హదీసు పరిమళం
మహనీయ ముహమ్మద్ (సఅసం) ప్రవచనం: పీడలు, విపత్కర పరిస్థితుల బాధనుంచి, దౌర్భాగ్యకర స్థితి దాపురించడం నుంచి, దురదృష్టకర జాతకం నుంచి, శత్రువులు పరిహాసం చేయటం నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి.
వివరణ: ఈ హదీసులో స్థూలంగా నాలుగు విషయాల నుండి రక్షణ కోరమని చెప్పినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి ఈ నాలుగు విషయాలలోనే ఇహ పరాలకు సంబంధించిన అన్ని చెడుగులు కఠిన పరీక్షలు, కష్టాలు కడగండ్లు వచ్చేశాయి. వాటిలో మొదటిది (జిహాదిల్ బలా) అంటే ఏదైనా ఆపద లేక పీడన వల్ల కలిగే యాతన. మనిషిని శారీరకంగా బాధించి మానసిక క్షోభకు గురి చేసే ప్రతిదీ అతని పాలిట పీడే. ఈ విపత్కర స్థితి ప్రాపంచికమైనదీ కావచ్చు. ఈ ఒక్క పదంలోనే అన్నిరకాల ఆపదలు, విపత్తులు, పీడలు, పరీక్షలు చేరి ఉన్నాయి.
రెండవ మూడవ అంశాలు: నిజానికి ఏ దాసునికైతే దౌర్భాగ్యకర స్థితి నుంచి, దురదృష్టం నుంచి దేవుని తరపున రక్షణ లభించిందో అతనికి సర్వస్వం ప్రార్థించినట్లే.
నాలుగవ అంశం: షమాతతుల్ ఆదాయి అంటే మనకు కలిగిన ఏదేని కష్టంపై ఎదురైన గడ్డు పరిస్థితిపై మన శత్రువు నవ్వటం, దెప్పి ΄÷డవడం, ఎగతాళి చేయడం, సంకట స్థితిలో శత్రువు చేసే పరిహాసం తీవ్ర వ్యాకులతకు గురిచేస్తుంది. అందుకే ప్రత్యేకంగా దీని నుంచి కూడా దేవుని శరణు వేడమని ఉపదేశం.
ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాన్ని పాటిస్తూ, ఈ నాలుగింటి నుండి శరణు వేడే సరైన తీరు ఇది:
(2) ఓ అల్లాహ్ గండం వల్ల కలిగే బాధనుండి, దౌర్భాగ్యకర స్థితి నెలకొనడం నుండి, శత్రువులు నవ్విపోవడం దురదృష్టకర జాతకం జాతకం నుండి నేను నీ శరణు వేడుతున్నాను.
(3) ఓ అల్లాహ్! విచారం, దుఃఖం నుండి, అధైర్యం నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, పిసినారితనం నుండి, జనుల ఒత్తిడి నుండి నేను నీ శరణు వేడుతున్నాను.
ఈ (దువా) వేడుకోలులో 8 విషయాల రక్షణ కోరబడింది. ఈ ఎనిమిది విషయాలలో నాలుగు మరీ ముఖ్యమైనవి అవి: విచారం, దుఃఖం, రుణభారం, ప్రజల శత్రువుల ప్రాబల్యం, ఒత్తిడి ఈ నాలుగు విషయాలకు లోనైన మనిషి సున్నిత మనస్కుడై ఉంటే అతని బతుకు దుర్భరమైపోతుంది. తత్కారణంగా అతనిలోని తెలివితేటలు, శక్తియుక్తులు చచ్చుబడి పోతాయి. ఫలితంగా ఇహపరాలలోని ఎన్నో విజయ శిఖరాలను అందుకోలేక పోతాడు. అధైర్యం, సోమరితనం, పిసినారితనం, పిరికితనం... ఈ నాలుగు బలహీనతలకు లోనైనా మనిషిలో సంకల్పబలం ధైర్యం తెగువ క్షీణిస్తాయి. అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లం) ఈ అంశాలన్నిటి నుంచి అల్లాహ్ శరణు వేడుకోవడమే కాకుండా ఈ విధంగా ్ర΄ార్థిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా నొక్కి చెప్పారు.
– మొహమ్మద్ అబ్దుల్ రషీద్
∙
Comments
Please login to add a commentAdd a comment