pray
-
విపత్కర పరిస్థితులలో వేడుకోవాలి
మహనీయ ముహమ్మద్ (సఅసం) ప్రవచనం: పీడలు, విపత్కర పరిస్థితుల బాధనుంచి, దౌర్భాగ్యకర స్థితి దాపురించడం నుంచి, దురదృష్టకర జాతకం నుంచి, శత్రువులు పరిహాసం చేయటం నుంచి అల్లాహ్ శరణు వేడుకోండి.వివరణ: ఈ హదీసులో స్థూలంగా నాలుగు విషయాల నుండి రక్షణ కోరమని చెప్పినట్లుగా ఉంది. కానీ వాస్తవానికి ఈ నాలుగు విషయాలలోనే ఇహ పరాలకు సంబంధించిన అన్ని చెడుగులు కఠిన పరీక్షలు, కష్టాలు కడగండ్లు వచ్చేశాయి. వాటిలో మొదటిది (జిహాదిల్ బలా) అంటే ఏదైనా ఆపద లేక పీడన వల్ల కలిగే యాతన. మనిషిని శారీరకంగా బాధించి మానసిక క్షోభకు గురి చేసే ప్రతిదీ అతని పాలిట పీడే. ఈ విపత్కర స్థితి ప్రాపంచికమైనదీ కావచ్చు. ఈ ఒక్క పదంలోనే అన్నిరకాల ఆపదలు, విపత్తులు, పీడలు, పరీక్షలు చేరి ఉన్నాయి. రెండవ మూడవ అంశాలు: నిజానికి ఏ దాసునికైతే దౌర్భాగ్యకర స్థితి నుంచి, దురదృష్టం నుంచి దేవుని తరపున రక్షణ లభించిందో అతనికి సర్వస్వం ప్రార్థించినట్లే.నాలుగవ అంశం: షమాతతుల్ ఆదాయి అంటే మనకు కలిగిన ఏదేని కష్టంపై ఎదురైన గడ్డు పరిస్థితిపై మన శత్రువు నవ్వటం, దెప్పి ΄÷డవడం, ఎగతాళి చేయడం, సంకట స్థితిలో శత్రువు చేసే పరిహాసం తీవ్ర వ్యాకులతకు గురిచేస్తుంది. అందుకే ప్రత్యేకంగా దీని నుంచి కూడా దేవుని శరణు వేడమని ఉపదేశం.ప్రవక్త (స) వారి ఈ ఉపదేశాన్ని పాటిస్తూ, ఈ నాలుగింటి నుండి శరణు వేడే సరైన తీరు ఇది: (2) ఓ అల్లాహ్ గండం వల్ల కలిగే బాధనుండి, దౌర్భాగ్యకర స్థితి నెలకొనడం నుండి, శత్రువులు నవ్విపోవడం దురదృష్టకర జాతకం జాతకం నుండి నేను నీ శరణు వేడుతున్నాను. (3) ఓ అల్లాహ్! విచారం, దుఃఖం నుండి, అధైర్యం నుండి, సోమరితనం నుండి, పిరికితనం నుండి, పిసినారితనం నుండి, జనుల ఒత్తిడి నుండి నేను నీ శరణు వేడుతున్నాను.ఈ (దువా) వేడుకోలులో 8 విషయాల రక్షణ కోరబడింది. ఈ ఎనిమిది విషయాలలో నాలుగు మరీ ముఖ్యమైనవి అవి: విచారం, దుఃఖం, రుణభారం, ప్రజల శత్రువుల ప్రాబల్యం, ఒత్తిడి ఈ నాలుగు విషయాలకు లోనైన మనిషి సున్నిత మనస్కుడై ఉంటే అతని బతుకు దుర్భరమైపోతుంది. తత్కారణంగా అతనిలోని తెలివితేటలు, శక్తియుక్తులు చచ్చుబడి పోతాయి. ఫలితంగా ఇహపరాలలోని ఎన్నో విజయ శిఖరాలను అందుకోలేక పోతాడు. అధైర్యం, సోమరితనం, పిసినారితనం, పిరికితనం... ఈ నాలుగు బలహీనతలకు లోనైనా మనిషిలో సంకల్పబలం ధైర్యం తెగువ క్షీణిస్తాయి. అందుకే మహనీయ ముహమ్మద్ (సల్లం) ఈ అంశాలన్నిటి నుంచి అల్లాహ్ శరణు వేడుకోవడమే కాకుండా ఈ విధంగా ్ర΄ార్థిస్తూ ఉండమని తన అనుయాయులకు కూడా నొక్కి చెప్పారు.– మొహమ్మద్ అబ్దుల్ రషీద్∙ -
గుడిలో ప్రార్థన చేస్తూ...అకస్మాత్తుగా మృతి: వీడియో వైరల్
మధ్యప్రదేశ్: ఒక భక్తుడు గుడిలో ప్రార్థన చేస్తూ... అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...గురువారం రాజేష్ మెహనీ అనే సాయి భక్తుడు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ అలా ఉండిపోయాడు. ఎంతకీ అతను చలనం లేకుండా అలా సుమారు 15 నిమిషాల వరకు ఉండిపోయాడు.