Sai Baba Devotee
-
గుడిలో ప్రార్థన చేస్తూ...అకస్మాత్తుగా మృతి: వీడియో వైరల్
మధ్యప్రదేశ్: ఒక భక్తుడు గుడిలో ప్రార్థన చేస్తూ... అకస్మాత్తుగా మృతి చెందాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...గురువారం రాజేష్ మెహనీ అనే సాయి భక్తుడు దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తూ అలా ఉండిపోయాడు. ఎంతకీ అతను చలనం లేకుండా అలా సుమారు 15 నిమిషాల వరకు ఉండిపోయాడు.దీంతో అనుమానం వచ్చి అక్కడే ఉన్న కొందరూ అతను వద్దకు వచ్చి తట్టగా అతడు అచేతనం పడి ఉన్నాడు. వెంటనే అక్కడ ఉన్న మరికొందరూ భక్తులు సదరు వ్యక్తిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. మృతుడు రాజేష్ ఒక మెడికల్ స్టోర్‌ని నడుపుతున్నాడని, ప్రతి గురువారం సాయి దేవాలయానికి వస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డు కావడంతో నెట్టింట తెగ వైరల్ వుతుంది. అతను ఆ వీడియోలో ప్రదిక్షిణ చేసి సాయి బాబ విగ్రవద్దకు వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తూ అలా అచేతనంగా ఉండిపోయినట్లు కనిపిస్తుంది. रहस्यमय मौत... कटनी में साईं मंदिर में दर्शन करते समय शख्स की हो गई मौत. गिरते ही हो गई उसकी वहीं पर मौत.#Trending #TrendingNow pic.twitter.com/rOAYx852eU — Narendra Singh (@NarendraNeer007) December 4, 2022 (చదవండి: అదృష్టం మాములుగా లేదుగా! ఒకేసారి రెండు జాక్పాట్లు) -
ద్వారకామాయి
ఎవరు ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ.. ‘మనది హిందూ ధర్మమే తప్ప హిందూమతం కానేకాదు’. ‘మతి’ని బట్టి ఏర్పడేది మతం. ఎవరో కొందరు ఓ సంఘంగా ఏర్పడి, ఒకరిని అనుసరిద్దామని నిర్ణయించుకుని, ఆ ఉత్తమ లక్షణాలు ఫలానావానిలో ఉన్నాయని, కాలంలో జరిగే ఆయన ప్రవర్తనలని బట్టి నిశ్చయించుకుని, ఆయన మతిని బట్టి కొన్ని నియమాలనీ, సంప్రదాయాలనీ ఏర్పరుచుకుంటే అదీ ‘మతం’. మన హిందూధర్మం ఓ మతం కాదు. ఎవరి ఇష్టాన్ని బట్టీ నడుస్తూ ఉండే విధానం కలదీ కాదు. మనకి కనిపించని ఋషులందరూ.. ఏ ఉపనిషత్తులూ, వేదాలూ అనే వాటిని నిరంతరం మననం చేస్తూ.. ఉండేవారో ఆ వేదాలని బట్టి ఏర్పడిన ధర్మం మనది. అందుకే దీనికి మొదట్లో వేదధర్మం లేదా వైదికధర్మం అని పేరు ఏర్పడింది. ఆ మీదట కాలక్రమంలో ఇతర మతాలు ఏవేవో వచ్చాక ఈ గుర్తింపు నిలవడం కోసం ‘హిందూధర్మం’ అనే పేరుతో స్థిరపడింది. ఇదంతా ఎందుకంటే.. సాయి ఉండిన మసీదులో హిందూధర్మమే ఆచరింపబడుతూ ఉండేది. వినడానికి ‘ఇది నిజమా?’ అనిపిస్తుంది గానీ, కొద్దిగా పరిశీలించి చూస్తే మాత్రం– ఎందుకు ఇంతకాలం ఈ విషయాన్ని గమనించలేదు? అన్నంతగా హిందూధర్మమే పాటింపబడుతూ కనిపిస్తుంది పరిశీలిద్దాం!! 1. పంచసూనాలు భారతీయులం.. అందునా హిందువులమయ్యుండి కూడా ఈ మాటని (పంచసూనాలు) ఎందరో విని ఉండలేదు? సాయి మాత్రం నిరంతరం ఈ 5 దోషాలు(సూనాలు) ఏమున్నాయో వాటిని తొలగించుకుంటూనే ఉండేవాడు. రోట్లో ధాన్యం పోసి, రోకలితో దంచి, బియ్యంగా చేసేటప్పుడు (అప్పట్లో అదే మరి విధానం) మనకి తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులు మన కారణంగా చంపబడతాయి. ఇలా దంచినప్పుడు ధాన్యపు పై–పొట్టుపోతుంది – తినే వీలుకల బియ్యంగా అవుతుంది ధాన్యం. దీన్నే సంస్కృతంలోనైతే వ్రీహీ అవఘాతనం (వడ్లని దంచడం) అంటారు. మరాఠాలోనైతే ‘కండణి’ అంటారు. ఇది మొదటి దోషం. దోషమంటే ఇక్కడ పాపదోషమని అర్థం. అన్ని దోషాల వల్లా పాపం రాదు. ఉదాహరణకి పిల్లలు ఎక్కువగా తీపిని తింటూ ఉంటే.. ఆ బెల్లం ముక్కని దాచేసి, కాకి ఎత్తుకుపోయిందని అబద్ధమాడతాం. అది దోషమే అయినా పాపదోషం (పాపాన్ని తెచ్చిపెట్టే దోషం) కాదు. ఇక ఆ రోజుల్లో ఎండినపుల్లలు, కందికట్టలు, కొబ్బరి డొక్కలు, మట్టలు.. వంటి వంటచెరకుతో వండుతూండేవారు. వాటిలో కొన్ని పురుగులుండచ్చు. అలాగే ఆ వండేటప్పుడు కూడా కొన్ని పురుగులు మంటలో మనకారణంగా చనిపోవచ్చు. ఇది రెండవ దోషం. సంస్కృతంలోనైతే ‘దాహన’మంటారు. మరాఠాలో ‘ఛుల్లీ’ అంటారు. ఇది రెండవ పాపదోషం. ఒకప్పటి రోజుల్లో తిరుగలి వాడకం మరింత ఎక్కువగా ఉండేది. కందులు, పెసలు, మినుములు, శనగలు, గోధుమలు... ఇలా అన్నింటినీ.. కొన్నింటిని పప్పుబద్దలుగా, కొన్నింటిని మొరుముగా, మరి కొన్నింటిని పిండిగా అయ్యేంత వరకూ విసిరేవారు. ఈ సందర్భంలో కూడా మన కారణంగా ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. ఇది మూడవసూనం. దీన్నే మరాఠా, సంస్కృత భాషల రెండింటిలోనూ ‘పేషణి’ అంటారు. ఇది మూడవ పాపదోషం. ఇక నీళ్లని కడవలతో తెచ్చేందుకు వాటిని మట్టితో కడగడం, తొలవడం చేస్తారు. దానివల్ల ఎన్నో సూక్ష్మజీవులు మరణిస్తాయి. దాన్ని ‘ఉదకుంభి’ దోషంగా చెబుతారు. ఇది నాల్గవది. మరాఠాలో ‘ఉత్కంభి’ అంటారు. ఇక