Virtual Conference
-
తిరుపతి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం
రేణిగుంట/ఏర్పేడు (తిరుపతి జిల్లా)/ తిరుపతిసిటీ/ఆనందపురం(విశాఖ)/ పెద్దారవీడు/కర్నూలు కల్చరల్: రాష్ట్రంలో ఏర్పాటుచేసిన ప్రముఖ జాతీయ విద్యాసంస్థలైన తిరుç³తి ఐఐటీ, ఐసర్, విశాఖ ఐఐఎం శాశ్వత ప్రాంగణాలు, కర్నూలు ఐఐఐటీ డీఎమ్ను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ విధానంలో ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో మంగళవారం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో పాల్గొని తిరుపతి ఐఐటీ బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో దేశంలో మరే రాష్ట్రంలో లేనివిధంగా విద్యావిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారన్నారు. కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ, తిరుపతి ఎంపీ గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏర్పేడు మండలం జంగాలపల్లి సమీపంలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటుచేసుకున్న ఐజర్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్)ను ప్రధాని మోదీ జమ్ము నుంచి వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. ఐజర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి, జిల్లా కలెక్టర్ లక్ష్మిశా పాల్గొన్నారు. ఎడ్యుకేషనల్ హబ్‌గా తిరుపతి తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా పేరుపొందిందని ఎంపీ ఎం.గురుమూర్తి హర్షం వ్యక్తం చేశారు. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో మంగళవారం వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ప్రారంభించిన పీఎం–యూఎస్‌హెచ్‌ఏ నిధుల మంజూరు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోందని తెలిపారు. ఇందులో భాగంగా ప్రధాన మంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ పథకం కింద కేంద్రం మహిళా వర్సిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం శుభపరిణామమన్నారు. ఐఐఎం శాశ్వత క్యాంపస్ ప్రారంభం విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం వద్ద 241 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనాలను ప్రధాని మోదీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో జమ్మూ నుంచి ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. 2016లో ఐఐఎం ప్రారంభం కాగా.. అప్పటి నుంచి ఏయూలో తాత్కాలిక క్యాంపస్‌లో నిర్వహిస్తూ వస్తున్నారు. కాగా మొదట దశ భవనాలు అందుబాటులోకి రావడంతో విద్యాలయాన్ని శాశ్వత ప్రాంగణానికి మార్చారు. కార్యక్రమంలో ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున, ఐఐఎం డైరెక్టర్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభించిన ప్రధాని.. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని రాజంపల్లి గ్రామం సమీపంలో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హైదరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ స్నేహలత మాట్లాడుతూ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహకారంతో 8 ఏళ్ల కిందట తాత్కాలిక భవనాల్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. కేంద్రం రూ. 25 కోట్లు కేటాయించడంతో ప్రస్తుతం 16 ఎకరాల విస్తీర్ణంలో నూతనంగా కేంద్రీయ విద్యాలయ భవనాల సముదాయాన్ని నిర్మించినట్లు చెప్పారు. -
9 నుంచి ‘వై ఏపీ నీడ్స్ జగన్’
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మంచి గురించి ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో భాగంగా ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఏం మేలు జరిగిందన్నది ప్రతి ఒక్కరికీ తెలియాలి. గ్రామాల వారీగా ఎంత ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) చేశాం.. తద్వారా ఎంతమందికి ఏ మేరకు లబ్ధి జరిగింది అన్నదానిపై ప్రతి ఒక్కరికీ వివరాలు అందించాలి. అలాగే.. ► గ్రామాల వారీగా ఏయే పథకాల ద్వారా ఎంతెంత లబ్ధిపొందారో, ఎంత మంచి జరిగిందో వారికి చెప్పాలి. ► డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా ఏయే పథకాలలో ఎంత మేలు పొందుతున్నారో వివరించాలి. ► మన ప్రభుత్వంలో ఏయే పథకాలు అమలవుతున్నాయో కూడా చెప్పాలి. ► ఒకవేళ ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం అందకపోతే వారికి అందించేలా చర్యలు తీసుకోవాలి. ► అదే విధంగా.. గ్రామంలోని పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా వచ్చిన మార్పులు.. ఇంగ్లిష్ మీడియం, పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే ఐఎఫ్ఫీ ప్యానెల్స్, ఎనిమిదో తరగతిలో ట్యాబుల పంపిణీ వరకూ మారుతున్న విద్యా వ్యవస్థ గురించి చెప్పాలి. ► వైద్య రంగంలో విలేజ్ క్లినిక్స్‌తో సహా గ్రామంలో వచ్చిన మార్పు గురించి తెలియజేయాలి. ► ఆర్బీకేల వంటి వ్యవస్థతో పాటు, వ్యవసాయరంగంలో వచ్చిన మార్పులు.. ప్రతి ఎకరాకు ఈ–క్రాప్ చేపడుతున్న విషయం, ఏ రకంగా పారదర్శకత పాటిస్తున్నామో కూడా చెప్పాలి. ► ఇక సోషల్ ఆడిట్ ద్వారా నాణ్యంగా అందుతున్న పౌర సేవలు, దిశ యాప్, తదితర అంశాలన్నింటిపైనా ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించాలి. సమీక్ష సమావేశంలో కలెక్టర్లకు సూచనలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో జరిగిన మంచిని చూపించాలి.. మరోవైపు.. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు, పథకాలను అమలుచేస్తున్నాం. ఈ క్రమంలో.. ప్రభుత్వ పరిపాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు గురించి ప్రజలకు చెప్పాలి. ఆర్థిక ప్రగతిలో గతంలో ఎలా ఉండేవాళ్లం? ఇప్పుడెలా ఉన్నాం? అన్న అంశాలనూ వివరించాలి. డీబీటీ, నాన్ డీబీటీ, గ్రామంలో లబ్ధిదారుల గురించి పూర్తి అవగాహన కల్పించాలి. ఈ వివరాలతో కూడిన డేటాతో సహా, జరిగిన మంచిని ఆధారాలతో చూపించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. పథకాలను ఏ రకంగా వాడుకోవాలన్న దానిపైనా వారికి అవగాహన కల్పించాలి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు కూడా పెట్టాలి. ఏయే పథకం ద్వారా ఎంతమంది లబ్ధిపొందారో వాటిల్లో ప్రదర్శించాలి. డీబీటీ ఎంత? నాన్ డీబీటీ ఎంతో అందులో పొందుపరచాలి. నాడు–నేడు ద్వారా చేసిన ఖర్చెంత? గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్స్ కోసం ఎంత ఖర్చుచేశామో చెప్పాలి. అలాగే, గడపగడపకూ మన ప్రభుత్వం (జీజీఎంపీ) ద్వారా గుర్తించిన ప్రాధాన్యతా కార్యక్రమాల కోసం చేసిన ఖర్చును వివరించాలి. ప్రతి మండలంలో రోజుకు ఒక సచివాలయంలో.. ప్రతి మండలంలో ప్రతిరోజూ ఒక సచివాలయంలో ఈ కార్యక్రమం చేపట్టాలి. పట్టణాల్లోనూ ఒక సచివాలయంలో నిర్వహించాలి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈఓ, పట్టణ ప్రాంతాల్లో అడిషనల్ కమిషనర్ నోడల్ ఆఫీసర్‌గా ఉంటారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అందరూ ఇందులో పాల్గొంటారు. తొమ్మిదో తేదీ నుంచి కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత తగిన సమయం తీసుకుని వలంటీర్లు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని అభిమానించే వారు ఎవరైనా జరిగిన మంచి ఏమిటన్నది ప్రతి ఇంటికీ వివరిస్తారు. గతానికి భిన్నంగా పరిస్థితులెలా మెరుగుపడ్డాయి, ఎంత మంచి జరిగిందన్న దానిని ప్రతి ఇంటికీ తీసుకెళ్తారు. -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
I2U2 Summit: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా
న్యూఢిల్లీ: నాలుగు దేశాల ‘ఐ2యూ2’ కూటమి తన తొలి శిఖరాగ్ర సదస్సులోనే సానుకూల అజెండాను సిద్ధం చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి కోసం నాలుగు దేశాలు కలిసికట్టుగా పనిచేయబోతున్నాయని, ఈ మేరకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకున్నాయని వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆచరణీయ పరస్పర సహకారానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఒక మంచి మోడల్ అని ఉద్ఘాటించారు. ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ, యూఏఈ) తొలి శిఖరాగ్ర సదస్సును గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యైర్ లాపిడ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఐ2యూ2 అజెండా, దార్శనికత ప్రగతిశీలకంగా, ఆచరణయోగ్యంగా ఉందని కొనియాడారు. నాలుగు దేశాల పెట్టుబడి, నిపుణత, మార్కెట్లు వంటి బలాలను ఒకే వేదికపైకి తీసుకొస్తే అది ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించామని, వాటి అమలు విషయంలో ముందుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నామని ఉద్ఘాటించారు. నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి ఆరు కీలక రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులను మరింత పెంచేందుకు అంగీకారానికొచ్చామన్నారు. -
నకిలీ రివ్యూల కట్టడిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను.. ఈ–కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ–కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. యూరోపియన్ యూనియన్‌లో 223 బడా వెబ్సైట్లలో ఆన్లైన్ రివ్యూలపై జరిగిన సమీక్ష వివరాలను వాటిలో ప్రస్తావించారు. స్క్రీనింగ్ ఫలితాల ప్రకారం దాదాపు 55 శాతం వెబ్సైట్లు ఈయూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తేలింది. దేశీయంగా ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల వినియోగం పెరిగే కొద్దీ ఆన్లైన్ కొనుగోళ్లు కూడా పెరుగుతున్నాయని సింగ్ తెలిపారు. అయితే, ఈ–కామర్స్ సైట్లలో కనిపించే నకిలీ రివ్యూల వల్ల వినియోగదారులు పలు సందర్భాల్లో నష్టపోవాల్సి వస్తోందని సింగ్ వివరించారు. -
ప్రభుత్వ పథకాలతో వివక్ష మాయం
భరుచా: ప్రభుత్వ పథకాలు నూటికి నూరు శాతం అమలైతే సమాజంలో వివక్షల్ని రూపుమాపవచ్చునని, బుజ్జగింపు రాజకీయాలకు కూడా తెరదించవచ్చునని ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై సరైన సమాచారం లేక అవి కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడం కోసం రూపొందించిన నాలుగు పథకాలు నూటికి నూరు శాతం భరూచీ జిల్లాలో లబ్ధిదారులందరికీ అందిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మోదీ భావోద్వేగం అంతకు ముందు ప్రధాని మోదీ పథకాలు అందుకున్న లబ్ధి దారులతో మాట్లాడారు. వారిలో కంటి చూపు కోల్పోయిన అయూబ్ పటేల్ తన పెద్ద కుమార్తె అలియాతో కలిసి వచ్చారు. పన్నెండో తరగతి చదువుతున్న ఆమె డాక్టర్ చదవాలని అనుకుంటోందని, అందుకోసం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకు డాక్టర్ చదవాలని అనుకుంటున్నావు అని ఆ అమ్మాయిని ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం విని ప్రధాని కదిలిపోయారు. చూపు లేని తన తండ్రి దుస్థితిని చూస్తూ తట్టుకోలేకపోతున్నానని, అందుకే డాక్టర్ అవుదామని అనుకుంటున్నానని అలియా కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. దీంతో ప్రధాని కాసేపు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. డబ్ల్యూహెచ్ఓలో సంస్కరణలు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చే విషయంలో ఒక సరళమైన విధానాన్ని తీసుకురావాలన్నారు. మేధో సంపత్తి హక్కులు మంజూరు చేసే విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలను సరళం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో కోవిడ్–19పై గురువారం నిర్వహించిన రెండో గ్లోబల్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాపోసా పాల్గొన్నారు. -
చలో చలో.. మెటాలోకం అంటున్న యూత్! మీకేం తెలుసు?
‘ఆహా! అలాగా!!’ అనే ఆశ్చర్యాలకు అంతు ఉండదు. ‘అసలు ఇది ఎలా సాధ్యం’ అనే ప్రశ్నలకు విరామం ఉండదు. ఊరిస్తున్న వర్చువల్ వరల్డ్ ‘మెటావర్స్’ యూత్లోకానికి దగ్గరగా వచ్చేస్తుంది. ఇది వినోదానికి పరిమితమైన ఆట కాదు. కాల్పానిక ప్రపంచంలో సేద తీరే పాట కాదు. యూత్ జీవనశైలిలో మెగా మార్పు తీసుకువచ్చే మెటావర్స్! నిన్నటి సైన్స్–ఫిక్షనే రేపటి కొత్త ఆవిష్కరణ అనే మాట అన్ని సందర్భాలలోనూ నిజమై ఉండకపోవచ్చుగానీ ‘మెటావర్స్’ వరకైతే నిజమే. నీల్ స్టీఫెన్సన్ అమెరికన్ సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్నో క్రాష్ (1992)’లో కనిపించిన ‘మెటావర్స్’ ఇప్పుడు యూత్ ఫేవరేట్ సౌండ్ అయింది. ఫేస్బుక్ తన కంపెనీ పేరును ‘మెటా’గా మార్చుకోవడం ఒక్కటి చాలు అది మెటావర్స్కు ఇస్తున్న ప్రాధాన్యతను చెప్పడానికి. భారీ ఖర్చుతో సరికొత్త డిజిటల్ ప్రపంచాన్ని సృష్టించే పనిలో భాగంగా ప్రపంచంలోనే వేగవంతమైన ఏఐ సూపర్ కంప్యూటర్ (ఏఐ రిసెర్చ్ సూపర్‌క్లస్టర్.. ఆర్ఎస్సీ) రూపొందించడం, యూనివర్సల్ స్పీచ్ ట్రాన్స్‌లేటర్(ఇన్స్టంట్ స్పీచ్–టు–స్పీచ్ ట్రాన్స్లెషన్: అన్ని భాషల్లో)... మొదలైనవి రూపొందిస్తుంది మెటా. కేవలం మెటా మాత్రమే కాదు రాబోయే కాలంలో రకరకాల మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్ ప్రభావంతో యువప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. వినోదరంగానికి వస్తే... టీవీ చూడడం కంటే మెటావర్స్ లోకంలోనే ఎక్కువ సమయం గడపడానికి యువతరం ఇష్టపడుతుందనేది ఒక అంచనా. ‘యూత్ వ్యూయర్షిప్ను కాపాడుకోవడానికి టీవి రంగం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ఆకట్టుకునే విభిన్నమైన కంటెంట్‌ను సమకూర్చుకోక తప్పదు’ అంటున్నారు మాథ్యూ వర్నెఫోర్డ్. ఈయన మెటావర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు గేమ్స్‌ను సమకూర్చే ‘డూబిట్’ కో–ఫౌండర్. రాబోయే కాలంలో ‘ఫిట్నెస్ మెటావర్స్’ ట్రెండ్ ఊపందుకోబోతుంది. ‘వెల్టు డూ 2022 కన్జ్యూమర్ వెల్నెస్ట్రెండ్’ రిపోర్ట్ ప్రకారం యంగ్ ఫిట్నెస్ ప్రేమికులు సంప్రదాయ జిమ్‌లలో కంటే వర్చ్వల్లోనే ఉత్తేజకరమైన వర్కవుట్ ఎక్స్‌పీరియన్స్‌ను సొంతం చేసుకుంటారు. ‘మ్యూజిక్, విజువల్స్, వేరుబుల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్...మొదలైన వాటిని ఒకే వేదికపై తీసుకు రావడం ద్వారా మెటావర్స్‌లో జిమ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. ఫిట్నెస్ ఆర్గనైజేషన్స్ కొత్త ఆడియెన్స్‌తో కనెక్ట్ అవుతారు’ అంటుంది రిపోర్ట్, ఇన్–పర్సన్ ఇంటర్వ్యూలు, జూమ్ కాల్స్ కాలంలో ఉన్న కుర్రకారు రిప్రెజెంటేటివ్ అవతార్‌ను ఎంచుకొని, వర్చువల్ వేదికపై ఇంటర్వ్యూలకు వెళ్లే రోజులు వస్తున్నాయి. సోషల్ మెటావర్స్ స్టార్టప్ ఫామ్ ‘వన్ ఎబౌ’ పేరుతో ‘వాక్–ఇన్ రిక్రూట్మెంట్ ప్లాట్‌ఫామ్’ను లాంచ్ చేసింది. క్యాండిడేట్ ప్లాట్‌ఫామ్‌పై క్లిక్ చేయడంతో ఇంటర్వ్యూ ప్రదేశంలోకి ఎంటర్ అవుతారు. అక్కడ ఉన్న 45 ఆప్షన్లలో తనను బెస్ట్‌గా రిప్రెజెంట్ చేసే అవతార్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్చువల్ లాబీ నుంచి హెచ్ఆర్ రిప్రెజెంటేటివ్ వీరికి స్వాగతం పలుకుతూ రిక్రూటింగ్‌కు ప్యానల్‌కు పరిచయం చేస్తారు. ‘దైవిక శక్తులలాంటి శక్తులతో మెటావర్స్‌తో ఎవరికి వారు తమదైన ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకోవచ్చు’ అని ఊరిస్తున్నాడు మార్క్ జుకర్ బర్గ్. -
వర్చువల్ న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘న్యాయం పొందటం ఇప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకోవడంపై ఆధారపడి ఉంది’’ – 2021లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైరవుతూ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలివి. అందుకు తగ్గట్టే కరోనా మహమ్మారి రూపంలో ఎదురైన సవాలును వర్చువల్ విధానంలో అధిగమించింది సుప్రీంకోర్టు. వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా విచారణలు కొనసాగించాలని 2020 మార్చిలో కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా అప్పటి సీజేఐ జస్టిస్ బాబ్డే ఇందుకు బాటలు వేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ దాన్ని వ్యవస్థీకృత రూపంలో ముందుకు తీసుకెళ్లి విచారణ ప్రక్రియను కొత్తపుంతలు తొక్కించారు. సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలిచి చూపించారు. దీన్ని హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా అందిపుచ్చుకోవడంతో సామాన్యునికి న్యాయం అందే ప్రక్రియ కరోనా వేళ కూడా నిరాఘాటంగా కొనసాగింది. ఎప్పటికప్పుడు సూచనలు కరోనా వల్ల రెండేళ్లు వర్చువల్ విధానంలో సాగిన సుప్రీంకోర్టు ఈ నెల 4 నుంచి మళ్లీ భౌతిక రూపంలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ప్రధాన కేసుల విచారణలు, వాదోపవాదాలను ఇంతకాలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన న్యాయమూర్తులు కరోనా తీవ్రత తగ్గి, ఆంక్షలు సడలటంతో భౌతిక విచారణలు మొదలు పెట్టారు. ఈ రెండేళ్ల కాలంలో వర్చువల్ విధానంలో న్యాయ సేవలందటంలో ఎలాంటి ఆటంకాలూ తలెత్తకుండా చూడటంలో సీజేఐ జస్టిస్ రమణ చురుకైన పాత్ర పోషించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వాడుకోవడం ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ వచ్చారు. కోర్టు రోజువారీ వ్యవహారాలు, విచారణల్లో ఇబ్బందులు రాకుండా ఈ–కమిటీని అప్రమత్తం చేస్తూ, దాని సలహాలు, సూచనలు పకడ్బందీగా అమలయ్యేలా సీజేఐ చేసిన సూచనలు సత్ఫలితాలనిచ్చాయి. లఖీంపూర్‌ఖేరి ఘటన, పెగసస్ వంటి కీలక కేసుల విచారణలు వర్చువల్‌గానే సాగాయి. 2020 మార్చిలో మొదలు కరోనా నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలకు తెర తీసింది. నాటి సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సూచనల మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతత్వంలోని సుప్రీంకోర్టు ఈ–కమిటీ వర్చువల్ విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. అదే బాటలో హైకోర్టులు, దిగువ స్థాయి కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ విచారణ పద్ధతినే అవలంబించాయి. వర్చువల్ విచారణలు ప్రారంభమైన నెల రోజులకే సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ రమణ ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. కరోనా సమయంలో కోర్టు ప్రాంగణంలోనే డెస్క్‌టాప్‌లు ఏర్పాటు చేసి కవరేజీకి మీడియాను కూడా అనుమతించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో మీడియాకు యాప్‌ను కూడా రూపొందించారు. తాను జర్నలిస్టుగా ఉన్న సమయంలోని ఇబ్బందులను ఆ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విచారణలకు వాడుతున్న యాప్‌లోని ఇబ్బందులను గుర్తించి సిస్కో వెబ్ఎక్స్ను వాడకంలోకి తెచ్చారు. జస్టిస్ రమణ సూచనల మేరకు దానిలోని లోపాలను సరిదిద్ది మెరుగు పరిచారు. వర్చువల్ విచారణలో ఇలాంటి పలు ఇబ్బందులను ఈ–కమిటీ ఆధ్వర్యంలో సీజేఐ సూచనల మేరకు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వచ్చారు. విచారణలను పూర్తిగా ప్రత్యక్ష ప్రసారం చేయాలని కూడా సీజేఐ అభిప్రాయపడ్డారు. లాయర్లకు దిశానిర్దేశం వర్చువల్ విచారణల్లో లాయర్లు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పాల్గొనడాన్ని జస్టిస్ రమణ తీవ్రంగా ఆక్షేపించారు. దీనివల్ల లాయర్లు సరిగా కనిపించపోవడమే గాక విచారణకు ఆటంకం వస్తోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేస్తూ డెస్క్‌టాప్ కొనుక్కోలేరా అని లాయర్లను ప్రశ్నించారు. వారి వస్త్రధారణ విషయంలోనూ పలు సందర్భాల్లో సూచనలు చేశారు. రెండేళ్లలో రికార్డు 2020 మార్చి 23 నుంచి 2022 మార్చి 14 వరకు రెండేళ్లలో సుప్రీంకోర్టు ఏకంగా 2,18,891 కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ప్రపంచం మొత్తంలో మన సుప్రీంకోర్టు మాత్రమే కరోనా సమయంలో ఇన్ని కేసులు విచారించిందని కేంద్ర న్యాయ మంత్రి ఇటీవల రాజ్యసభలో వెల్లడించారు. దేశంలోని 24 హైకోర్టులు కూడా కరోనా వేళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 61,02,859 కేసులను విచారించాయి. దేశవ్యాప్తంగా జిల్లా కోర్టులు కరోనా వేళ 1,23,29,917 కేసులను విచారించాయి! -
పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై రేపు భేటీ
సాక్షి, అమరావతి : పోలవరం ప్రధాన డ్యామ్ డిజైన్లపై చర్చించేందుకు శుక్రవారం(25న) రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు నేతృత్వంలోని నిపుణుల కమిటీ భేటీ కానుంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో కోతకు గురై ఏర్పడిన గొయ్యిలను ఎలా పూడ్చాలి? గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్‌ను ఎలా నిర్మించాలనే అంశాలపై చర్చిస్తారు. పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ సూచనల మేరకు ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన అన్ని వివరాలను ఢిల్లీ–ఐఐటీలో డైరెక్టర్‌గా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ వీఎస్ రాజు, జర్మనీకి చెందిన బావర్ సంస్థ ప్రతినిధులు, కేంద్ర జలసంఘం, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ సభ్యులకు పంపారు. ఈ వివరాల ఆధారంగా ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో గొయ్యిలను పూడ్చే విధానం, గ్యాప్–1, గ్యాప్–2లలో ప్రధాన డ్యామ్ నిర్మాణంపై అధ్యయనం చేయనున్నారు. ఈ అధ్యయనంలో వెల్లడైన అంశాలపై 25న నిర్వహించే వర్చువల్ సమావేశంలో చర్చించి, డిజైన్లను కొలిక్కి తేనున్నారు. కొలిక్కి తెచ్చిన ఈ డిజైన్లపై ఈ నెల 28 లేదా 29న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వీఎస్ రాజు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. నిపుణుల కమిటీ రూపొందించిన విధానాల్లో మెరుగైన పద్ధతిని ఖరారు చేసి.. దాని ప్రకారం గొయ్యిలను పూడ్చటం, ప్రధాన డ్యామ్‌ను నిర్మించడంపై నిర్ణయం తీసుకోనున్నారు. -
'పింక్‌బాల్ టెస్టు సవాల్‌తో కూడుకున్నది.. మానసికంగా సిద్ధం'
శ్రీలంకతో టీమిండియా పింక్‌బాల్ టెస్టు ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు వైస్‌కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. వర్చువల్ మీడియా కాన్ఫరెన్స్‌లో భాగంగా బుమ్రా మాట్లాడాడు. ''డే అండ్ నైట్ టెస్టు ఆడుతున్నామంటే దానికి మానసికంగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఫ్లడ్‌లైట్ల వెళుతురులో ఫీల్డింగ్, బౌలింగ్ చేయడం కాస్త సవాల్‌తో కూడుకున్నది. వన్డే, టి20 అయితే ఒక్క రోజులో ముగుస్తుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు. కానీ పింక్‌బాల్ టెస్టు అంటే ఐదురోజులు ఫ్లడ్లైట్స్ వెళుతురులో ఆడాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటిన మైండ్‌లో పెట్టుకొని మా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాం. మేము పెద్దగా డే అండ్ నైట్ ఎక్కువగా ఆడలేదు కాబట్టి.. ప్రతీ పింక్‌బాల్ టెస్టులో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఉండాలా లేక ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కాంబినేషన్ తీసుకోవాలా అనేది ఆలోచిస్తున్నాం. డే అండ్ నైట్ టెస్టు అంటే పింక్‌బాల్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. రాత్రిళ్లు పిచ్ సీమర్లకు అనుకూలిస్తుంది. ఈ విషయం దృష్టిలో పెట్టుకుంటే సిరాజ్‌కు చోటు ఉండొచ్చు.. లేదంటే అక్షర్ తుది జట్టులోకి రావొచ్చు. దీనికి సంబంధించిన పారామీటర్స్‌ను ఇంకా సిద్ధం చేసుకోలేదు.'' అంటూ వివరించాడు. ఇక బుమ్రా టీమిండియా తరపున 28 టెస్టుల్లో 115 వికెట్లు తీశాడు. తొలి టెస్టులో టీమిండియా 222 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టులోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఇక ఇప్పటివరకు టీమిండియా మూడు పింక్‌బాల్ టెస్టులు ఆడింది. ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో ఆడిన మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన పింక్‌బాల్ టెస్టులో మాత్రం ఓటమి చవిచూసింది. అటు లంక కూడా మూడు పింక్‌బాల్ టెస్టులు ఆడగా.. రెండింటిలో గెలిచి.. ఒకదాంట్లో ఓటమి చూసింది. చదవండి: Shaheen Afridi-Jadeja: జడ్డూను కాపీ కొట్టిన పాక్ బౌలర్.. ట్రోల్స్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్ Rohit Sharma-Gavaskar: 'రోహిత్.. కుదురుకునే వరకు ఆ షాట్ ఆడకపోవడం ఉత్తమం' #TeamIndia vice-captain @Jaspritbumrah93 on the mental changes that need to be made for a Pink Ball Test.@Paytm #INDvSL pic.twitter.com/PCfrY6sJe7 — BCCI (@BCCI) March 11, 2022 Mohali ✈️ Bengaluru Pink-ball Test, here we come 🙌#TeamIndia | #INDvSL | @Paytm pic.twitter.com/9fK2czlEKu — BCCI (@BCCI) March 10, 2022 -
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో మంత్రి కేటీఆర్ ఆసక్తికర చర్చ
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మానవాళి స్పందించిన తీరు ఆశించినంతగా లేదని మైక్రోసాఫ్ట్ అధినేత, గిఫ్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు బిల్‌గేట్స్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ మహమ్మారి మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందని చెప్పారు. హైదరాబాద్‌లో గురువారం వర్చువల్ పద్ధతిలో మొదలైన 19వ బయో ఆసియా సదస్సులో బిల్‌గేట్స్, తెలంగాణ ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రెండేళ్ల కరోనా మహమ్మారి మనిషికి నేర్పించిన పాఠాలు ఏవని ప్రశ్నించగా గేట్స్ స్పందిస్తూ వ్యాక్సిన్లను అత్యంత వేగంగా తయారు చేయగలగడం మ నిషి సాధించిన ఘనత అని వ్యాఖ్యానించారు. అ లాగే ఆక్సిజన్ కొరత విసిరిన సవాళ్లనూ సమర్థంగా ఎదుర్కోగలిగామన్నారు. అంతర్జాతీయ సహకారంతో భారత్ టీకాలను వేగంగా తయారు చేసింద ని, ప్రజలందరికీ ఈ టీకాలను అందించే విషయంలో ధనిక దేశాలకంటే మెరుగ్గా వ్యవహరించిం దని కొనియాడారు. టీకాల సమర్థ పంపిణీతో ఎ న్నో విలువైన ప్రాణాలను కాపాడగలిగిందన్నారు. సిద్ధంగా ఉండాలి.... భవిష్యత్తులోనూ కరోనా లాంటి మహమ్మారులు వస్తే వాటిని ఎదుర్కొనేందుకు మానవాళి సంసిద్ధంగా ఉండాలని గేట్స్ ఆకాంక్షించారు. మెరుగైన వ్యాక్సిన్లు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సకు అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో రాగల మహమ్మారి గురించి గేట్స్ 2015లోనే అంచనా వేయడాన్ని కేటీఆర్ ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో వచ్చే మహమ్మారులు కరోనా మాదిరిగా ఏళ్లపాటు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తు మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధనలపై అన్ని దేశాలు దృష్టి పెట్టాలని కోరారు. జీవశాస్త్రంలో మనిషి ఊహించని స్థాయిలో ఆవిష్కరణలు జరగనున్నాయని, అవి భవిష్యత్ సవాళ్లకు మనల్ని సిద్ధం చేస్తాయని అన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏదే భవిష్యత్తు... హెచ్ఐవీ మొదలు అనేక ఇతర వ్యాధులకు చికిత్స అందించే సామర్థ్యంగల ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీదే భవిష్యత్తు అని బిల్‌గేట్స్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి సమయంలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎంఆర్ఎన్ఏ సాం కేతికత అందర్నీ ఆశ్చర్యపరిచిందన్నారు. ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు గేట్స్ ఫౌండేషన్ ప్రయత్నాలు ము మ్మరం చేసిందని చెప్పారు. సృజనాత్మక ఆలోచనలతో చవకైన మందులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న భారతీయ కంపెనీలతోనూ ఫౌండేషన్ భాగస్వామ్యం ఏర్పాటు చేసు కున్నట్లు ఆయన తెలిపారు. హెచ్‌ఐవీతోపాటు అనేక వ్యాధులకు రానున్న 10–15 ఏళ్లలో ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ద్వారా చికిత్స అందించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమీప భవిష్యత్తులో సెన్సార్లు కృత్రిమ మేధ సా యంతో పనిచేసే పరికరాలు వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నాయన్నారు. హైదరాబాద్‌కు ఎప్పుడు వస్తారన్న కేటీఆర్ ప్రశ్నకు కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తేశాక ఆసియాలో పర్యటించే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. -
ప్రవాస భారతీయుల కోసం ఈయూ వర్చువల్ మీటింగ్
యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలలోని భారత సంతతి ప్రవాసులతో 2022 ఫిబ్రవరి 23న వర్చువల్ రీజనల్ కాన్పరెన్స్ నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు ఈ వర్చువల్ సమావేశం ఉంటుంది. 'ఇండియన్ డయాస్పోరా డివిడెండ్ ఇన్ ది యూరోపియన్ యూనియన్' (యూరోపియన్ యూనియన్ దేశాలలో భారత సంతతి ప్రవాసుల భాగస్వామ్యం) అనే శీర్షికన జరిగే ఈ సమావేశంలో.. జగదీశ్వర రావు మద్దుకూరి (పోలాండ్), చిత్రా స్టెర్న్ (పోర్చుగల్), డాక్టర్ శచి గురుమాయుమ్ (స్విట్జర్లాండ్), డాక్టర్ మాలిని రంగనాథన్ (ఫ్రాన్స్), ప్రొఫెసర్ అనిల్ దావే (ఇటలీ), డా. లోకేష్ జోషి (ఐర్లాండ్), ప్రొఫెసర్ గుల్షన్ సచ్ దేవా (ఇండియా) పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకుని https://primetime.bluejeans.com/a2m/live-event/vevvsksk వర్చువల్ సమావేశంలో భాగస్వాములు కావొచ్చు. -
23న డీడీఆర్పీ సమావేశం
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్య అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్(డీడీఆర్పీ) ఈనెల 23న సమావేశమవుతోంది. వర్చువల్ విధానంలో జరిగే ఈ భేటీలో పెండింగ్ డిజైన్లను సమీక్షించనుంది. క్షేత్రస్థాయి పర్యటన, సమీక్షల్లో వెల్లడైన అంశాలను పరిగణనలోకి తీసుకుని డిజైన్లపై సీడబ్ల్యూసీకి నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా డిజైన్ల ఆమోదంపై సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకుంటుంది. 2018, 2019లలో గోదావరి వరద ఉధృతి వల్ల దిగువ కాఫర్ డ్యామ్ జెట్ గ్రౌటింగ్.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్యన ఎర్త్‌కమ్ రాక్ ఫిల్ డ్యామ్ నిర్మించే ప్రాంతంలో ఇసుక పొరలు కోతకు గురయ్యాయి. వీటిని ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై డీడీఆర్పీ భేటీలో చర్చిస్తారు. అత్యంత కీలకమైన ఈ రెండు డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదిస్తే.. పోలవరం జలాశయం పనులు మరింత వేగవంతమవుతాయి. -
కోకాకోలా రాథోడ్.. ఎస్సైకి ఊహించని షాక్
కోర్టు ప్రొసీడింగ్స్ అనేవి.. సినిమాల్లో చూపించినట్లు కాదు. చాలా సున్నితంగా.. హుందాగా ఉంటాయి. వాదనలు వింటూనే న్యాయమూర్తులు ప్రతీ విషయాన్ని గమనిస్తుంటారు కూడా. అయితే అది తెలియని ఓ ఎస్సై.. అడ్డంగా బుక్కై మూల్యం చెల్లించుకున్నాడు. తాజాగా దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్‌తో ప్రస్తుతం ఇంకా వర్చువల్ వాదనలే నడుస్తున్నాయి. ఈ క్రమంలో గుజరాత్ హైకోర్టులో ఓ పిటిషన్‌పై వాదనలు జరుగుతుండగా.. ఎస్సై ఏఎం రాథోడ్ కూల్‌గా కోకా కోలా టిన్ను కూల్‌గా సిప్ చేస్తూ ఉన్నారు. అది గమనించిన గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ కుమార్.. వెంటనే అదనపు గవర్నమెంట్ ప్లీడర్ డీఎం దేవ్నానితో ‘వీడియో కాన్ఫరెన్స్‌లో మిస్టర్ రాథోడ్ కూల్ డ్రింక్ తాగుతున్నారా ఏంటి?’ అని ప్రశ్నించారు. దీనికి ఏజీపీ వెంటనే క్షమాపణలు తెలియజేశాడు. అయినా సీజే శాంతించలేదు. ‘ఇదేం మీ ఆఫీస్ కాదంటూ..’ ఎస్సై రాథోడ్‌ను సున్నితంగా మందలించింది కోర్టు. అంతేకాదు కోకాకోలా తాగినందుకు శిక్షగా.. వంద కోకాకోలా టిన్లను బార్ అసోషియేషన్ సభ్యులకు పంచాలని సీజే అరవింద్ కుమార్, జస్టిస్ అశ్‌తోష్ శాస్త్రి నేతృత్వంలోని ధర్మాసనం ఆ ఎస్సైని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ ఉల్లంఘనల కింద శిక్ష తప్పదని హెచ్చరించింది. ‘‘మిస్టర్ కోకా కోలా రాథోడ్.. మీరొక్కరే తాగడానికి వీల్లేదు. సాయంత్రం కల్లా బార్ మెంబర్స్ అందరికీ కోకా కోలాను అందించండి’’ అంటూ ఆదేశించింది. దీంతో సదరు ఎస్సై మంగళవారం సాయంత్రమే ఆ ఆదేశాల్ని పాటించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఓ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఇద్దరు మహిళల్ని రాథోడ్, తోటి సిబ్బంది కలిసి చితకబాదారనే పిటిషన్ మీద వాదనల సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో వర్చువల్ వాదనల సందర్భంగా ఓ అడ్వొకేట్ సమోసా తింటూ కనిపించగా.. ‘ఇలాంటివి చూసి ఇతరులకు కూడా తినాలని అనిపించదా? నోరురదా? ఇతరులకు ఇవ్వకుండా మీరొక్కరే తింటారా?’’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూ..అందరికీ సమోసాలు పంచాలంటూ సదరు న్యాయవాదిని ఆదేశించింది. తాజా ఘటన నేపథ్యంలో.. సమోసా ఘటనను మరోసారి గుర్తు చేశారు సీజే. -
17 నుంచి డబ్ల్యూఈఎఫ్ వర్చువల్ సదస్సు
