానికి చేరిందో లేదో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) ద్వారా నిర్ధారించుకుంటాయి. ఇద్దరు వ్యక్తులు ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు, టీసీపీ డేటా ను ప్రత్యేకమైన సీక్వెన్స్ నంబర్ల ద్వారా గుర్తించి, సందేశాన్ని చేరవేస్తుంది. అయితే దాదాపు నాలుగు బిలియన్లకు పైగా ఉన్న ఈ సీక్వెన్లను ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదని పరిశోధకులు తెలిపారు. అలాంటిది లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లో టీసీపీ బలహీనంగా ఉన్నట్టు గుర్తించినట్టు తాజా అధ్యయనం రిపోర్టు చేసింది అయితే ఈ అధ్యయనంపై లినక్స్ సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.