చీపురుతో నేలని ఊడ్చినప్పుడూ ఎన్నో జీవులు మనవల్ల చనిపోతాయి.. బలమైన సన్నికల్లు వంటి వాటిని నేల మీద పెట్టినప్పుడూ.. ఇంకా బూజు వంటివాటిని దులిపినప్పుడూ, ఆవుపేడనీటితో కలిపి కలాపం(అందం సౌందర్యం కోసం) (కలాపి)చల్లినప్పుడూ కొన్ని సూక్ష్మజీవులు మన కారణంగానే మరణిస్తాయి. ఆ పాప దోషాన్ని ‘మార్జని’ అంటారు ఉభయభాషల్లోనూ. ఆ 5 పాపదోషాలూ తొలగడం కోసం సాయి ఏ రోజునా బ్రహ్మయజ్ఞం – పితృయజ్ఞం– దేవయజ్ఞం– భూతయజ్ఞం(ఇది మరీ ముఖ్యం పంచసూనాల దోష నివృత్తికి) మనుష్యయజ్ఞమనే వాటినీ చేస్తూనే ఉండేవారు. (ఈ యజ్ఞాల గురించి 46వ భాగంలో వివరణ ఉంది) సాయి... ఈ చిన్నవాటిని ‘పంచసూనాలనే పేరిట చెప్పడమంటే? ప్రాచీన భారతీయధర్మాన్నీ, హైందవసంప్రదాయాన్నీ పాటించడం కిందికి రాదా?’ పోనీ ఇదంతా ఏ హిందూ దేవాలయంలోనా? అని ఆలోచిస్తే స్పష్టంగా మసీదులో కదా!? 2. అగ్ని ఆరాధన హైందవధర్మంలో అతి ముఖ్యమైనది దీపారాధన. ‘అగ్నిముఖా వై దేవాః’ దేవతల్లో ఏ ఒక్కరికి దేన్ని మనవి చేసుకోవాలన్నా ఆ దైవానికి సంబంధించిన జపం, ధ్యానం, మంత్రమననం అనే వాటిని– ఏ దైవానికి ఎంత సంఖ్యతో మననం చేయాలో అలా చేశాక ఆ మంత్రసంఖ్యలో దశాంశాన్ని (ఉదాహరణకి లక్షమార్లు మంత్రాన్ని మననం చేసే దానిలో 10వ వంతు అంటే.. 10 వేల మార్లు తర్పణం హోమం చేయాలి) మళ్లీ మంత్రాన్ని మననం చేస్తూ కొన్ని వస్తుద్రవ్యాలతో అగ్నిలో హోమం చేయాలి. అప్పుడు మాత్రమే ఏ దైవాన్ని పూజిస్తున్నామో కోరిక ఏమిటో ఏ దైవానికి చెందించవలసిందో అగ్నిదేవునికి తెలియజేయబడినట్లు. దాంతో ఆ అగ్ని ఆ దేవునికి ఈ వ్యక్తి వివరాలనీ కోరికలనీ తెలియజేస్తాడు ఆ అగ్నిలో వేయబడిన వస్తు ద్రవ్యాలతో సహా. ఈ అగ్నిలో వేయబడిన వస్తుద్రవ్యాలని నేతితో వేసే కారణంగా దాన్ని హవిస్సు అంటారు.అలా దేవతలతో మనకి దగ్గర సంబంధాన్ని ఏర్పరిచే దైవం అగ్ని అన్నమాట. మసీదులో నిత్యం అగ్ని వెలిగింపబడి దీప ఆరాధనం నిరంతరం సాగుతూనే ఉంటుంది. నూనె దీపాలన్నింటినీ వెలిగిస్తూ మనని నూనెకి ఇబ్బంది పెట్టడమా? అంటూ వర్తకులందరూ నూనెని ఇయ్యడం మానేసారనే విషయం – సాయే నీటితో దీపాలని మసీదు నిండుగా వెలిగించాడనీ అనుకున్నాం కదా! ఈ దీపారాధన అది కూడా మసీదులో జరగడమంటే హైందవ సంప్రదాయాన్ని పాటించడం కాదూ మరీ! అలాగే ఏ కోరిక తీరాలన్నా ఆ కోరికకి సరిపడిన హోమాన్ని చేస్తూ ఉంటాం. సరిగ్గా అదే పద్ధతి నిత్యహోమం జరుగుతూండే ‘ధుని’ ద్వారా మసీదులో నిర్వహింపబడుతూనే ఉంది. ఉదయం నిద్రనుండి లేచీ లేవగానే.. కాళ్లూచేతులూ కడుక్కుని, నోటిని పుక్కిలింత ద్వారా శుభ్రపరుచుకుని, వెంటనే గాయత్రీ మంత్రాన్ని మననం చేయడమనే ఆ హైందవసంప్రదాయాన్ని.. ‘అజపాగాయత్రి’ అంటారు. అదే విధానం సక్రమంగా సాయి చేత పాటించబడుతూ ‘అల్లాహ్హో మాలిక్!’ అనే మంత్రమే మననం చేయబడుతూ ఉండేది. ఈ లో–విశేషం తెలియని ఏ కొందరో మాత్రం ‘సాయి ఇంకా స్నానాన్నే చేయలేదు’ అని భావిస్తూ ఉండేవారు. ఈ స్నానానికి వెనుక మంత్ర మననం హైందవ సంప్రదాయం ప్రకారం ఉన్నదే కదా! పైగా ఇది మసీదులోనే జరుగుతూ ఉండేది! 3. నిత్య పారాయణాలు సహజంగా ఎవరైనా దేవాలయానికి వెళ్తే అక్కడ ఆ దైవసమక్షంలో ఆ దైవానికి సంబంధించిన – దీంతోపాటూ ఇతర దేవతలకి సంబంధించిన మంత్రాలనో స్తోత్రాల్నో శ్లోకాల్నో పాటల్నో కీర్తనల్నో పద్యాల్నో అలా నోటికొస్తే చదువుతూ ఉండటం, రాని పక్షంలో చూసి చదువుతూండటమో చేస్తుంటాం. దాన్నే పారాయణం అంటాం. ఆశ్చర్యకరమైన అంశమేమంటే.. ‘రామదాసుబువా’ వంటి శ్రోత్రియులు శ్రీమద్రామాయణాన్నీ భగవద్గీతనీ అధ్యాత్మరామాయణకీర్తనలనీ ఇన్నింటికీ ముందు గాయత్రీమంత్రజపాన్నీ చేస్తూ ఉంటే, శ్యామా వంటి వాళ్లు శ్రీ విష్ణు సహస్రనామాలని పఠిస్తూ ఉంటే.. ఇంకా ఎందరో మరెందురో వాళ్ల వాళ్ల కొచ్చిన ఎన్నెన్నో స్తోత్రాలని చదువుకుంటూనే ఉంటూండేవాళ్లు. ‘ఇది మసీదు’ అని ఏ ఒక్కరూ అభ్యంతరపెట్టడం గాని, సాయి వీరందరినీ ఉద్దేశించి పఠించవద్దని అనడం గాని ఏ నాడూ జరగనే లేదు. 4. యా సాయీ! ఖండోబా దేవాలయపు అర్చకుడైన మహల్సాపతి తనని చూస్తూనే ‘యా సాయీ!’ (సాయీ! నిన్ను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నీ రాకని పవిత్రపూర్వకంగానూ ఆదరణపూర్వకంగానూ భావిస్తున్నాను) అన్నాడు. ఈ అర్చకుడూ సామాన్యుడు కాదు నిజానికి. సాయిలో ఉన్న గొప్పదనాన్ని గమనించే ‘సాయీ!’ అనే పేరుతో పిలిచాడు. నిజంగా మహమ్మదీయాభిమానమే తనకి ఉన్నట్లయితే ‘నేను రాను!’ అనవచ్చు. మహమ్మదీయనామంతో తనని పిలిచినట్లయితేనే వస్తానని భీష్మించవచ్చు – లేదా – లోపల ద్వేషించుకుంటూ పైకి అలా అంగీకరించినట్లు భావించవచ్చు. అలాంటిదేమీ లేకుండా స్పష్టంగా తానంగీకరించాడంటే హైందవధర్మంతో మసీదు నిండిపోయి కనిపించడం లేదా? ఆయన చేతిలో ఉన్న సటుకాని సంన్యాసులకుండే ధర్మదండం (ఆకారంలో కనిపించే)గా భావించవచ్చు. నుదుట పెట్టించుకున్న భస్మాన్నీ దాన్ని కూడా త్రిపుండ్రాంకంగా (మూడు గీతలుగా భావించి ముఖాన పూసుకునే శైవ చిహ్నం) అంతేకాక హిందూసంప్రదాయానుగుణంగా ఏ చందనాన్ని అతిపవిత్రంగా భావిస్తూ అభిషేకాన్ని కూడా ఏ దైవానికి చేస్తూ ఉంటారో ఆ చందనంతో నామాన్ని డాక్టర్ పండిత్ పెడితే ఏ మాత్రపు అభ్యంతరాన్నీ పెట్టలేదు. శ్యామా మొదలైన వాళ్లు కంఠానికి చందనాన్ని రాస్తే ఆనందిస్తూ ఉండేవాడు కూడా. ఇక హైందవ సంప్రదాయ అర్చన పుష్పాలంకరణ నైవేద్యాలని పెట్టడం, హారతి విధానం, అగరుధూపసేవ.. ఇలా ఒకటేమిటి అన్నీ కూడా మసీదులోనే జరిగాయంటే ఇదంతా సంపూర్ణ హైందవ విధానం కాదూ! ఇంతటి హైందవ సంప్రదాయం పాటింపబడుతోంది కాబట్టే.. హిందూధర్మంలో నిత్యం మునకలేస్తూ ఉండే మహానుభావులైన తాపసులూ (తపస్సు మాత్రమే తను జీవన వృత్తిగా కలవారు) దండకమండలాలని ధరించేవారూ హరిద్వార్ మొదలైన పుణ్యపవిత్ర క్షేత్రంల్లో నిత్యం ఉండే యోగులూ మఠాధిపతులై మఠాల్లో ఉండే సంన్యాసులూ ఇంకా మఠం స్థాపించుకున్న స్థితిలో లేని పరి వ్రాజకులూ (నిత్యం భక్తులకి దర్శనాన్నిచ్చేందుకై యాత్రల్ని చేస్తూ తిరుగుతూ ఉండే సంన్యాసులూ) అన్నింటినీ విడిచిన త్యాగ బుద్ధితో ఉన్న త్యాగులూ ఎక్కడా భోజనాన్ని చేయకుండా తామే వండుకుని, తినే సంప్రదాయాన్ని పాటించే శిష్టులూ.. ఇలా అందరూ మసీదుకొస్తూ సాయిని దర్శించి వెళ్తూ ఉండేవారు. 5. శిరోవేష్టనం శిరః అంటే తలకి వేష్టనం అంటే ధరించిన వస్త్రవిధానమని అర్థం. మహమ్మదీయుల సంప్రదాయం ప్రకారం తలకి టోపీ పెట్టుకుంటారు. కొందరు బారుగా ఉండే పెద్ద వస్త్రాన్ని ఒక తలపాగాలాగా ఉండే పద్ధతిలో ధరిస్తారు. మరి కొందరైతే ఒంటిపొరతో గుడ్డని తలపాగగా ధరిస్తూ శిరసుని పూర్తిగా గుడ్డతో కలిపివేస్తూ కనిపిస్తాడు. సాయి శిరోవేష్టనవిధానాన్ని చూస్తే స్పష్టంగా అది ఇన్నింటికంటే భిన్నంగా కనిపిస్తుంది. ఎలా అయితే హైందవధర్మ ప్రబోధకులైన స్వాములూ సంన్యాసులూ మఠాధిపతులూ తమ శిరసు కనిపించకుండా ఉండేలా ఒంటిపొర వస్త్రాన్ని తల మీద ఉంచుకుని, రెండు చెవులూ వినపడేలానూ, శిరసు కప్పబడి ఉండేలానూ ఆ మిగిలిన వస్త్రాన్ని చెవిపక్కన ముడివేసి కనిపించేలానూ శిరోవేష్టనాన్ని కలిగి ఉంటాడు. ఆయన శిరసు ఏనాడూ ఆచ్ఛాదన లేకుండా ఉండేది కాదు– ఉండదు. మన హైందవ సంన్యాసులు కూడా అదే తీరుగా ఉంటారనేది అనుభవంలో కనిపించే సత్యమే. ఇదే శిరోవేష్టన విధానాన్ని అవలంబిస్తూ సాయి దర్శనానికి వచ్చే భక్తులు స్త్రీలైతే తల మీద చీర చెంగుని ధరిస్తూనూ, పురుషులైతే తలపాగలతోనూ వస్తూండేవారు. యతిలాగా భిక్షావృత్తి హిందూ ధర్మ సంప్రదాయంలో యతీ లేదా సంన్యాసీ అయిన మహానుభావుడు మధ్యాహ్నం ఒక్కసారి మాత్రమే బిచ్చమెత్తాలి నిరహంకార విధానాన్ని సూచించుకుంటూ.. అది కూడా 5 ఇళ్ల నుండి మాత్రమే తీసుకోవాలి. ఆ తీరుగా వచ్చిన అన్నాన్ని పప్పుతో అన్నాన్ని కలిపీ.. పచ్చడితో అన్నాన్ని కలిపీ.. పులుసుతో అలాగే పెరుగుతో.. ఈ తీరుగా వేటి రుచిని వాటికిగా అనుభవిస్తూ తినడం సంన్యాససంప్రదాయం కాదు. అన్నింటినీ కలిపి రుచిలో అభిరుచి కలిగినవానిగా కాకుండా తినాలి. మళ్లీ కావాలంటూ మారు(రెండోమారు) అడగకూడదు. తినకూడదు. ఆ రోజుకి భగవంతుడు అంత మాత్రపు ఆహారాన్నే అంతటి రుచితోనే అనుగ్రహించాడని భావించి – యదృచ్ఛాలాభ సంతుష్టః – దొరికిందానితోనే సంతృప్తిపడే లక్షణాలతో ఉండాలి సంన్యాసి. సాయి ఇదే సంప్రదాయాన్ని మసీదులో పాటిస్తూ ఉండేవాడు.ఏ భజన సంప్రదాయం మన హిందువులదో ఆ ధర్మాన్ని మసీదులో పాటింపజేస్తూ పండరినాధుని భజననీ, వేణుగోపాలుని భజననీ చేయిస్తూ చేస్తూ ఉండేవాడు. కాళ్లకి గజ్జెలని కట్టుకుని ఆనందంతో నృత్యాన్ని చేస్తూ ఉండేవాడు కూడా. ఎందరెందరో భక్తులు ఏమేమో ఆహారపదార్థాలు తెచ్చినా ఆహారపదార్థాలు తెచ్చినా సంన్యాసధర్మానికనుగుణమైన భిక్షాటనాన్ని ఏనాడూ మరవలేదు. మహానుభావులైన ఏ కొందరు మహానుభావులో పవిత్రజీవనాన్ని గడిపి మరణిస్తే వాళ్ల సమాధుల వద్ద జరిగే ఉత్సవమైన ఉరుసురోజునే శ్రీరామనవమిని ఏర్పాటు చేసి మసీదుని హిందూదైవ మందిరంగా మార్చేసాడు సాయి. పైవారం – సాయి సమక్షంలో ఆమరణ నిరాహార దీక్షా..? – సశేషం -
శిష్యుడికే శిష్యుడైన సాయి