దీంతో అనుమానం వచ్చి అక్కడే ఉన్న కొందరూ అతను వద్దకు వచ్చి తట్టగా అతడు అచేతనం పడి ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్న మరికొందరూ భక్తులు సదరు వ్యక్తిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. మృతుడు రాజేష్ ఒక మెడికల్ స్టోర్‌ని నడుపుతున్నాడని, ప్రతి గురువారం సాయి దేవాలయానికి వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో నెట్టింట తెగ వైరల్ వుతుంది. అతను ఆ వీడియోలో ప్రదిక్షిణ చేసి సాయి బాబ విగ్రవద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తూ అలా అచేతనంగా ఉండిపోయినట్లు కనిపిస్తుంది. रहस्यमय मौत... कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU — Narendra Singh (@NarendraNeer007) December 4, 2022 (చదవండి: అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు) -
అందరి కోసం
రాజు ఓ జ్ఞానిని కలిశాడు.‘‘స్వామీ.. నాకోసం మీరు దయచేసి భగవంతుడి దగ్గర ప్రార్థించగలరు’’ అని రాజు ఎంతో వినయంగా అడిగాడు.జ్ఞాని ‘‘అలాగే’’ అన్నాడు.‘‘దేవుడా, ఈ భూప్రపంచం మీద అందరూ సంతోషంతో ఉండాలి. అంతటా ప్రశాంతత నెలకొనాలి. అందరికీ సకల సిరిసంపదలు సమకూరి మంచి జరగాలి’’ అని జ్ఞాని ప్రార్థించాడు.ఈ మాటలన్నీ జ్ఞాని పెద్దగానే చెప్పాడు. ఆ మాటలను విన్న రాజు నిరాశ చెందాడు.జ్ఞాని ప్రార్థన ముగియడంతోనే రాజు ఆయనతో..‘‘స్వామీ ఏమిటిది.. నాకోసం కదా మిమ్మల్ని ప్రార్థించమన్నాను. కానీ మీరు ప్రపంచంలోని వారందరి కోసమూ ప్రార్థించారు. పోనీ అందులో నేను పాలిస్తున్న నా దేశం పేరో, నా పేరో లేదు.. నేనిలా మిమ్మల్ని కోరలేదుగా... ప్రత్యేకించి నా కోసం కదండీ ప్రార్థించమన్నాను’’ అన్నాడు.జ్ఞాని చిరునవ్వుతో చూశాడు.‘‘మీకొక విషయం అర్థం కాలేదనుకుంటాను. ప్రపంచం కోసం నేను ప్రార్థించడంలో తప్పేమీ కనిపించలేదు. అందరూ బాగుండాలని కదా నేను కోరుకున్నాను. అందరిలో మీరు లేకుండా పోతారా.. మీరూఉన్నారుగా..’’ అని జ్ఞాని అన్నాడు.అయితే జ్ఞాని జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు.‘‘అయినా ...’’ అని రాజు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. జ్ఞాని లోపలికి వెళ్లి ఓ బక్కెట్టు నిండా నీరు తీసుకొచ్చి రాజుకి అందించాడు. ఆ నీరు తన ఆవరణలో ఉన్న చెట్లకు పోయమన్నాడు. రాజు అలాగే చెట్లన్నింటికీ పోసి జ్ఞాని వద్దకు వచ్చాడు.‘‘అన్నట్టు నీరెక్కడ పోశారు’’ అని జ్ఞాని అడిగాడు.‘‘అన్ని చెట్లకు పోశాను’’అన్నాడు రాజు.‘‘చెట్లలో ఏ భాగానికి పోశారు.’’ అడిగాడు జ్ఞాని.‘‘వేరుకే’’ అన్నాడు రాజు.‘‘మీ చర్య విచిత్రంగా ఉంది. కొమ్మల్లో ఆకులు చాలా వరకూ వాడినట్లు కనిపిస్తున్నాయి కదా... మీరేమో ఆకులపైన పోయకుండా వేళ్లకు నీరు పొయడమేంటీ’’ అని అడిగాడు జ్ఞాని.అప్పుడు రాజు ‘‘వేరుకి పోస్తే ఆ నీరు అన్ని కొమ్మలకూ ఆకులకూ తానుగా విస్తరించదా చెప్పండి’’ అని అన్నాడు.‘‘సరిగ్గా నేనూ అదే చేశాను..’’ అన్నాడు జ్ఞాని.‘‘ప్రపంచంలోని మానవజాతి అంతా బాగుండాలని, కాపాడమని దేవుడిని ప్రార్థించాను. ఇలా వేడుకోవడం వల్ల అది అందరి కోసమూ కోరుకున్నట్టే అవుతుంది. అంతే తప్ప మిమ్మల్ని విస్మరించినట్లు కాదు’’ అని జ్ఞాని చెప్పడంతోనే రాజుకి విషయంబోధపడింది. మరో మాట మాట్లాడక మౌనం వహించి తన కళ్లు తెరిపించిన జ్ఞానికి నమస్కరించి అక్కడి నుంచి నిష్క్రమించాడు. – యామిజాల జగదీశ్ -
శ్రీవారి సన్నిధిలో ఇస్రో శాస్త్రవేత్తలు
తిరుమల: ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగ కౌంట్‌డౌన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ప్రయోగం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. -
అమ్మ కోసం అభిమానుల పూజలు
-
గొత్తికోయలు మూఢనమ్మకాలు వీడాలి
ఏటూరునాగారం : గొత్తికోయలు మూఢ నమ్మకాల వైపు వెళ్లకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలని ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్ఓ అల్లెం అప్పయ్య సూచించారు. గోగుపల్లి లింగాపురం గ్రామ గొత్తికోయ మహిళ పోచమ్మ ప్రసవం కోసం వెళ్తుండగా మంగళవారం దారి మధ్యలో కవలలకు జన్మనిచ్చిన విషయం విదితమే. ఇందులో ఓ శిశువు మృతి చెందగా మరో శిశువు, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండగా.. పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఈ మేరకు సామాజిక ఆస్పత్రిలో ఉన్న పోచమ్మ ఆరోగ్య పరిస్థితిని అప్పయ్య పరీక్షించి మాట్లాడారు. వైద్యాధికారులు శిరీష, క్రాంతికుమార్, మంకిడి వెంకటేశ్వర్లు, ఏఎ¯ŒSఎం ధనలక్ష్మి ఉన్నారు. -
చెర్వుగట్టులో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పూజలు
నార్కట్‌పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతీజడల రామలింగేశ్వరస్వామి ఆలయంలో అమావాస్యకు ప్రత్యేకత ఉండడంతో గురువారం రాత్రి రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్షపుష్పార్చనలో పాల్గొన్నారు. అనంతరం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరమే తెలంగాణలోని దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వాటికి గుర్తింపు రావడానికి ముఖ్యమంత్రి కృషి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారన్నారు. ఆయన వెంట నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. -
సూర్యలంకలో ‘శివ లింగ’ ప్రతిష్ట
బాపట్ల టౌన్: సూర్యలంక సాగర తీరంలోని శివక్షేత్రంలో ఆదివారం శివలింగాన్ని కమిటీ సభ్యులు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివక్షేత్ర నిర్మాణ సంఘం అధ్యక్షుడు మంతెన దశరథ మహారాజు మాట్లాడుతూ సూర్యలంక తీరానికి పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీలుగా తీరంలో శివక్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన సూర్యలంక తీరంలో నిత్యం పూజలు నిర్వహించే విధంగా శివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అడ్డగడ సుబ్బారావు, సెక్రటరి సంగమేశ్వరశాస్త్రి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
చిలుకూరులో గాంధీ విగ్రహానికి పాలాభిషేకం
చిలుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతిపిత గాంధీని అగౌరపరిచాడని, విగ్రహాంను బురదలో వేయించాడాన్ని ఇందుకు నిరసనగా శనివారం చిలుకూరు గ్రంథాయలంలో ఆర వైశ్య సంఘం ఆధ్వర్యంలో జాతిపితకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి హాదాలో ఉండి జాతిపిత గాంధీ విగ్రహాంను బరదలో వేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు. జాతిపితను అగౌవరపరిచిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, గ్రంథాలయ చైర్మన్ అత్తులూరి శ్రీనివాస్‌రావు, ఆర్య వైశ్య సంఘం నాయకులు రేపాల అప్పారావు, శ్రీకాకుళపు బ్రహ్మనందం, ఈగ శ్రీను, టీఆర్ఎస్ నాయకులు, వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. -
'హిల్లరీ’ గెలుపు కోసం పూజలు
-
మోడీ కోసం జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు
పలన్‌పూర్: ప్రధాని నరేంద్ర మోడీ కోసం ఆయన భార్య జశోదా బెన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మోడీ ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించి, విజయాలు సాధించాలని దేవుణ్ని కోరారు. శుక్రవారం గుజరాత్‌లోని బనస్కాంత జిల్లా మగర్వాద గ్రామంలో వెలసిన వీరభద్ర మహారాజ్ ఆలయాన్ని జశోదా బెన్ సందర్శించారు. శ్రావణ మాసం సందర్భంగా వేలాది మంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. 1980 ప్రాంతంలో ఇక్కడ టీచర్‌గా పనిచేశానని, అప్పట్లో ఈ ఆలయానికి తరచూ వెళ్లానని జశోదా బెన్ గుర్తు చేసుకున్నారు. ఇక్కడి నుంచి తాను బదిలీ అయ్యాక మళ్లీ రాలేదని, తన భర్త కోసం ప్రార్థనలు చేయడానికి ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చానని బెన్ చెప్పారు. జశో్దా బెన్‌కు మోడీ దూరంగా ఉంటున్నా ఆమె భర్త కోసం పూజలు చేస్తుంటారు. -
నిత్య ప్రార్థనేనిత్య జీవము
సువార్త దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. (ఫిలిప్పీ 4:6) ప్రార్థన... దేవుడిని, భక్తుడిని అనుసంధానం చేసే సాధనం. మనల్ని ప్రభువుకు దగ్గర చేసే అతి శక్తిమంతమైన ఉపకరణం. ప్రభువు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనం ప్రభువుతో ప్రార్థన ద్వారా మాట్లాడుతాం. ప్రార్థన లేని జీవితం అద్భుతాలను చూడలేదు. ప్రార్థన లేని జీవితం క్రైస్తవుని జీవితానికి సాఫల్యతనివ్వదు. అందుకే యెడతెగక ప్రార్థన చేయమని చెప్పాడు దేవుడు. ప్రార్థన ఒక బలం. ప్రార్థన చెడును జయించే ఓ సాధనం. ప్రార్థన ఓ ధైర్యం. ప్రార్థన మనల్ని పరలోకానికి చేర్చే ఒక మార్గం. మనిషికి ఎన్నో చింతలు. అది ఉంది, ఇది లేదు, ఇంకేదో కావాలి అంటూ ఆలోచనలు. అయితే దేని గురించీ అంత చింతించాల్సిన పని లేదని సూటిగా చెబుతున్నాడు ప్రభువు పై వాక్యంలో. అయితే ఆ ప్రార్థన ఎలా ఉండాలి? నాకిది కావాలి ఇవ్వు ‘తండ్రీ అని అడిగేస్తే సరిపోతుందా? లేదు. నిండు విశ్వాసంతో, పూర్ణమనసుతో, కృతజ్ఞత నిండిన ప్రార్థన చేయాలి. విన్నవించుకోవాలి. మనకు సర్వస్వాన్నీ అనుగ్రహించువాడు ప్రభువే. ఆయనే అన్నాడు ‘అడుగుడి ఇవ్వబడును’ అని. తండ్రీ నా శక్తి చాలదు, నాకిది అనుగ్రహించు’ అని వేడుకుంటే ఆయన తప్పక మనకు దానిని ఇస్తాడు. విశ్వాసంతో నిండిన ప్రార్థనను, నమ్మకంతో కూడా విన్నపాన్ని ఆయన ఎప్పుడూ తోసిపుచ్చడు. లోక సంబంధిత విషయాల కొరకు చింతించనవసరం లేదు. ఆయన అవన్నీ చూసుకుంటాడు. ఓ క్రైస్తవుడిగా దైవ సంబంధిత చింతనను మాత్రమే కలిగివుండాలి. ప్రార్థనాశక్తి ఎంతటిదో పలు సందర్భాల్లో రుజువు అయ్యింది. నమ్మకంతో ప్రార్థించినవారి రోగాలు నయమయ్యాయి. నమ్మకంతో ప్రార్థన చేసినవారి నుంచి దురాత్మలు దూరమయ్యాయి. యేసుక్రీస్తు సైతం ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేసినట్టు పరిశుద్ధ గ్రంథం చెబుతోంది. అంత గొప్ప ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తున్నామా? ప్రతిదినం దేవుడిని ప్రార్థిస్తున్నామా? ఉరుకుల పరుగుల జీవన ప్రయాణంలో పడి ప్రార్థనను విస్మరిస్తున్నామా? ప్రతి క్రైస్తవుడూ ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ప్రార్థనకు మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నామో తరచి చూసుకోవాలి. నిత్యం ప్రార్థించాలి. ఆ ప్రార్థనే... మనకు నిత్యజీవాన్ని అనుగ్రహిస్తుంది. - జాయ్స్ మేయర్ -
రెండు రోజుల్లో భూమి పై పడనున్న ఉపగ్రహం