న్యూయార్క్: లినక్స్ ఆపరేటింగ్ సిస్టంకు షాకిచ్చే అంశం తాజా అధ్యయనం వెల్లడైంది. హైజాకర్లు సులువుగా దాడిచేసేంత బలహీనంగా ఉందని ఓ స్టడీలో తేలింది. కాలిఫోర్నియాలో రివర్సైడ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తమ అధ్యయనంలో లైనక్స్ సాఫ్ట్ వేర్ లోపాన్ని గుర్తించారు. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ విద్యార్థి యో కావ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనలో లినక్స్ ఆపరేటింగ్ వ్యవస్థలోని ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ (టీసీపీ) బలహీనతను గుర్తించారు. తత్ఫలితంగా రిమోట్ తో ఇంటర్నెట్ కమ్యూనికేషన్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని వివరించారు. ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే ఈ మెయిల్స్ ను చేరవేసే ఈ టీసీపీ స్వీక్వెన్స్ నంబర్ల ద్వారానే ఎటాకర్లు దాడిచేసే అవకాశం ఉందని తెలిపారు. ఈ లోపం ద్వారా ఆన్ లైన్ లో రెండవ వ్యక్తి కనెక్షన్ ని తొలగించి, తప్పు డు సమాచారాన్ని అవతలి వ్యక్తికి అందించే అవకాశం ఉందని హెచ్చరించారు. కేవలం 90 శాతం సక్సెస్ రేటుతో ఒక్క నిమిషంలోనే ఈ దాడి జరిగిపోవచ్చని పేర్కొన్నారు. దీనిపై లినక్స్ సంస్థను అప్రమత్తం చేశారు. ఇది లినక్స్ లేటెస్ట్ వెర్షన్ కూడా వర్తింస్తుందని హెచ్చరించారు. ఈ అధ్యయనాన్ని టెక్సాస్ లోని ఆస్టిన్, యూజ్ నిక్స్ భద్రతా సింపోసియం, ఈ వారంలో ప్రదర్శనకు ఏర్పాటు చేశారు.
డేటాను ఒక సోర్స్ నుంచి సమాచారాన్ని బదిలీ చేయడానికి లీనక్స్ సహా ఇతర ఆపరేటింగ్ వ్యవస్థలు ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ను వినియోగిస్తాయి. ఈ సమాచారం సరైన గమ్యానికి చేరిందో లేదో ఇంటర్నెట్ ప్రోటోకాల్ (ఐపి) ద్వారా నిర్ధారించుకుంటాయి. ఇద్దరు వ్యక్తులు ఇమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేసినప్పుడు, టీసీపీ డేటా ను ప్రత్యేకమైన సీక్వెన్స్ నంబర్ల ద్వారా గుర్తించి, సందేశాన్ని చేరవేస్తుంది. అయితే దాదాపు నాలుగు బిలియన్లకు పైగా ఉన్న ఈ సీక్వెన్లను ఐడెంటిఫై చేయడం సాధ్యం కాదని పరిశోధకులు తెలిపారు. అలాంటిది లినక్స్ ఆపరేటింగ్ సిస్టం లో టీసీపీ బలహీనంగా ఉన్నట్టు గుర్తించినట్టు తాజా అధ్యయనం రిపోర్టు చేసింది అయితే ఈ అధ్యయనంపై లినక్స్ సంస్థ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
లినక్స్కు షాకిచ్చిన అధ్యయనం
Published Wed, Aug 10 2016 7:39 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
Advertisement
Advertisement