ఏం చిత్రమో గానీ సాయి చేసే లీలలు ఓ పట్టాన అర్థం కావు. కొద్ది లోతుగా ఆలోచిస్తే అర్థం కాకుండానూ ఉండవు. ‘లో’ అర్థం గాని తెలిసిందా.. ఇక జీవితాంతం గుర్తుంచుకోవల్సినంత గుర్తుంచుకునేంత అనుభవసంపద అందులో దాగి ఉంటుంది.అందుక్కాదూ పదులు వందలుగా, వందలు వేలుగా, వేలు లక్షలుగా, లక్షలు కోట్లుగా భక్తులు వచ్చి సాయిని దర్శిస్తున్నారు! ఈ నేపథ్యంలో ఓ కుమ్మరిపురుగు లాంటివాణ్ణి గురువుగా చేసుకుని సేవ చేసిన తుమ్మెదలాంటి సాయి చరిత్రని తెలుసుకుందాం! పరివర్తన ప్రతి వ్యక్తికీ జీవించిన మొత్తం కాలం ఒక్కలానే ఉండదు. మార్పులకి గురి అవుతూనే ఉంటుంది. ఒక్కో మార్పు ఒక్కో అనుభవాన్ని అందిస్తుంది. సాయి తన యవ్వనంలో పహిల్వాన్లా ఉండాలనుకుంటూ అలాంటి దుస్తుల్నే వేసుకుంటూ, జుట్టుని కూడా అలాగే పెంచుకుంటూ అందరికీ ఓ పహిల్వాన్లాగానే పై దృష్టికి అన్పించేవాడు. ఆ కాలంలో షిర్డీలో కుస్తీపోటీలు ఎక్కువ సంఖ్యలో సాగుతూ ఉండేవి. వేటితో మనకి దగ్గరతనముంటే ఆ లక్షణాలు మనకి ఎక్కువ అలవడుతాయనేది నిజం కదా! ఈ వస్త్రధారణ , జుట్టుపెంచడం మనసులో పహిల్వాన్ ఆలోచనలూ కారణంగా కుస్తీపోటీల్లో పాల్గొనాలని అన్పించింది సాయికి. అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఓ సారి తమలపాకులు, వక్కలు అమ్ముకుని వ్యాపారం చేస్తుండే మొహిద్దీన్ అనే వ్యాపారితో వాదం వచ్చింది. లోపల కుస్తీ పట్టాలనే ప్రబలమైన ఊహ ఉంది కదా! దాంతో వాదాన్ని పెంచుకున్నారిద్దరూ. కలియబడ్డారు. కుస్తీ పోటీలో తన వృత్తిగా కల మొహిద్దీన్ చేతిలో సాయి ఓడిపోయాడు. అంతే! పగ పెరగలేదు. ద్వేషం రగలలేదు. ఇంక కొంతమందిని కూడగట్టుకుని దొంగదెబ్బ తీసి ప్రతీకారాన్ని తీర్చుకోవాలనిపించలేదు సాయికి. ఆలోచన సాగింది ఇలా..! నేనూ అతనూ కలియబడ్డాం. ఒకరినొకరు తన్నుకున్నాం కాళ్లతో. పిడికిళ్లతో పరస్పరం గుద్దుకున్నాం. జుట్టూ జుట్టూ పుచ్చుకుని కొట్టుకున్నాం. ఇదా నా సంస్కారం? ఇదా నేను సాధించదలిచిన దానికి ఎన్నుకున్న మార్గం? నేను సక్రమంగా సరైనమార్గంలో ఉంటూ పదిమందిని ఆ మార్గంలో నడిపించాల్సి ఉంటే దానికి ఎంచుకున్న మార్గం ఎంత హేయంగా ఉంది!’ అని తనని గురించి తానే సిగ్గుపడుతూ పరాభవించుకుంటూ కుస్తీవైపుకి దృష్టిని పోనియ్యకూడదనే నిర్ణయానికొచ్చాడు. ఆలోచన వచ్చిందో లేదో వెంటనే పహిల్వాన్ దుస్తుల్ని తొలగించాడు. కఫనీ (శరీరం పొడవునా ఉండే పెద్ద లాల్చీ)ని ధరించాడు. లోపల కౌపీనాన్ని పెట్టుకున్నాడు.ఇదేకాలంలో ఓ సారి ‘గంగాగీర్’ అనే అతనిక్కూడా కుస్తీల మోజు పెద్దగా ఉండేది. దాంతో ఎక్కడ కుస్తీపట్లున్నా (షిర్డీలో ఈ వినోదం ఎక్కువ) వెళ్తూ ఉండేవాడు. ఓ సారి ఓ యోధునితో కుస్తీపట్టు పడుతుంటే గంగాగీర్‌కి ఓ ఆకాశవాణి చెప్పిందా? అన్నట్లు ఓ వాక్యం విన్పించింది! ‘‘వెర్రివాడా! భగవంతునితో కుస్తీ పడుతూ(క్రీడిస్తూ) ఈ దేహాన్ని విడిచేసినా అది గొప్పపని అవుతుంది గానీ ఇది ఓ క్రీడా? దీనిలో వచ్చే జయం విజయమా?’’ అని. అంతే! గంగాగీర్‌కి ఆ క్షణంలోనే జ్ఞానోదయమయింది. కావాలని కుస్తీలో ఓడిపోయాడు. కాలక్రమంలో సంసారాన్ని విడిచేసాడు. భగవంతునితో క్రీడిస్తూ (వినోదిస్తూ) ఉండాలనే నిర్ణయానికి అనుగుణంగా ‘పుణతాంబే’ అనే పవిత్ర స్థలంలో ఓ ఆశ్రమాన్ని నిర్మించుకుని శిష్యులతో అక్కడే ఉండసాగాడు. ఇదంతా ఎందుకంటే ఏ వ్యక్తికైనా మంచిరోజులు రాబోతుంటే ‘పరివర్తన’ అనూహ్యంగా కలుగుతుందని చెప్పడానికే. ఖురాన్ పండితుని రాక ఇదిలా ఉండగా ‘రహతా’ అనే పేరున్న గ్రామానికి అహమద్‌నగర్ నుండి ‘జవహర్ అలీ’ అనే ఫకీరు (సాధువు) కొందరు శిష్యులతో సహా వచ్చాడు. ఎక్కడ తానుండాలా? ఉంటే బాగుంటుందా? మంచి ప్రచారం సాగుతుందా? అని గమనించి రహతా గ్రామంలోని వీరభద్రమందిరానికి దగ్గర్లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కువమంది భక్తులొచ్చే ఆ మందిర సమీపంలో ఉంటే తనకి ప్రచారం బాగా ఉంటుందనేదే అలీ ఆలోచన.ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఫకీరైన అలీ సామాన్యుడు కాడు. మంచి పండితుడు. కురానే–ఎ–శరీఫ్ (ఖురాన్) అతనికి కంఠస్థం (కంఠంలో ఉంటుంది. ఎక్కడ అడిగితే అక్కడి ఆ గ్రంథంలోని విషయాన్ని పుస్తకాన్ని చూడకుండా చెప్పగలతనం). ఆ కారణంగా భక్తులు తెలుసుకోవాలనే తపనతో (జిజ్ఞాస) ఏ అనుమానాన్ని అడిగినా కురాన్–ఎ–శరీఫ్ని అవలీలగా ఆశువుగా చెప్పేస్తూ ఆ ప్రశ్నకి లేదా సందేహానికి సమాధానాన్ని సరిగ్గా అతుక్కుపోయేలా చెప్పి అందర్నీ తక్కువకాలంలో ఆకట్టేసుకున్నాడు. నిజం కూడా అంతేగా! సందేహాల్ని తీర్చగల సమర్థుణ్ణి అందరూ ఆసక్తితో సమీపిస్తారు గదా! దాంతో భక్తుల సంఖ్య పెరుగుతూ వెళ్తూండడం, ఆయన్ని గౌరవిస్తూండడం, కానుకలని సమర్పిస్తూ ఉండడం.. ఇలా ఆయన ప్రాచుర్యం ప్రసిద్ధి బాగా పెరిగిపోయింది. ఎప్పుడూ ప్రతివ్యక్తీ తనని తాను అదుపు చేసుకోవాల్సి ఉండేది పెరుగుదలలోనే. నిచ్చెనని ఎక్కుతూ వెళ్లేవానికి పడిపోయే ప్రమాదముంటుంది. గానీ నేల మీద నిలబడ్డవానికి ఏముంటుంది పడిపోతాననే భయం? అలీ అనే గురువుకి ఈ భక్తుల ఆదరణ పెరుగుతుండేసరికి ఓ దురాలోచన రానే వచ్చింది. వీరభద్రమందిరానికి (ఆలయం అనుకోవచ్చు) దగ్గరగా మహమ్మదీయ సంప్రదాయం ప్రకారం నిలబడి ప్రార్థించే ఓ గోడ (ఈద్గా)ని నిర్మించాలని నిర్ణయించాడు. భక్తుల అండదండలున్నాయి గదా! అనేదే అతని దృఢనిశ్చయం. మహమ్మదీయులంతా ‘ఈద్–ఉల్–ఫితర్’ అనే పండుగరోజున సామూహికంగా నిలిచి ప్రార్థించే పవిత్రస్థలమే ‘ఈద్గా’ అంటే. ఈ ఫకీర్ రహతాకి రావడం, గ్రామ ప్రజల్ని లోబరుచుకోవడం, ఆకర్షణకి గురయ్యే విధంగా చేసుకోవడం, ఆ క్రమంలో మహమ్మదీయ సంప్రదాయ ధోరణిలో ‘ఈద్గా’ని నిర్మించదలపెట్టడంతో హైందవ భక్తులకి కళ్లు విప్పారాయి. నిద్రావస్థలో ఉన్నామనే అభిప్రాయం సామూహికంగా కలిగింది. ఇంకా ఏ స్థితికి అలీ వెళ్లిపోతూ ఇంకెంత అథమస్థాయికి హైందవుల్ని తొక్కేస్తాడో అనిపించి అందరూ కలిసి ఆ ఫకీరుని రహతా నుండి వెళ్లగొట్టేశారు. గోడనిర్మాణం కాస్తా ఆగిపోయింది. అలీ ఎక్కడికి వెళ్లాలా? అని ఆలోచించుకుంటూ సాయి ఉన్న షిర్డీకి మకాం మార్చాడు. షిర్డీకే కాదు. సాయి సమీపంలో అంటే ఆయనవద్దే మసీదులో ఉండడం కోసం తన మకాంని షిర్డీ మసీదులోకి మార్చేశాడు. ఇంకేముంది? మసీదులో సాయి దర్శనాని కొచ్చే భక్తులందరితో తీపి తీపి సంభాషణలని చేస్తూ కురాన్–ఎ–శరీఫ్లోని వాక్యాలని చెప్తూ సాదరంగా సప్రమాణంగా విషయాలని వివరిస్తూ ఉంటే భక్తులందరికీ ‘సాయికి మించినవాడు అలీ’ అనే అభిప్రాయం దాదాపుగా వచ్చేసింది. దీన్ని అదనుగా తీసుకుని ‘అలీ’ కూడా సాయిని తన శిష్యునిగా చెప్పుకుంటూ ఉండేవాడు తన వద్దకి వచ్చిన భక్తులతో. ఆ సందర్భంలో సాయి కూడా ఆ అలీని తనకి ఎలా గురువువి? అని వ్యతిరేకించడం గానీ వాదించడం గానీ భక్తులతో నిజాన్ని చెప్పడం గానీ చేయలేదు సరికదా, ఆ అలీకి శిష్యునిగానే సాయి సేవలని చేయడం మొదలెట్టాడు కూడా. దీంతో భక్తులకి ఏం అర్థం కాలేదు పరిస్థితి.ఈ క్రమంలో అలీ తన మకాంని మళ్లీ ‘రహతా’ గ్రామానికే మార్చదలిచాడు. సాయికి అలీలోని లోపాలు బాగా తెలుస్తుండేవి. అలీకి సాయిలోని గొప్పదనాలు తెలుస్తుండేవి. దీంతో ఎంత తొందరగా ‘రహతా’ కి వెళ్తే అంతగానూ తన గురుస్థానం బలపడుతుందని భావించాడు అలీ. సాయితో మాట మాత్రం కూడా చెప్పకుండా సాయినీ శిష్యులనీ తీసుకుని ‘రహతా’ గ్రామానికి మకాం మార్చేశాడు. ఇలా తాము నమ్ముకున్నసాయి అకస్మాత్తుగా అలీకి లోబడిపోవడం, అంతేకాకుండా ఎంతకాలంనుండో ఉంటున్న షిర్డీ గ్రామాన్ని విడిచి భక్తుల్ని కూడా దూరం చేస్తూ, దూరం చేసుకుంటూ, వెళ్లిపోవడం అందరికీ చాలా బాధాకరమైంది. రహతానుండి వచ్చే కొందరి ద్వారా సాయి తన గురువు కానీ గురువైన అలీకి నీళ్లు కూడా మోసి తెస్తుండేవాడనీ, ఇది చేయదగినది, అది చేయరానిది అనే భేదం, ఉచ్చం నీచం అనే వివక్ష కూడా లేకుండా సేవ చేస్తున్నాడనీ తెలిసి ఎంతో మనోబాధ పడుతుండేవారు సాయి భక్తులంతా. కొందరు ఈ సాయికి ఏదో మంత్ర ప్రయోగం చేసి ఉంటాడని, ఇంకొందరు ఇక సాయికీ మనకీ సంబంధాలు దూరమైపోయినట్లేననీ, అలీ మన సాయిని వదిలిపెట్టనే పెట్టడనీ.. ఇలా ఎవరికి తోచిన ఆలోచనలతో వాళ్లు అంటూండేవారు. అనుకుంటుండేవారు. ఈ భక్తుల మాటలు నిజమే సుమా! అనుకోవడానికి వీలుగా సాయి తన గురువైన అలీతో షిర్డీ గ్రామానికి అలా చుట్టపు చూపుగా వచ్చేసి వెంటనే వెళ్లిపోతుండేవాడు కూడా. నాలుగు సంవత్సరాల నుండి షిర్డీ గ్రామంతో అంతా చిక్కని చక్కని అనుబంధమున్న సాయి ఎలా ఎందుకు పొరుగూర్లో ఉంటున్నాడనేది ఎవరికీ అంతుబట్టలేదు. బాబాతో దూరంగా ఉండడమనే ఈ వియోగాన్ని షిర్డీ ప్రజలు భక్తులైన జనానికి తట్టుకోలేనిదిగా అయింది. అంతా తమంత తాముగా ఒకచోటికి చేరి – రహతాకి వెళ్లి సాయిని ప్రార్థించి బ్రతిమాలి బామాలి విన్నవించి మన స్థితిని వివరించి ఎలాగైనా షిర్డీకి తెచ్చేసుకుందామని గట్టిగా తీర్మానించుకున్నారు ఇలా అందరూ ఒకటి కావడం ఒకే మాట మీద ఉండడం ఒకే తీర్మానాన్ని చేసుకోవడమనేదాన్నే ‘ఏకగ్రీవం’ (ఏక–ఒకే, గ్రీవం–కంఠంగా కావడం –కంఠం అనేది మాటని పలుకుతుంది కాబట్టి అందరిదీ ఒకే మాట కావడమని అర్థం) అంటారు. అలా అందరూ కలిసి రహతా గ్రామానికి వెళ్లారు. అలీ అనే ఆ గురువు లేని సమయాన్ని పసి గట్టి మొత్తానికి సాయిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుని సాయిని షిర్డీకి శాశ్వతంగా వచ్చేయవలసిందని విన్నవించుకున్నారు. సాయిలో ఉన్న గొప్పగుణాల్లో ఒకటి ఎదుటివారు చెప్పే విషయం మొత్తాన్ని పూర్తిగా వినడం, అలా వింటున్న కాలంలో తన అభిప్రాయమేదో దాన్ని చూచాయిగా కూడా తన ముఖకవళికలలో వ్యక్తం చేయకపోవడమూను. అంతేకాదు. పూర్తిగా విన్నాక తన అభిప్రాయాన్ని విస్పష్టంగా చెప్పడమే తప్ప, వంకరగా మాట్లాడకపోవడం కూడా ఆయన విశిష్టలక్షణమే. వీరి ప్రార్థనని మొత్తమంతా విన్నాక సాయి వీళ్లందరికీ చక్కని సమాధానమిస్తాడనుకుంటే ఆ సాయి మాట్లాడుతూ.. షిర్డీవాసులారా! నా గురువైన అలీ మహా కోపిష్టి. ఆయనకి చెప్పనిదే నేను ఏ పనినీ చేయను, చేయకూడదు. మీరు నన్ను ఇలా దొంగతనంగా కలిశారని ఆయనకి తెలిసినా, దురదృష్టవశాత్తూ ఇప్పుడే మనం ఆయన కంటబడినా పరిస్థితి సక్రమంగా ఉండదు. ఇక నన్ను విడిచిపెట్టనే పెట్టడు సరికదా అనుక్షణం నా మీద నిఘా ఉంచనే ఉంచుతాడు. ఇలా మనం ఆయన కంటపడితే తీవ్రంగా అగ్నిలా ప్రజ్వరిల్లిపోతాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తాడు. మీ మాటని నేను వినడం మాట అటుంచి, నా మాట విని మీరు వెంటనే షిర్డీకి వెళ్లిపోండి అన్నాడు. షిర్డీ భక్తులందరికీ మతిపోయింది. ‘సాయి మనందరికీ దిక్కు’ అని అనుకుంటూ ఉంటే ఆయనకి దిక్కు మరొకరున్నారని ఆయన అనడమేమిటి? పైగా ఎప్పుడో పరిచితులమైన మనకంటే.. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు ఈ అలీ మీద ఇంత గౌరవం, భయమేమిటి సాయికి? అనుకుంటూ ఉండగానే సాయి అన్నట్లుగా అలీ అకస్మాత్తుగా అక్కడికి రానేవచ్చాడు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ‘‘ఈ ‘కుర్రవానికోసం’ వచ్చారా? ఇతణ్ణి పంపనే పంపను షిర్డీకి. నా శిష్యుడు ఇతను. ఇక్కణ్ణుండి పొండి’’ అన్నాడు అలీ. చల్లకొచ్చి ముంత దాచడం, శత్రువు ఎదురైనప్పుడు యుద్ధాన్ని మాని బతిమిలాడడం ప్రయోజనం లేని పని అని భావించి షిర్డీ ప్రజలంతా అలీ మీద వాగ్యుద్ధంతో తిరగబడ్డారు. దాంతో అలీకి లోపల కొద్దిగా జంకు కలిగింది. ‘సరే! నేను ఈ కుర్రవాణ్ణి పంపను. వస్తే మేమిద్దరం వస్తాం షిర్డీకి!’ అన్నాడు అలీ. అందరికీ అప్పటికి ఆమోదమయింది. అనుకున్నట్టుగా ఆ ఇద్దరూ షిర్డీకి వచ్చేశారు. షిర్డీవాసులందరికీ పండుగ వాతావరణం వచ్చేసింది. ఇక ‘అలీ’ని ఎలా సాయి నుంచి వదిలించాలా? సాయిని ఎలా తమ వైపుకి రప్పించుకోవాలా? అని ఆలోచించారు భక్తులంతా. షిర్డీలో దేవీదాస్ అనే మహా తేజోవంతుడైన పండితుడు ఉన్నాడు. ఆయనకి ఎంతో గొప్పవారూ వయసులో పెద్దవారూ అయిన తాత్యా పాటిలు, షింపీ వంటి ఎందరో శిష్యులుగా అయి ఎన్నెన్నో విషయాలని ఈయన నుండి తెలుసుకుంటూ ఉండేవారు. అలాంటి దేవీదాసుకి సాయి భక్తులంతా విషయాన్ని పూస గుచ్చినట్లుగా చెప్పి.. శరణుకోరుతున్నామన్నారు. దేవీదాసు అలీ ఉన్న చోటుకొచ్చి అలీతో వాదం ప్రారంభించాడు. కేవలం కురాన్–ఎ–శరీఫ్ కంఠస్థం చేసి ఉండడమే తప్ప వాటిలోతులు తెలియని కారణంగా దేవిదాసు వాదపాండిత్యం ముందు అలీ తట్టుకోలేక ఓటమిని అంగీకరించి సాయిని విడిచేసి షిర్డీ నుండి పారిపోయాడు. మేఘం విడిచిన సూర్యునిలా మళ్లీ సాయి దేదీప్యమానంగా ప్రవేశించసాగాడు. కొన్నేళ్ల తర్వాత అలీ షిర్డీకి వచ్చి సాయి పాదాల మీద పడి మన్నింపవలసిందని వేడి పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు అందరి సమక్షంలోనూ. లో భావం..? సాయి ఎందుకిలా ప్రవర్తించాడనేది గట్టి ప్రశ్న కదా! వ్యక్తికి అహంకారమనేది ప్రారంభమే పెరుగుతున్న కాలంలో పతనమౌతామనే విషయం స్ఫురణలోకి రాదు. దీనికి ఉదాహరణే ‘అలీ’! మంచో చెడో ఒకరినంటూ గురువుగా ఎన్నుకున్నాక, అతణ్ని ఆశ్రయించాక శిష్యునిలానే గురువుకి శుశ్రూష చేయాల్సిందే తప్ప నడుమలో విడిచివేయకూడదు. నిజమైన గురువు ఎలా ఉండడో, ఎలా ఉండేవాడు మాత్రమే గురువో ఆ విషయాన్ని తెలియజేయ దలిచాడు సాయి. తెలియజెప్పాడు. లోకంలో ఎందరో కేవలం పాండిత్యం ద్వారా జనాన్ని ఆకర్షిస్తూ, ఆ తాము చెప్పేదాన్ని ఆచరించకుండా స్వప్రచారం ద్వారా ఎంతెంత ఎత్తులకి ఎదిగిపోతారో గమనిస్తూ వాళ్లని నిజమైన గురువులుగా ఎలా లెక్కించకూడదో తెలియజేసే వృత్తాంతమే ఈ సంఘటన. ఇలా జనం అందరికీ గుండెలలోతుగా విషయాన్ని అర్థమయ్యేలా చేసేందుకు సాయి ఆ కపట వంచన గురువుకి యథార్థ శిష్యునిగా సేవ చేశాడు. అందుకే సాయి లీలల్ని లోతుగా అర్థం చేసుకోవాలని చెప్పేది కూడా! మహమ్మదీయుల ‘ఉరుసు’ పండుగని సాయి శ్రీరామనవమిగా మార్చాడు. అది ఎలా జరిగిందో చూద్దాం! ∙డా. మైలవరపు శ్రీనివాసరావు -
శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం
1986 సమయానికి సాయిబాబా పూర్తిగా తెలుగువారి జీవితాల్లోకి ప్రవేశించలేదు. బాబా గురించి వినడం, తెలుసుకోవడం అప్పుడప్పుడే మొదలవుతోంది. కాని అప్పటికే తెలుగు నాటఅయ్యప్ప స్వామి దీక్షలు విస్తృతంగా ఉన్నాయి. అయ్యప్ప స్వామి లీలల గురించి, మహిమల గురించి, శబరిమల క్షేత్రం గురించి భక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ సమయంలోతెలుగువారికి పామర జనం స్థాయిలో కూడా షిర్డీ క్షేత్రం గురించి తెలియజేసిన సినిమా ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’.దేశంలో మూడో సినిమామనుషులు తమకు అండగా ఉండే దేవుణ్ణి కనుగొనడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు. పరమాత్ముణ్ణి బహు రూపాలలో సేవించాలని చూడటం ఇందుకు ఒక కారణం. తెలిసినదేవుళ్లు, ఇది వరకు నుంచి సేవిస్తున్న దేవుళ్లు ఎలానూ రక్షిస్తారు కాని ఈ కొత్త దేవుడు తమ సమస్యలను మరింత తొందరగా తీరుస్తాడేమోనన్న ఆశ మరొక కారణం. పంతొమ్మిదవశతాబ్దంలో అయ్యప్పస్వామి, షిర్డి సాయిబాబా దేశ ప్రజలకు విశేష ఆరాధనీయం ఇందుకే అయ్యారు. ప్రతి దేవునికి పురాణ గాథ ఉంటుంది. సాయికి సచ్చరిత్ర ఉంది. షిర్డీ సాయికి సమీప అనుచరుడిగా ఉంటూ ఆయనను చూసి, ఆయన ద్వారా విని ఆయన జీవితాన్ని గోవింద్ రఘునాథ్ దభోల్కర్ అలియాస్ హేమాడ్ పంత్ అనే భక్తుడు ‘సాయి సచ్చరిత్ర’గా గ్రంథస్తం చేశారు. సాయి జీవితం తెలుసుకోడానికి అదే ప్రామాణిక గ్రంథం. ఈ గ్రంథం ఆధారంగానే ఆయన మీద సినిమాలు కూడా నిర్మితం అయ్యాయి. మరాఠీలో ఒకటి, హిందీలో ఒకటి నిర్మితం అయ్యాక సాయి గురించి మంచి సాంకేతిక ప్రమాణాలతో శక్తిమంతంగా, భక్తులను తాకేలా తీసిన సినిమా మన తెలుగు వారు తీసిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ కావడం గొప్పగా చెప్పుకోవాల్సిన సంగతి. సాయి సచ్చరిత్రను ఆధారంగా తీసుకుని ప్రక్షిప్తాలు లేకుండా తీశారు ఈ సినిమాను. సబ్ కా మాలిక్ ఏక్ హై సాయి బాబా జన్మ వృత్తాంతంలో ఒక మార్మికత ఉంది. తాను ముస్లిమో.. హిందువో ఆయన ఎక్కడా బయట పెట్టలేదు. కాని ఆయన జీవితం మొత్తం సర్వ మతాల అనుసంధానానికి ఉపయోగించారని అర్థమవుతుంది. ఆయన ఆహార్యం ముస్లిం ఫకీర్. కాని ఆయన తాను నివసించిన మసీదుకు ‘ద్వారకామాయి’ అని పేరు పెట్టారు. ఒక వైపు నమాజు, ఫాతెహాలు చదివారు. మరోవైపు హైందవ సంప్రదాయంలో దీపాలు వెలిగించారు. ఒక వైపు ఖురానును ప్రబోధించారు. మరోవైపు గీతను ఆదర్శంగా తీసుకున్నారు. ‘సబ్ కా మాలిక్ ఏక్’ అనిచెప్పడం ద్వారా తాను దైవ సందేశహారునిగా ఆయన చెప్పుకున్నా.. ఆయనను ప్రవక్త స్థానం నుంచి భక్తులు భగవంతుని స్థానానికి తీసుకొని వెళ్లారు. సాయిబాబా ఇప్పుడు దేవిదేశాలలో ప్రధానంగా హిందువుల దేవునిగా ఆరాధనీయం అయ్యాడు. ఈ సంఘటనల వరుస అంతా ఈ సినిమాలో ఉంది. పాపాలు తొలగించే దీపం ఒక పెళ్లి బృందంతో పాటు సాయిబాబా (విజయచందర్) షిర్డీ గ్రామానికి రావడంతో ఈ సినిమా మొదలవుతుంది. గ్రామస్తులు ఆయనను ‘సాయి’ అని పిలిచారు. ‘సాయి’ అనే మాటనుకబీర్ దాస్ దేవుణ్ణి ఉద్దేశించి ఉపయోగించాడు కనుక సాయిలో ఆ దైవ స్వరూపం చూసి, అలా పిలిచానని ఆ ఊరి పూజారి అంటాడు. అలా పేరూ ఊరూ లేని ఆ ఫకీర్ సాయిబాబాగాప్రజలకు తెలిశాడు. అయితే ముస్లిం ఫకీర్‌లా కనిపిస్తున్న ఇతణ్ణి తొలిరోజుల్లో కొంత మంది హిందువులు ఇబ్బంది పెట్టారు, వ్యతిరేకించారు. మరికొంతమంది పిచ్చివాడి కింద జమకట్టారు. కాని దైవత్వాన్ని కనుగొనడంలో ప్రజలు ఎప్పుడూ పొరపడరు. అందువల్ల అందరూ త్వరగా సాయి భక్తులుగా మారారు. ‘తోటి మనిషికి సాయపడు. ప్రకృతిని చూసి నేర్చుకో.అహంకారాన్ని వదిలిపెట్టు. పవిత్ర గ్రంథాలను చదివి, నీ సన్మార్గాన్ని ఎంచుకో. గురువును ఆశ్రయించు. అన్ని మతాల సారం ఒకటే అని గ్రహించు’ వంటి చిన్న చిన్న ఉపదేశాలే సాయిచేశారు. కాని కఠినమైన దర్శనాలన్ని ఇలా సరళంగానే కనిపిస్తాయి కదా. సాయి ఎంతో అవసరమైతే తప్ప మహిమలు చూపలేదు. ఆయన యోగ సాధకుడన్నది వాస్తవం. కానిఎదుటివారి మనసుల్లో ఏముందో తెలుసుకోవడం, దూరంగా జరిగే విషయాలను గ్రహించం చేసేవారనడానికి భక్తుల ఉదంతాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటితో దీపాలు వెలిగించడం,పాదాల దగ్గర గంగా, యమునలు ప్రవహింప చేయడం, మూడు రోజుల పాటు ఆత్మను శరీరం నుంచి వేరు చేసి చూపడం.. ఆయన ప్రధాన మహిమలుగా భక్తులు భావిస్తారు. అవంతా ఎంతో హృద్యంగా ఈ సినిమాలో చూపించారు.‘పరీక్షలు మీకే కాదు నాకూ ఉంటాయి’ అని సాయి ఒక సన్నివేశంలో అంటారు. దేవుణ్ణి పరీక్షించడానికి ఈ సినిమాలో ‘నానావలి’గా చంద్రమోహన్ అద్భుతమైన నటన ప్రదర్శిస్తారు.భిక్షాటన ద్వారా భక్తుల పాపాలను తీసుకుని, వారికి పుణ్యఫలం అందిస్తానని సాయి అన్నారు. అలాగే భక్తుల కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతారని ఈ సినిమాలో చూపిస్తారు.తాను మేనల్లుడిగా భావించే తాత్యా కోతో పాటీల్కి మహమ్మారి సోకితే అతడి ప్రాణాలు కాపాడటానికి తాను ఆ మహమ్మారిని తీసుకుని, సాయి సమాధిస్థితికి చేరుకున్నారని కథనం.విజయచందర్ ఈ సన్నివేశంలో ప్రేక్షకులకు కంట తడి పెట్టిస్తారు. దేవుడు ప్రదర్శించే కరుణ అది.‘నా వైపు చూడు నీ వైపు చూస్తాను’,‘ఎలా పిలిస్తే అలా పలుకుతాను’,‘నా సమాధి నుంచి సమాధానం ఇస్తాను’ అని సాయి అనడం ప్రేక్షకులకు కొండంత ధైర్యం ఇస్తుంది. సాయి ఆరాధనకు ప్రేరేపిస్తుంది.షిర్డీని నేడు రోజుకు పాతికవేల మంది దర్శిస్తున్నారు. ముఖ్య దినాల్లో లక్ష మంది కూడా దర్శిస్తుంటారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య ఎంతో పెరగవచ్చు. పెరుగుతుంది. అలాగే షిర్డీ సాయిమీద భవిష్యత్తులో ఎన్నో సినిమాలు రావచ్చు. తెలుగులోనే ఈ సరికి ఎన్నో సినిమాలు, సీరియళ్లు వచ్చాయి. కాని ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’కు కుదిరినట్టుగా ఏ సినిమాకూ అంతబాగా అన్నీ కుదరలేదు.ఎందుకంటే ఈ సినిమాకు బాబా ఆశీస్సులు ఉన్నాయి.కాలం గడిచే కొద్దీ ఈ సినిమా క్లాసిక్‌గా ప్రేక్షకుల ఆశీస్సులు కూడా పొందుతూనే ఉంటుంది. ఇళయరాజా దివ్య సంగీతం హాస్య చిత్రాలు తీస్తాడని మంచి పేరున్న కె.వాసు ఈ సినిమాను ఇంత బాగా తీయడం అనూహ్యమైన విషయం. ఇందుకు ఆయన చూపిన చిత్తశుద్ధే కారణం. అందుకే ఇది పెద్ద హిట్అయ్యింది. విజయచందర్ హృదయంలో కరుణను, వదనంలో తేజస్సును ప్రదర్శించి తానే ఆ సాయి అన్నట్టుగా మెస్మరైజ్ చేసారు. అందరికంటే ముందు ఈ సినిమాకు తన వంతు సేవచేసి నిలబెట్టాలని భావించినవాడు ఇళయరాజా. ఆయన తన పాటలతో ఈ సినిమాను పదింతల పైన నిలబెట్టాడు. ‘దైవం మానవ రూపంలో..’, ‘మా పాపాలు తొలగించే దీపాలు నీవే..’,‘సాయీ శరణం బాబా శరణం’, ‘నువ్వు లేక అనాథలం’, ‘బాబా సాయిబాబా’... ప్రతి పాట ఒక మణిపూస వలే నేటికీ తెలుగునాట సాయి పాట అంటే ముందు నిలిచే విధంగా ఉంటుంది. – కె. -
ఆడుతూ పాడుతూనే అనుగ్రహిస్తాడు!
గురువుల్లో సద్గురువు సాయినాథుడు. గురుశిష్య సంబంధం, పరమేశ్వరుడికి, పరమభక్తుడికి నడుమ అనుబంధం లాంటిదని అడుగడుగునా సాయివాణిని వినిపించారు. గురువుపైనే చిత్తాన్ని, ఏకాగ్రతను చూపితే పరమార్థం సులువుగా బోధపడుతుందని విడమరచి చెప్పారు. చిత్తశాంతికి, వెలుగుదారిలో బతుకు పయనం సాగడానికి అంతకు మించిన మార్గం లేదని జీవనతత్వం బోధించారు. గురుహృదయాన్ని పసిగట్టి, దానినాయన ఆజ్ఞాపించడానికి పూర్వమే నెరవేర్చడం ఉత్తమ శిష్యుల లక్షణం. ఆయన తరచు ‘‘రాముడు, రహీము ఒక్కడే! ఏ మాత్రం తేడాలేదు. మరిక వారి భక్తులు ఎందుకు విడిపోయి పోట్లాడుకోవటం, అందరూ కలసి జాతీయ సమైక్యత సాధించండి’’ అని చెప్పేవారు. అంతేకాదు, సామాజిక సమస్యలకు సమాధానం చెప్పారు. అనేకమైన లౌకిక బాధలకు పరిష్కార మార్గం చూపారు. ఒక ఫకీరుగా, పరమయోగిగా, నిరంతర ఆత్మానుసంధానంలో మునిగి ఉండే బాబా... తన భక్తుల కోసం – మానవాళికోసం వారిలో ఒకరిగా జీవించారు. ఆడారు, పాడారు, కష్టాలు, కన్నీళ్లలో సహానుభూతిని ప్రదర్శించారు. తనవైన లీలలతో కాపాడారు. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. గురువులు మానవరూపంలో అవతరించేది మనుష్యులను ఉద్ధరించేందుకే. అందువల్ల అతని అసలయిన నిర్గుణ స్వభావం కొంచెం కూడా చెడి పోదు. వారి దాక్షిణ్యం, దైవికశక్తి, జ్ఞానం ఏమాత్రం తరగదు. శిష్యుడు కూడా అటువంటి స్వరూపం కలవాడే. అనేక జన్మల అజ్ఞానం తానే శుద్ధ చైతన్యమనే సంగతిని మరుగున పడేలా చేస్తుంది. అతను తనను తాను ‘నేను సామాన్య నికృష్ట జీవుడను’ అని అనుకుంటాడు. గురువు శిష్యుడిలోని ఆ అజ్ఞానాన్ని మూలంతో సహా తీసివేయాలి. తగిన ఉపదేశాన్ని ఇవ్వాలి. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానాన్ని గురువు నిర్మూలించి ఉపదేశించాలి. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడననుకొనే శిష్యుణ్ణి గురువు కొన్ని వందల జన్మల వరకు నీవే దైవం, ‘నీవే సర్వశక్తి మంతుడివి’ అని బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొద్దికొద్దిగా తానే దైవమని గ్రహిస్తాడు. తాను శరీరమనే భ్రమను, తానొక జీవినని లేదా అహంకారమని, అనేక జన్మల నుంచి వస్తున్న దోషం దానిపై ఆధారపడి చేసిన పనుల నుండి సంతోషం, విచారం, ఈ రెండింటి మిశ్రమం కలుగుతుంది. -
సాయికృప వల్లే మళ్లీ సినిమాల్లో నటిస్తున్నా
నకిరేకల్ : తాను సాయినాథుని కృపవల్లే మళ్లీ ఆరోగ్యంగా ఉంటూ సీనిమాల్లో నటిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్ వెల్లడించారు. నకిరేకల్‌లోని ఐశ్వర్యసాయి మందిరంలో మంగళవారం రెండవ రోజు సాయేదైవం సినిమా షూటింగ్లో భాగంగా రెండవ రోజు పాటలను చిత్రీక రించారు. ఇందులో భాగంగా చంద్రమోహన్‌పై సాయి మందిరంలో పాటను తీశారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడారు. సాయిబాబా చిత్రంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తాను సాయిబాబా భక్తుడనని పేర్కొన్నారు. కుటుంబ సమేతంగా నకిరేకల్‌లో సాయినాథున్ని దర్శించుకున్నట్లు చెప్పారు. సినిమాను నిర్మిస్తున్న శ్రీనివాస్‌ను అభినందించారు. 45 ఏళ్లుగా అనేక సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పారు. వీటిలో 50 సినిమాలు తనకు మంచి పేరుతెచ్చాయని గుర్తు చేశారు. సిరిసిరిమువ్వ, రంగులరాట్నం, సీతామహలక్ష్మి, పదహారేళ్లవయస్సు, రాధాకల్యాణం, ఇంటింటిరామయాణం తదితర చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయని వివరించారు. ప్రముఖ నటుడు బాలకృష్ణతో నటించిన లయన్ సినిమా త్వరలో విడుదల కానుందని తెలిపారు. ఆయన వెంట సతీమణి జలేంద్ర, సాయి ట్రస్ట్ ప్రతినిధులు యాటా మధుసూదన్‌రెడ్డి, తోనుపూనురి శ్రీనివాస్, నోముల గోవిందరాజులు ఉన్నారు.