సూర్యలంకలో ‘శివ లింగ’ ప్రతిష్ట | Lord shiva statue arrangement in Suryalanka | Sakshi
Sakshi News home page

సూర్యలంకలో ‘శివ లింగ’ ప్రతిష్ట

Published Sun, Aug 14 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 9:17 AM

సూర్యలంక సాగర తీరంలోని శివక్షేత్రంలో ఆదివారం శివలింగాన్ని కమిటీ సభ్యులు ప్రతిష్టించారు.

బాపట్ల టౌన్‌: సూర్యలంక సాగర తీరంలోని శివక్షేత్రంలో ఆదివారం శివలింగాన్ని కమిటీ సభ్యులు ప్రతిష్టించారు. ఈ సందర్భంగా శివక్షేత్ర నిర్మాణ సంఘం అధ్యక్షుడు మంతెన దశరథ మహారాజు మాట్లాడుతూ సూర్యలంక తీరానికి పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులు ప్రత్యేక పూజలు  నిర్వహించేందుకు వీలుగా తీరంలో శివక్షేత్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1400 సంవత్సరాల చరిత్ర కలిగిన సూర్యలంక తీరంలో నిత్యం పూజలు నిర్వహించే విధంగా శివాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి శివలింగాన్ని ప్రతిష్టించారు. కార్యక్రమంలో కమిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అడ్డగడ సుబ్బారావు, సెక్రటరి సంగమేశ్వరశాస్త్రి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement