వెబ్‌డెస్క్: ఆపిల్ యూజర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తన గాడ్జెట్స్‌కి సంబంధించి కొత్త అప్‌డేట్స్‌ని ఈ రోజు ఆపిల్ సంస్థ ప్రకటించనుంది. వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) ద్వారా ఫ్యూచర్ టెక్నాలజీని రివీల్ చేయనుంది ఆపిల్ సంస్థ.
పది గంటల నుంచి
ప్రతీ ఏడు వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తోంది ఆపిల్ సంస్థ. ఈ కాన్ఫరెన్స్ ద్వారా భవిష్యత్తులో ఆపిల్ ఉత్పత్తుల్లో చేయబోయే సరికొత్త మార్పులు, లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌ని తెలియజేస్తుంది. అయితే కరోనా విపత్తు కారణంగా ఈ సారి కాన్ఫరెన్స్‌ను వర్చువల్‌గా నిర్వహించాలని ఆపిల్ డిసైడ్ అయ్యింది. జూన్ 7 భారత కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం అవుతుంది. ఆపిల్ యూజర్లు, అభిమానులు ఈ వేడుకను చూడటం ద్వారా ఆపిల్ ప్రొడక్టులకు సంబంధించి అప్‌డేట్స్ తెలుసుకోవచ్చు.
ఇలా చూడొచ్చు
ఉదయం పది గంటలకు ప్రారంమయ్యే వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌ని ఆపిల్ సంస్థ తన అధికారిక యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో పాటు ఆపిల్ టీవీలోనూ వీక్షించవచ్చు. ఆపిల్ డెవలపర్ యాప్ ద్వారా కూడా ఈ వర్చువల్ సమావేశాన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు.
ఫ్యూచర్ ఆప్‌డేట్స్
డబ్ల్యూడబ్ల్యూడీసీ కాన్ఫరెన్స్ వేదికగా కొత్త మ్యాక్‌బుక్‌ప్రోని ఆపిల్ లాంఛ్ చేయనుందనే వార్తలు ఇప్పటికే చక్కర్లు కొడుతున్నాయి. మరీ కొత్త మ్యాక్‌బుక్ ప్రో వస్తుందో రాదో మరికొద్ది సేపట్లో తేలిసిపోతుంది. ఇక మొబైల్ ఫోన్లకు సంబంధించి ఐఓఎస్ 15, ఐప్యాడ్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ 15, మ్యాక్‌బుక్ ఆపరేటింగ్ సిస్టమ్ 12, ఆపిల్ టీవీ ఓఎస్ 15లకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్‌ను ఆపిల్ వెల్లడించనుంది
Comments
Please login to add a commentAdd a comment