
దేవుడి ముందు మోకరిల్లి ప్రార్థిస్తూ...
మధ్యప్రదేశ్: ఒక భక్తుడు గుడిలో ప్రార్థన చేస్తూ... అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...గురువారం రాజేష్ మెహనీ అనే సాయి భక్తుడు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ అలా ఉండిపోయాడు. ఎంతకీ అతను చలనం లేకుండా అలా సుమారు 15 నిమిషాల వరకు ఉండిపోయాడు.దీంతో అనుమానం వచ్చి అక్కడే ఉన్న కొందరూ అతను వద్దకు వచ్చి తట్టగా అతడు అచేతనం పడి ఉన్నాడు.
వెంటనే అక్కడ ఉన్న మరికొందరూ భక్తులు సదరు వ్యక్తిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. మృతుడు రాజేష్ ఒక మెడికల్ స్టోర్‌ని నడుపుతున్నాడని, ప్రతి గురువారం సాయి దేవాలయానికి వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో నెట్టింట తెగ వైరల్ వుతుంది. అతను ఆ వీడియోలో ప్రదిక్షిణ చేసి సాయి బాబ విగ్రవద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తూ అలా అచేతనంగా ఉండిపోయినట్లు కనిపిస్తుంది.
रहस्यमय मौत... कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU
— Narendra Singh (@NarendraNeer007) December 4, 2022
(చదవండి: అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్‌పాట్‌లు)