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) ఐదు రోజుల వర్చువల్ సమావేశం 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. తొలిరోజే ప్రధాని నరేంద్రమోదీ సదస్సును ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ వృద్ధి వంటి అంశాలపై ప్రపంచవ్యాప్త దేశాల నాయకులు ప్రసంగించనున్నారు. సమావేశం డిజిటల్‌గా జరగడం ఇది వరుసగా రెండవసారి. కోవిడ్–19, సాంకేతిక సహకారం, అంతర్జాతాయ సామాజిక సహకారం, వ్యాక్సిన్ విస్తృతి, ఇంధన బదలాయింపు, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ వాణిజ్యంలో విశ్వాసాన్ని పాదుగొల్పడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల అవుట్‌లుక్, భవిష్యత్ సవాళ్లకు సంసిద్ధత వంటి అంశాలు ఐదు రోజుల సమావేశ అజెండాలో ప్రధాన అంశాలు కానున్నాయి. భౌతిక సమావేశం వేసవికి వాయిదా... కొత్త సంవత్సరం జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ ఐదు రోజులు జరగాల్సిన దావోస్ 2022 వార్షిక భౌతిక సమావేశాన్ని వేసవి కాలానికి వాయిదా వేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇప్పటికే తెలిపింది. స్విట్జర్లాండ్ దావోస్‌లోని స్విస్ ఆల్పైన్ స్కీ రిసార్ట్ లో జరగాల్సిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవేత్తలు, పెట్టుబడిదారులు, విధాన నిర్ణేతలు స్వయంగా పాల్గొనాల్సి ఉంది. వీరితోపాటు పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ధ్యేయంగా వివిధ దేశాల నాయకులు సమావేశంలో భాగస్వాములు అవుతారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభించడానికి ముందు వరల్డ్ ఎకనమిక్ ఫోరం 2020 జనవరిలో దావోస్ సదస్సు నిర్వహించింది. అటు తర్వాత సమావేశం వాయిదా పడ్డం ఇది వరుసగా రెండవసారి. పెట్టుబడులకు సంబంధించి పరస్పర సహకారం కోసం ఉద్దేశించి జెనీవా నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సంస్థ– వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తొలుత 2021 వార్షిక సమావేశాన్ని దావోస్ కాకుండా స్విట్జర్లాండ్‌లోని మరొక ప్రదేశానికి మార్చాలని నిర్ణయించింది. అటు తర్వాత సింగపూర్‌కు మార్చాలని భావించింది. చివరకు దానినీ రద్దు చేసింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో 2022 భౌతిక సమావేశం కూడా వాయిదా పడ్డం గమనార్హం. -
సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం
-
17 నుంచి వర్చువల్ విధానంలో కేసుల విచారణ
సాక్షి, అమరావతి: కోవిడ్ తీవ్రత పెరుగుతుండటం, ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసుల విచారణ విషయంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17వ తేదీ నుంచి కేసుల విచారణను వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఈ విధానమే అమల్లో ఉంటుంది. కేసుల విచారణ జాబితాలో ఏయే కేసులు ఉండాలన్నది సంబంధిత బెంచ్లే నిర్ణయిస్తాయి. పిటిషన్ల దాఖలు మాత్రం ప్రస్తుతం అనుసరిస్తున్న భౌతిక రూపంలోనే ఉంటుంది. హైకోర్టు నియంత్రణలో పనిచేసే న్యాయ సేవాధికార సంస్థ, న్యాయ సేవల కమిటీ, మధ్యవర్తిత్వ, రాజీ కేంద్రాలు సైతం వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే పనిచేస్తాయి. కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు, పారిశ్రామిక వివాదాల కోర్టులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే కేసుల విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సాక్ష్యాల నమోదు, విచారణ ప్రక్రియను వాయిదా వేయాలని కింది కోర్టులకు స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగణాల నుంచే న్యాయాధికారులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. న్యాయాధికారులతో పాటు సిబ్బంది కూడా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు రెండు నోటిఫికేషన్లు జారీ చేశారు. -
AP: వైద్యుల సేవలు భేష్
సాక్షి, లబ్బీపేట(విజయవాడతూర్పు): కరోనా సమయంలో రోగులకు వైద్యులు, వైద్య విద్యార్థులు మెరుగైన సేవలందిస్తున్నారని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. భవిష్యత్‌లో కూడా సమాజానికి, పేదలకు తగిన సేవలందించాలని సూచించారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 22, 23వ స్నాతకోత్సవం గురువారం విజయవాడలో జరిగింది. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో గవర్నర్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. సెకండ్ వేవ్ ఒక్కసారిగా విజృంభించి.. ప్రమాదకర స్థితికి తీసుకెళ్లిన సమయంలో వైద్యులు చేసిన సేవలు ఎనలేనివన్నారు. వైద్య, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని గవర్నర్ సూచించారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి విద్యార్థులను సైతం ఈ దిశగా ప్రోత్సహించాలని చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం చేయాలని సలహా ఇచ్చారు. వైద్య విద్యలో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సూచించారు. అనంతరం వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యామ్‌ప్రసాద్ యూనివర్సిటీలో అనుసరిస్తున్న నూతన విధానాలను వివరించారు. డాక్టర్ పళనివేలు, డాక్టర్ నాగేశ్వరరెడ్డికి డాక్టరేట్లు.. కోయంబత్తూరులోని జెమ్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ చైర్మన్ డాక్టర్ సి.పళనివేలు, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. అలాగే ఐదుగురికి పీహెచ్‌డీలు, ఒకరికి సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అందజేశారు. 125 మంది విద్యార్థులకు 150 మెడల్స్, 42 మందికి నగదు బహుమతులు ప్రదానం చేశారు. రాగిణి అనే విద్యార్థిని అత్యధికంగా మూడు గోల్డ్‌మెడల్స్, రెండు సిల్వర్ మెడల్స్, రెండు నగదు బహుమతులు అందుకున్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్, రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు, కాకినాడ రంగరాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.బాబ్జి, గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.పద్మావతి, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీవీ సుధాకర్, వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఇ.రామసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు డీజిల్‌పై రాయితీ పెంచండి
సాక్షి, అమరావతి: సాగు వాస్తవిక ఉత్పత్తి వ్యయం, డీజిల్‌పై అధిక రాయితీలు, జన్యుమార్పిడి విత్తనాలు (జీఎంఓ) వంటి వాటితో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి పెద్దపీట వేసేలా రాబోయే బడ్జెట్ (వ్యవసాయ) ఉండాలని, నిధుల కేటాయింపును కనీసం 25 శాతమైనా పెంచాలని పలువురు వ్యవసాయ నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ తయారీకి ప్రారంభమైన ముందస్తు సంప్రదింపుల్లో భాగంగా.. గడచిన 48 గంటల్లో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ రంగ ప్రముఖులు వర్చువల్ విధానంలో జరిగిన సమావేశాల్లో తమ సలహాలను, సూచనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే రైతులకు ఇచ్చే రుణాలను కనీసం 25 శాతం పెంచాలని కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్స్ (సిఫా) ముఖ్య సలహాదారు పి. చెంగల్ రెడ్డి సూచించారు.ఇక్రిశాట్, ఐసీఏఆర్ అభివృద్ధి చేసిన జన్యు సాంకేతికతకు తక్షణ ఆమోదం తెలపాలని ఆయన కోరారు. పంట ధరల విధానంపై ప్రభుత్వ సలహా సంఘంగా ఉన్న వ్యవసాయ ఖర్చులు, ధరల సంఘానికి వాస్తవిక ఖర్చుల ఆధారంగా ఎంఎస్పీ నిర్ధారించేందుకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చేనేత రంగ నిపుణుడు డాక్టర్ డి.నరసింహారెడ్డి, రైతు నాయకుడు వై.శివాజీ సలహాలిచ్చారు. వ్యవసాయ రంగంలో కూలీల కొరతను తగ్గించేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎంఎస్పీ నిర్ణాయక విధానాన్ని సమూలంగా మార్చాలని కోరారు. దేశ ఆహారభద్రతకు భరోసా ఇచ్చిన హరిత విప్లవ రాష్ట్రాలు భారతీయ పౌష్టికాహార భద్రతా రాష్ట్రాలుగా మారేందుకు కేంద్రప్రభుత్వం నిధులు సమకూర్చాలన్నారు. రాష్ట్రాలు ఈ ఖర్చును భరించే దశలో లేవని పేర్కొన్నారు. వ్యవసాయ ఖర్చులను తగ్గించేందుకు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి సీజన్‌కు ఒక్కో రైతుకు 5 వేల లీటర్ల వరకు డీజిల్‌ను అనుమతించడంతో పాటు భారీ సబ్సిడీ ఇవ్వాలని సూచించారు. క్రిమిసంహారక మందులపై పన్నులు తగ్గించాలని సలహా ఇచ్చారు. ఎంఎస్పీపై కమిటీలో ఏపీకి ప్రాతినిధ్యం ఇవ్వాలి కనీస మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో నియమించే కమిటీలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రంగంలో అగ్రగామిగా ఉండడంతో పాటు సుమారు 28 రకాల పంటలకు కనీస మద్దతు ధరలు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదేనని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి ఇస్తున్న ప్రోత్సాహం, చేపట్టిన పథకాలు దేశంలో మరెక్కడా లేని విధంగా ఉన్నందున ఆ కమిటీలో సభ్యత్వానికి తమకు అర్హత ఉందని విజ్ఞప్తి చేశారు. -
బైడెన్–జిన్‌పింగ్ వర్చువల్ సమావేశం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య మంగళవారం వర్చువల్ సమావేశం జరగనుంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్గుర్లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
భారీ ప్రైవేటు పెట్టుబడులపై కేంద్రం దృష్టి!
FM Nirmala Sitharaman to interact with CMs of states: దేశంలో భారీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 15వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ ఈ విషయాన్ని తెలిపారు. కోవిడ్–19 సృష్టించిన ఆర్థిక అనిశ్చితి వాతావరణం నుంచి దేశం కోలుకుంటున్న నేపథ్యంలో తాజాగా ఈ వెర్చువల్ సమావేశం ఢిల్లీ వేదికగా జరుగుతోంది. కీలక సవాళ్లపై చర్చ రాష్ట్ర స్థాయిలో సమస్యలు, అవకాశాలు, సవాళ్లపై 15వ తేదీ సమావేశం ప్రధానంగా దృష్టి పెడుతుందని సోమనాథన్ తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వాల మూల ధన వ్యయ సామర్థ్యాలపై దృష్టి సారిస్తుందని వివరించారు. ‘ప్రభుత్వ వైపు నుండి మూలధన వ్యయాలు జరుగుతున్నాయి. ప్రైవేట్ రంగం వైపు నుండి సానుకూల సెంటిమెంట్ ఉంది, అయితే భారీగా మరిన్ని వాస్తవ పెట్టుబడులు రావాలి. క్యాపిటల్ మార్కెట్ కార్యకలాపాలను పరిశీలిస్తే, భారీ పెట్టుబడులకు అవకాశం ఉందని సూచిస్తున్నాయి’’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సానుకూల సెంటిమెంట్ భారతదేశాన్ని ఉన్నత, స్థిరమైన వృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి దోహదపడుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోందని అన్నారు. ఇది మనం వదులుకోకూడని అవకాశం అని అని సోమనాథన్ అన్నారు. రాష్ట్రాల పాత్రా కీలకమే! ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కూడా భారత్‌కు సానుకూల వాతావారణం ఉందన్నారు. అటు దేశీయంగా, అంతర్జాతీయంగా భారీ పెట్టుబడులను ఆకర్షించే సామర్థ్యం భారత్ సొంతమని వివరించారు. ‘‘ఈ నేపథ్యంలో భారతదేశాన్ని అధిక వృద్ధికి తీసుకెళ్లడానికి ప్రైవేట్ రంగం ద్వారా తీసుకోవలసిన చర్యలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం తీసుకోవలసిన విధానపరమైన చర్యలు ఉన్నాయి. కొన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. ఈ దిశలో చర్యలు తీసుకుంటోంది. అయితే భారతదేశాన్ని స్థిరమైన ఉన్నత వృద్ధి పథంలోకి తీసుకువెళ్లడానికి అవసరమైన పలు చర్యలను రాష్ట్రాలూ తీసుకోవాల్సి ఉంది ’’అని ఆయన అన్నారు. కాగా, చర్చించాల్సి ఉన్న రాష్ట్ర స్థాయి అంశాల్లో భూ సంస్కరణలు, జల వనరులు, విద్యుత్ లభ్యత, పెట్టుబడులను ఆకర్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? అన్న అంశాలు ఉన్నాయని మరో ట్వీట్లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. -
బైడెన్–జిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధం
వాషింగ్టన్: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధినేత జీ పిన్‌పింగ్ భేటీకి రంగం సిద్ధమయ్యింది. వారిద్దరూ సోమవారం సాయంత్రం వర్చువల్‌గా సమావేశం కానున్నారు. వీడియో కాల్ ద్వారా ఇరువురు నేతలు మాట్లాడుకోనున్నారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో సంబంధాలు క్షీణించాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇరు దేశాల నడుమ ఉద్రిక్తతలు నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో బైడెన్, జిన్‌పింగ్ సమావేశం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ భేటీ ద్వారా పెద్దగా ఆశించాల్సింది ఏమీ ఉండదని వైట్‌హౌస్ అధికార వర్గాలు పరోక్షంగా సంకేతాలిస్తున్నాయి. అమెరికా, చైనా ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కలిసి పనిచేసే దిశగా బైడెన్, జిన్‌పింగ్ ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉన్నట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకీ చెప్పారు. అమెరికా ఉద్దేశాలు, ప్రాధాన్యతలను బైడెన్ చైనా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లనున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా ఇరువురు నేతలు మాట్లాడుకుంటుండడం ఇది మూడోసారి. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు అమెరికా సహకరిస్తుందని తాము ఆశిస్తున్నట్లు చైనా వెల్లడించింది. -
నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో.. సిక్కోలు కుర్రాడి ప్రతిభ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు యువకుడు అంతర్జాతీయ గుర్తింపు పొందాడు. నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్‌లో ఓ బృందానికి ప్రాతినిధ్యం వహించి తన ప్రతిభ చాటారు. సుదూర గ్రహాలు, ఉపగ్రహాల ఉపరితలాలపై ఖనిజాలను ఎలా సమకూర్చుకోవాలి? వెనక్కి ఎలా తీసుకోవాలి? అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎలా దోహదపడతాయి? అన్న అంశాలపై వర్చువల్ విధానంలో రోబోటిక్ సాప్ట్వేర్ తయారీపై నాసా స్పేస్ రోబోటిక్స్ చాలెంజ్ సంస్థ పోటీ నిర్వహించింది. ఈ చాలెంజ్‌లో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్ ప్రాతినిధ్యం వహించిన బృందం విశ్వవిజేతగా నిలిచింది. ఈ బృందంలో అలెంసాండ్రో డిఫవా, వెక్టర్ లోపెజ్, డేవిడ్ ఫెర్నాండెజ్ లోపెజ్, ఫియర్ ఫెర్న్బాచ్, లూకా మర్కియాని, ఆద్రియా రోయజ్ మొరెనో, నాసిన్ మిగేల్ బాన్యోస్ సభ్యులుగా ఉన్నారు. విజేతగా నిలిచిన వీరు రూ.1.30 కోట్ల ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నారు. సాయికిశోర్ ప్రస్తుతం స్పెయిన్‌లో పాల్ రోబోటిక్స్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. తన సహోద్యోగులతో కలిసి ఒలంపస్ మోన్స్ బృందంగా ఏర్పడి ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు. 114 బృందాలను అధిగమించి.. మల్టీ–రోబో బృందం అంతరిక్షంలోకి వెళ్లాక ఎలా పనిచేయాలి? ఎంత త్వరగా ఖనిజాన్ని సేకరించాలి? జీపీఎస్ వ్యవస్థ లేకుండా మొత్తం పనిచేసి, తిరిగి లొకేషన్‌కు వచ్చేలా ఈ బృందం సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ప్రకారం.. చంద్రునిపై ఖనిజాలు ఎక్కడ ఉన్నాయో ఒక రోబో వెతుకుతుంది.. ఇంకొకటి లొకేషన్‌కు వెళ్లి ఖనిజాలను తవ్వి, ఇంకో రోబో మీద మినరల్ వేస్తుంది.. లోడ్ చేసిన రోబో హోమ్ బేస్ లొకేషన్‌కు వచ్చి అన్లోడింగ్ చేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పన చేశారు. ఈ పోటీలో ప్రపంచ వ్యాప్తంగా 114 బృందాలు పాల్గొన్నాయి. వీటిలో 22 బృందాలు ఫైనల్‌కు వచ్చాయి. తుది పోరులో స్పెయిన్‌కు చెందిన ఒలంపస్ మోన్స్ బృందం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇదే పోటీలో నాసా ఇన్నోవేషన్ అవార్డు కూడా చేజిక్కించుకుంది. ఈ బృందంలో శ్రీకాకుళానికి చెందిన కొత్తకోట సాయికిశోర్ సభ్యుడిగా ఉండటం రాష్ట్రానికి గర్వకారణం. రెండేళ్లు కష్టపడ్డాం ఈ ఛాలెంజ్ కోసం మేం రెండేళ్లు కష్టపడ్డాం. ఇందులో స్కౌట్స్ అనే రకం రోబో మినరల్‌ను వెతుకుతుంది. ఎక్స్కవేటర్ అనే రోబో తవ్వకాలు చేసి, హౌలర్ అనే రోబోలో లోడింగ్ చేస్తుంది. మంచు, నీరు, అమ్మోనియా, కార్బన్ డై ఆక్సైడ్, ఈథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, మంచు, ఇసుకను సమర్థంగా తవ్వకాలు చేసి, తీసుకొచ్చేందుకు ఈ సాఫ్ట్వేర్ రూపొందించాం. దీనిని భవిష్యత్‌లో నాసా మిషన్ వినియోగించే అవకాశం ఉంది. – కొత్తకోట సాయికిశోర్, శ్రీకాకుళం -
ప్రతి గ్రామానికీ రక్షిత తాగునీరు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): దేశంలోని ప్రతి గ్రామానికి రక్షిత తాగు నీరు అందించాలన్నదే తమ మిషన్ ప్రధాన ఉద్దేశమని నేషనల్ జల్ జీవన్ మిషన్ అడిషనల్ సెక్రటరీ భరత్‌లాల్ స్పష్టం చేశారు. విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్లోని ఆంధ్రా మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ (అమ్మ) హాలులో ‘గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా, పారిశుధ్యం’ అంశంపై సిబ్బందికి శనివారం వర్క్‌షాప్ జరిగింది. భరత్‌లాల్ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా 9 శాతం మంది ప్రజలకు నీటి సరఫరా సక్రమంగా లేదని, 5 శాతం మంది నీటి కుళాయి కనెక్షన్లు పనిచేయడం లేదని, మరో 9 శాతం మంది తమకు నీరు సమృద్ధిగా అందడం లేదని తాము నిర్వహించిన సర్వేలో ప్రజలు చెప్పారన్నారు. ప్రారంభ సభకు అతిథిగా హాజరైన కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ..జల్‌జీవన్ మిషన్ ద్వారా అందరికీ నీరు అందేందుకు అంచనాలను సక్రమంగా రూపొందించాలన్నారు. గ్రామ స్థాయిలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాలకు, గ్రామంలోని ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీటిని అందించాలన్నారు. నేషనల్ జల్‌జీవన్ మిషన్ డైరెక్టర్ ప్రదీప్‌సింగ్, డెప్యూటీ డైరెక్టర్ ఏ మురళీధరన్, రాష్ట్ర నీటి పారుదల, పారిశుధ్య శాఖ చీఫ్ ఇంజనీరు ఆర్.బి.కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
మా ‘భరోసా’కు తోడు మీ సాయం కావాలి
సాక్షి, అమరావతి: ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విత్తు నుంచి విపణి వరకు రైతులకు అండగా నిలిచేందుకు గ్రామస్థాయిలో రైతుభరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేశాం. రైతు ముంగిట (ఫామ్‌గేట్) పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా వారు పండించిన ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి అండగా నిలిచాం. గడిచిన రెండేళ్లలో రైతులకు రూ.83 వేల కోట్ల సాయమందించాం. పొరుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ అమలు చేస్తున్న కార్యక్రమాలను అధ్యయనం చేస్తున్నాయి. మీరు కూడా ఒక్కసారి మా రాష్ట్రానికి వచ్చి చూడండి.. రైతుల కోసం మా ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పని చేస్తుందో అర్థమవుతుంది. కేంద్రం నుంచి మీరు ఇతోధికంగా సాయమందిస్తే రైతుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేసేందుకు తోడ్పడుతుంది..’ అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ నిర్వహించిన జాతీయస్థాయి వర్చువల్ సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తరఫున మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన 10,778 ఆర్బీకేల ద్వారా సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రైతులు పండించే ప్రతి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు. అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ద్వారా ఆర్బీకే స్థాయిలో కస్టమ్ హైరింగ్ సెంటర్లు, కంబైన్డ్ హార్వెస్టింగ్ సెంటర్లతో పాటు మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ల ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు. కొనుగోలు చేసే ఉత్పత్తుల కోసం గ్రామస్థాయిలోనే రూ.1,534.75 కోట్లతో 2,543 గోదాములతోపాటు మరో రూ.269 కోట్లతో వివిధరకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి టెండర్లు తుదిదశలో ఉన్నాయన్నారు. ఆయిల్‌పామ్ సాగు, దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ 1గా ఉందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పొరుగు రాష్ట్రాల కంటే మిన్నగా రైతులకు ఆర్థిక చేయూతనిస్తున్నట్లు తెలిపారు. రూ.80 కోట్లకుపైగా ఇన్సెంటివ్ రూపంలో అందించామన్నారు. ఆయిల్‌పామ్ విస్తరణ కోసం కేంద్రం ప్రకటించిన పాలసీ చాలా బాగుందన్నారు. అది తమ రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తరణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ‘ఒక్కసారి మా రాష్ట్రానికి రండి.. మా ప్రభుత్వానికి చేయూతనివ్వండి..’ అని మంత్రి కన్నబాబు కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు.